శ్రీవారి సేవలో 'పద్మావతి' | deepika padukone visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో 'పద్మావతి'

Nov 10 2017 12:05 PM | Updated on Nov 10 2017 12:18 PM

 deepika padukone visits tirumala - Sakshi

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పదుకొనె దర్శించుకున్నారు.

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పదుకొనె దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమెకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

దీపికను చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. దీపిక నటించిన 'పద్మావతి' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్‌పుట్‌ ల చరిత్ర ఆధారంగా సంజయ్‌ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీపికా వెంట దర్శకురాలు ఫరా ఖాన్‌ కూడా స్వామి సేవలో పాల్గొన్నారు. కాగా వివాదాలతో నిత్యం వార్తల్లో నలుగుతున్న పద్మావతి  మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement