తండ్రికి అంతిమ సంస్కారాలు చేసిన తనయ | Daughter Compleats Father Funeral Programme in Krishna | Sakshi
Sakshi News home page

తండ్రికి అంతిమ సంస్కారాలు చేసిన తనయ

Dec 28 2018 1:31 PM | Updated on Dec 28 2018 1:31 PM

Daughter Compleats Father Funeral Programme in Krishna - Sakshi

బొడ్డపాడులో తండ్రి అంతిమయాత్రలో కుమార్తె జ్యోత్స్న

కృష్ణాజిల్లా, తోట్లవల్లూరు (పామర్రు) : కన్నతండ్రికి కుమార్తె అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన మండలంలోని బొడ్డపాడులో చోటు చేసుకుంది. తండ్రి తరఫున వారసులు ఉన్నా ఎవరూ ముందుకు రాకపోవటంతో కన్న కూతురే అన్నీ తానై జరిపించి పితృ రుణం తీర్చుకుంది. గ్రామానికి చెందిన గోరంట్ల శ్రీనివాసరావు (53) టైలరింగ్‌ చేస్తూ జీవనం సాగించేవాడు. ఆయనకు భార్య శివపార్వతి, కుమార్తెలు జ్యోత్స్న, శ్రీలక్ష్మి ఉన్నారు. శ్రీనివాసరావు కొంతకాలంగా అనారోగ్యానికి గురై ఈ నెల 25వ తేదీ రాత్రి మృతి చెందాడు. అతనికి తలకొరివి పెట్టేందుకు వారసులు ముందుకు రాలేదు. దీంతో పెద్ద కుమార్తె జ్యోత్స్న కొడుకు పాత్ర పోషించింది. తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించి గ్రామస్తులతో శభాష్‌ అనిపించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement