బీటెక్ విద్యార్థిని బలవన్మరణం | B tech student commits suicide in chitoor district | Sakshi
Sakshi News home page

బీటెక్ విద్యార్థిని బలవన్మరణం

Jan 28 2016 11:50 AM | Updated on Nov 6 2018 7:56 PM

చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం అమ్మచెరువు మిట్ట గ్రామంలో బుధవారం ఉదయం ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

మదనపల్లె రూరల్: చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం అమ్మచెరువు మిట్ట గ్రామంలో బుధవారం ఉదయం ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన శివలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ తన కుమార్తె సుమలత( 22) ను కురబలకోట సమీపంలోని అంగళ్లు ఎంఐటీ కళాశాలలో బీటెక్ చదివిస్తోంది. ప్రస్తుతం బీటెక్ ఫైనలియర్‌లో ఉన్న సుమలత గురువారం ఉదయం తల్లి ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని  బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement