'అభివృద్ధి కోసం ఐదు గ్రిడ్ లు ఏర్పాటు' | chandrababu to setup five grids for developments | Sakshi
Sakshi News home page

'అభివృద్ధి కోసం ఐదు గ్రిడ్ లు ఏర్పాటు'

Aug 28 2014 7:22 PM | Updated on Sep 2 2017 12:35 PM

'అభివృద్ధి కోసం ఐదు గ్రిడ్ లు ఏర్పాటు'

'అభివృద్ధి కోసం ఐదు గ్రిడ్ లు ఏర్పాటు'

రాష్ట్ర అభివృద్ధి కోసం ఐదు గ్రిడ్ లు ఏర్పాటు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

రాజమండ్రి: రాష్ట్ర అభివృద్ధి కోసం ఐదు గ్రిడ్ లు ఏర్పాటు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వాటర్, పవర్, గ్యాస్, బ్రాడ్ బ్యాంగ్ గ్రిడ్ లు నెలకొల్పుతామని చెప్పారు. ప్రధానమంత్రి జనధన యోజన కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీయిచ్చారు. ఇసుక ర్యాంపుల నిర్వహణ డ్వాక్రా సంఘాలకు అప్పగించి వచ్చే లాభంలో 25 శాతం వాటికే ఇస్తామని వెల్లడించారు. రుణమాఫీకి బ్యాంకులు సహకరించాలని చంద్రబాబు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement