సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి | cellphone charging | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

Mar 2 2014 4:49 AM | Updated on Mar 10 2019 8:23 PM

సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ విద్యార్థి మృతిచెందాడు.

 సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన వలిగొండ మండలం గొల్నేపల్లిలో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సింగపాక బాబు అలియాస్ నరేష్(21)  తన చైనా సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టడానికి మిత్రుడి వద్ద చార్జర్ తెచ్చుకున్నాడు.

ఇంట్లో చార్జింగ్ పెట్టడానికి విద్యుత్ స్విచ్ వేశాడు. వెంటనే విద్యుత్‌షాక్ కొట్టడంతో కేకలు వేశాడు. సమీపంలోని అతని సోదరుడు నవీన్ వచ్చి నరేష్‌ను లాగేందుకు యత్నించాడు. అతనికి కూడా విద్యుత్‌షాక్ కొట్టింది. వెంటనే తేరుకుని స్విచ్ ఆఫ్ చేశాడు. అప్పటికే నరేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ప్రైవేటు వాహనంలో రామన్నపేట వైద్యశాలకు తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతుడు రామన్నపేట డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ మేరకు ఎస్‌ఐ మంజునాథరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement