కేసముద్రంలో 4 లక్షలతో పట్టుబడ్డ కాంగ్రెస్ నేత! | Cash Seized from congress leader and arrested | Sakshi
Sakshi News home page

కేసముద్రంలో 4 లక్షలతో పట్టుబడ్డ కాంగ్రెస్ నేత!

Apr 10 2014 2:48 PM | Updated on Mar 18 2019 9:02 PM

జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు 4 లక్షల రూపాయలను అక్రమంగా తరలిస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని వరంగల్ జిల్లాలో అరెస్ట్ చేశారు.

కేసముద్రం: జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు 4 లక్షల రూపాయలను అక్రమంగా తరలిస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని వరంగల్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఎన్నికల తనిఖీలో భాగంగా కేసముద్రం స్టేషన్ పరిధిలోని సబ్ స్టేషన్ తండా వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రంజిత్ కుమార్ కు కాంగ్రెస్ నేత దస్రూ నాయక్ తారసపడ్డారు.
 
ఆయన కారులో సోదా చేయగా 4 లక్షల రూపాయలను దొరికాయి.  పట్టుబడిన సొమ్ముకు వివరాలు వెల్లడించకపోవడంతో కాంగ్రెస్ నేతను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న డబ్బును ఆదాయపు పన్ను అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement