పోటీకి పోటెత్తింది | Competition had been | Sakshi
Sakshi News home page

పోటీకి పోటెత్తింది

Mar 15 2014 12:52 AM | Updated on Oct 16 2018 7:36 PM

పోటీకి పోటెత్తింది - Sakshi

పోటీకి పోటెత్తింది

మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ నెల 10న ప్రారంభమైన ఈ ప్రక్రియలో తొలిరోజు ఒక్క నామినేషన్ దాఖలు కానప్పటికీ...

నర్సీపట్నం/యలమంచిలి, న్యూస్‌లైన్ : మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ నెల 10న ప్రారంభమైన ఈ ప్రక్రియలో తొలిరోజు ఒక్క నామినేషన్ దాఖలు కానప్పటికీ, ఆఖరి రోజున మాత్రం వెల్లువెత్తాయి. శుక్రవారం రెండు మున్సిపాలిటీల్లో 131 నామినేషన్లు వేశారు. మొత్తంగా యలమంచిలిలో 24 వార్డులకు 135, నర్సీపట్నంలో 27 వార్డులకు 160 దాఖలయ్యాయి. వీటిలో అధికంగా వైఎస్సార్‌సీపీ తరపున123 వేయడం విశేషం. జాతీయ పార్టీ కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది.

నర్సీపట్నంలో మాత్రమే 7 వచ్చాయి. యలమంచిలిలో ఆ పార్టీ తరపున ఒక్కరూ వేయలేదు. ఈ ఘట్టంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీల ప్రతినిధులు ర్యాలీగా వచ్చి నామినేషన్లు వేశారు. శనివారం ఈ నామినేషన్లను పరిశీలిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement