లోక్‌అదాలత్‌లో బాధితుడికి రూ.కోటి నష్టపరిహారం | Crore Compensation For Victim In Lok Adalat In YSR district | Sakshi
Sakshi News home page

లోక్‌అదాలత్‌లో బాధితుడికి రూ.కోటి నష్టపరిహారం

Dec 15 2019 4:28 AM | Updated on Dec 15 2019 4:28 AM

Crore Compensation For Victim In Lok Adalat In YSR district - Sakshi

కడప అర్బన్‌: వైఎస్సార్‌ జిల్లా కడపలోని ఎన్జీవో కాలనీకి చెందిన ఆర్‌ వీర సుదర్శన్‌రెడ్డికి శనివారం జాతీయ లోక్‌అదాలత్‌లో రూ.కోటి పరిహారం లభించింది. 2015లో ఇంపీరియల్‌ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌ ఫారమ్స్‌ సంస్థతో పన్నెండు సెంట్ల స్థలం అగ్రిమెంట్‌ విషయంలో సుదర్శన్‌రెడ్డికి వివాదముంది. దీనిపై ఆయన జిల్లా కోర్టులో కేసు వేశారు. శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ సందర్భంగా జిల్లా కోర్టులోని మొదటి బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌ సమక్షంలో సంస్థ ప్రతినిధులకు సుదర్శన్‌రెడ్డికి మధ్య రాజీ కుదిర్చారు. సుదర్శన్‌రెడ్డికి రూ.కోటి నష్టపరిహారాన్ని వెంటనే అందేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్‌ జిల్లా వ్యాప్తంగా లోక్‌ అదాలత్‌లో పరిష్కారమైన 1446 కేసులలో ఇంత పరిహారం వచ్చిన కేసు ఇదే కావడం విశేషం. 

Advertisement
 
Advertisement
Advertisement