జిల్లాను స్మార్ట్‌సిటీగా మారుస్తాం: బొత్స

Botsa: We Will Make Anantapur District Into Smart City - Sakshi

సాక్షి  అనంతపురం : అనంతపురం నగరాన్ని స్మార్ట్సిటీగా మారుస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఇంఛార్జి మంత్రి హోదాలో సోమవారం నుంచి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి బొత్స.. మంగళవారం ఉదయం అనంతపురం అర్భన్ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డితో కలిసి అనంత నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో బిందెలకాలనీ, ఎస్సీ కాలనీ, గుత్తి రోడ్డు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారాయణపురం పంచాయతీలో డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశీలించారు. అలాగే అన్ని మున్సిపాలిటీ లు, కార్పొరేషన్లలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అనంతపురంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంజూరు చేస్తామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top