ఆ టీడీపీ నేతపై క్రిమినల్ కేసు! | criminal case on brahmasamudram tdp leader | Sakshi
Sakshi News home page

ఆ టీడీపీ నేతపై క్రిమినల్ కేసు!

Jun 14 2015 2:48 PM | Updated on Aug 16 2018 4:36 PM

ఆ టీడీపీ నేతపై క్రిమినల్ కేసు! - Sakshi

ఆ టీడీపీ నేతపై క్రిమినల్ కేసు!

బ్రహ్మసముద్రం టీడీపీ నేత వెంకటేశ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు.

అనంతపురం: బ్రహ్మసముద్రం టీడీపీ నేత వెంకటేశ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. వేరుశెనగ విత్తనాల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారనే వివాదం నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా జిల్లాలో వేరు శెనగ విత్తనాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వీటికోసం రైతులు అగచాట్లు పడుతున్నారు.

అనంతపురం, బెలుగుప్ప, పుట్టపర్తి, సోమంవేపల్లి, గోరంట్లలో రైతుల ఆందోళన నిర్వహించారు. చాలీచాలని విత్తనాలు సరఫరా చేస్తున్నారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. విత్తనాలు టీడీపీ నేతలు అక్రమంగా తరలిస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు బ్రహ్మసముద్రం టీడీపీ నేత వెంకటేశ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement