తల్లిదండ్రుల సజీవదహనం.. కుమారుడూ మృతి | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల సజీవదహనం.. కుమారుడూ మృతి

Published Sun, Jun 14 2015 6:50 PM

burned alive, the son of parents .. In the event of death

కృష్ణా: నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో తల్లిదండ్రులను సజీవ దహనం చేసిన ఘటనలో గాయపడిన ఏడుకొండలు(35) అనే వ్యక్తి ఆదివారం మరణించాడు. ఈ నెల 11 తెల్లవారు జాము 2 గంటల సమయంలో ఆస్తి విషయమై తల్లిదండ్రులతో గొడవపడి పెట్రోలు పోసి చంపే ప్రయత్నంతో తాను కూడా గాయపడ్డాడు. ఈ ఘటనలో తల్లిదండ్రులు శోభనాచలం, మాణిక్యమ్మ మరణించగా.. గాయపడిన కుమారుడ్ని స్థానికులు నూజివీడులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు.
(నూజివీడు)

Advertisement

తప్పక చదవండి

Advertisement