లారీ ఢీకొని బాలుడి మృతి | child died in lorry accident in vizag | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని బాలుడి మృతి

Nov 18 2015 7:32 PM | Updated on Sep 3 2017 12:40 PM

విశాఖ జిల్లాలో ఆడుకుంటున్న చిన్నారిని లారీ ఢీకొట్టడంతో బాలుడు అక్కడిక్కడే మృతిచెందాడు.

విశాఖపట్నం: విశాఖ జిల్లాలో ఆడుకుంటున్న చిన్నారిని లారీ ఢీకొట్టడంతో బాలుడు అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాండ్రంగి నితీష్(3) ఇంటి ముందు ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం ఎదుట ఆడుకుంటున్న సమయంలో గోస్తని నది నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో నితీష్ అక్కడికక్కడే మృతిచెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement