చంద్రబాబుకు మళ్లీ వాస్తు భయం | chandrababu naidu fear of vaastu again | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు మళ్లీ వాస్తు భయం

Jun 20 2017 7:16 PM | Updated on Aug 18 2018 8:27 PM

చంద్రబాబుకు మళ్లీ వాస్తు భయం - Sakshi

చంద్రబాబుకు మళ్లీ వాస్తు భయం

టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మళ్లీ వాస్తు భయం పీడిస్తోంది.

అమరావతి: టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మళ్లీ వాస్తు భయం పీడిస్తోంది. దీంతో ఆయన ఏపీ సచివాలయంలో తన రూట్‌ మార్చారు. గేట్‌ నంబర్‌ 1 నుంచి కాకుండా గేట్‌ నంబర్‌ 2 నుంచి చంద్రబాబు సచివాలయంలోకి వెళుతున్నారు. అయితే వాస్తు కారణాలతోనే సీఎం రూట్‌ మార్చినట్లు అధికారులు చెబుతున్నారు.

కాగా ఓటుకు కోట్లు కేసుతో చిక్కుల్లో పడిన సమయంలోనూ చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి వాస్తుపై దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా ఆయన తన రాకపోకల దారి మార్చుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఇప్పటివరకూ కుడివైపు తిరిగేవారు. ఇక నుంచి ఎడమ వైపునకు తిరిగి రాకపోకలు సాగించేవారు. అలాగే పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ను కూడా వాస్తు ప్రకారం మార్పులు చేర్పులు చేసిన విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement