హే.. వినయ్యా నువ్వు: చంద్రబాబు అసహనం | Chandrababu fires on Agrigold victims | Sakshi
Sakshi News home page

హే.. వినయ్యా నువ్వు: చంద్రబాబు అసహనం

Nov 24 2018 1:17 PM | Updated on Nov 24 2018 2:01 PM

Chandrababu fires on Agrigold victims - Sakshi

అగ్రిగోల్డ్ బాధితులపై సీఎం చంద్రబాబు నాయుడు దురుసుగా ప్రవర్తించారు.

సాక్షి, అనంతపురం : అగ్రిగోల్డ్ బాధితులపై సీఎం చంద్రబాబు నాయుడు దురుసుగా ప్రవర్తించారు. తమకు న్యాయం చేయాలని కోరిన అగ్రిగోల్డ్ బాధితుడు సిద్ధేశ్వర్‌ను హుంకరించిన చంద్రబాబు అసహనంతో చేయెత్తారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగేళ్లుగా పొరాడుతున్నా ఎలాంటి న్యాయం జరగలేదని చంద్రబాబు ఎదుట అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క‍్రమంలోనే బాధితుడు సిద్ధేశ్వర్‌.. చంద్రబాబును నిలదీయగా.. ‘హే .. వినయ్యా నువ్వు!, ఆ కోర్టు వుంది కదా.. ఎవడేం చేస్తాడు. వేరే స్టేట్‌లో పట్టించుకున్నారా’ అంటూ చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. మిగిలిన రాష్ట్రాల కంటే తానే బాగా చేస్తున్నానంటూ చంద్రబాబు కోపంతో ఊగిపోయారు. అగ్రిగోల్డ్ విషయంలో చేయాల్సిందంతా చేస్తున్నామంటూ అసహనంతో చంద్రబాబు మండిపడ్డారు. కాగా, సీఎం వైఖరిని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తీవ్రంగా ఖండించింది. 

Advertisement
 
Advertisement
Advertisement