విదేశీ పర్యటనకు రూ. కోట్లున్నాయి కానీ... | Devineni Nehru takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

విదేశీ పర్యటనకు రూ. కోట్లున్నాయి కానీ...

Jan 27 2015 1:29 PM | Updated on Mar 18 2019 7:55 PM

విదేశీ పర్యటనకు రూ. కోట్లున్నాయి కానీ... - Sakshi

విదేశీ పర్యటనకు రూ. కోట్లున్నాయి కానీ...

టీడీపీ 8 నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవినేని నెహ్రు మంగళవారం విజయవాడలో ఆరోపించారు.

విజయవాడ: టీడీపీ 8 నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవినేని నెహ్రు మంగళవారం విజయవాడలో ఆరోపించారు. మీ విదేశీ పర్యటనకు వెళ్లడానికి రూ. కోట్ల ఉన్నాయి కానీ,  ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవా అని సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. రైతులకు ఎంతమేర రుణమాఫీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ప్రజల ఆశలు గల్లంతయ్యాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవినేని నెహ్రు వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వరుసగా సన్మానాలు చేయించుకుంటూ ఏపీకి ప్రత్యేక హోదా ఉంటుందంటూ గతంలో చెప్పి... ఇప్పుడు మాట మారుస్తున్నారని దేవినేని నెహ్రు ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement