మండలిలోనూ వీగిపోయిన విభజన బిల్లు | bifurcation bill defeated in council as well | Sakshi
Sakshi News home page

మండలిలోనూ వీగిపోయిన విభజన బిల్లు

Jan 30 2014 1:35 PM | Updated on Jun 18 2018 8:10 PM

శాసన మండలిలో కూడా తెలంగాణ బిల్లు వీగిపోయింది. ఈ మేరకు మంత్రి రామచంద్రయ్య ఇచ్చిన తీర్మానాన్ని మండలి ఆమోదించింది.

శాసన మండలిలో కూడా తెలంగాణ బిల్లు వీగిపోయింది. రాష్ట్ర విభజన బిల్లును తిరస్కరిస్తూ, శాసన మండలి నాయకుడిగా మంత్రి రామచంద్రయ్య ఇచ్చిన నోటీసుపై శాసన మండలి చైర్మన్ చక్రపాణి ఓటింగ్ నిర్వహించారు.

నోటీసును మండలి ఆమోదించింది. దీంతో విభజన ముసాయిదా బిల్లును మండలి తిరస్కరించినట్లయింది. విభజన ముసాయిదా బిల్లును వెనక్కి పంపాలని నిర్ణయం తీసుకున్న తర్వాత శాసనమండలి నిరవధిక వాయిదా పడింది.

Advertisement
 
Advertisement
Advertisement