బాబు లాక్‌డౌన్‌ ఉల్లంఘన పిల్‌పై హైకోర్టులో విచారణ | AP High Court Trial On Chandrababu Lockdown Violation Pill | Sakshi
Sakshi News home page

బాబు లాక్‌డౌన్‌ ఉల్లంఘన పిల్‌పై హైకోర్టులో విచారణ

May 27 2020 12:49 PM | Updated on May 27 2020 12:57 PM

AP High Court Trial On Chandrababu Lockdown Violation Pill - Sakshi

ఏపీ హైకోర్టు

సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునా​యుడు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించటంపై దాఖలైన  ప్రజాప్రయోజన వాజ్యంపై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. బాబు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించటంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారా? లేదా? అని న్యాయస్థానం పిటిషనర్‌ను ప్రశ్నించింది. గతంలో ఇలాంటి కేసును నేరుగా హైకోర్టు విచారణకు స్వీకరించిందని పిటిషనర్‌ హైకోర్టు దృష్టికి తీసుకురాగా.. ఐదుగురు ఎమ్మెల్యేల కేసుతోపాటు చంద్రబాబునాయుడు కేసును కూడా రేపు(గురువారం) విచారిస్తామని హైకోర్టు తెలిపింది. కాగా, లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. (లాక్‌డౌన్‌ నిబంధనలు చంద్రబాబు బేఖాతర్‌)

రెండు నెలల తర్వాత సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు లాక్‌డౌన్‌ నిబంధనలను తుంగలో తొక్కారు. బాబు వస్తున్నారని తెలిసిన తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో రోడ్లమీదకు చేరుకున్నారు. మాస్క్‌లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా బాబుకు స్వాగతం పలకటానికి ఎగబడ్డారు. జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్లలో మాజీ ఎమ్మెల్యేల శ్రీరామ్‌ తాతయ్య, తంగిరాల సౌమ్యలు టీడీపీ జెండాలతో చంద్రబాబు స్వాగతం పలికేందుకు వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు కారు బయటకు వచ్చి టీడీపీ శ్రేణులకు అభివాదం తెలిపారు. ( చంద్రబాబుపై హైకోర్టులో పిల్‌..)

Advertisement
 
Advertisement
Advertisement