బాబు వాడిన ‘నాటు’కీయం!

Chandrababu Viral Photo on Eruvaka Program - Sakshi

నిజానికి నాట్లు ఎక్కడ వేస్తారు.. పొలంలో. కానీ, రెండ్రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం రావికంటిపేట గ్రామంలోని గ్రీన్‌ఫీల్డ్‌ మైదానంలో ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని కాలుకు చెప్పులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన నాట్లు మాత్రం పొలం కాని పొలంలో. ఏరువాక ప్రారంభానికి సూచికగా అక్కడ నిజంగా నాట్లు వేస్తున్నట్లు ఆయన పోజులిచ్చేశారు. కెమేరాలు క్లిక్‌ క్లిక్‌మనేశాయి. సీన్‌కట్‌ చేస్తే.. అది పొలం కాదని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. మైదానంలో కంకర, మట్టి తోలి అక్కడ కృత్రిమంగా ఓ మడిని ఏర్పాటుచేశారు. అంతేకాదు.. ఆయన నాటిన వరి నారు 48గంటల్లో ఎండిపోయి వాడిపోయింది. స్థానికులు ఇది చూసి హవ్వా అని ముక్కున వేలేసుకుంటున్నారు. నమ్మశక్యంగా లేదు కదూ.. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల​ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  

ప్రపంచంలో పబ్లీసిటి కోసం పాకులాడే వారు ఎవరైనా ఉన్నారా అంటే మొదట మన ముఖ్యమంత్రి చంద్రబాబు తరువాతే అని అందరూ చెబుతారు., నీరు లేకుండానే వరి పండించగల సమర్థుడు బాబు, ఎండు పొలంలో వరినాటే టెక్నాలజీ.. బీకాంలో ఫిజిక్స్‌ చెప్పించే సమర్థత మన టీడీపీ నాయకులకే సాధ్యం  అంటూ నెటిజన్లు వీటిపై కామెంట్లు గుప్పిస్తున్నారు. 

చంద్రబాబు వేసిన వరినాట్లు 48 గంటల్లోనే ఎండిపోయిన దృశ్యం  (ఇన్‌సెట్‌లో) గ్రీన్‌ఫీల్డ్స్‌ మైదానంలో పొలాన్ని తలపించేలా కృతిమంగా ఏర్పాటు చేసిన మడి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top