టీడీపీ కార్యాలయానికి కోవిడ్‌ నోటీసులు.. | Covid Notice To Amaravati TDP Office | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యాలయానికి కోవిడ్‌ నోటీసులు..

May 27 2020 4:35 PM | Updated on May 27 2020 4:48 PM

Covid Notice To Amaravati TDP Office - Sakshi

సాక్షి, అమరావతి : మంగళగిరి ఎమ్మార్వో అమరావతి టీడీపీ కార్యాలయానికి కోవిడ్‌ నోటీసులు జారీచేశారు. మహానాడు సందర్భంగా కరోనా వైరస్‌ నివారణ చర్యలు తీసుకోవాలని బుధవారం నోటీస్‌ ఇచ్చారు. ఈ మేరకు కార్యాలయ కార్యదర్శి రమణికి ఆత్మకూరు వీఆర్వో నోటీసులు అందజేశారు. ఈ నోటిసులో ‘‘ రాజకీయ ఫంక్షన్లు, ఇతర సమావేశాలపై ప్రస్తుతం నిషేదం ఉంది. కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ 2005 ద్వారా చర్యలకు అర్హుల’’ ని ఎమ్మార్వో పేర్కొన్నారు. కాగా, కరోనా వైరస్‌ను అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా అన్ని సామాజిక, రాజకీయ, క్రీడ, వినోద, విద్య, సాంస్కృతిక, మత వేడుకలు, సమావేశాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

చదవండి : బాబు లాక్‌డౌన్‌ ఉల్లంఘన పిల్‌పై హైకోర్టులో విచారణ

Advertisement
 
Advertisement
Advertisement