రాష్ట్ర ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి | Andhra Pradesh Government Employees get 27 percent interim relief | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి

Jan 2 2014 4:30 PM | Updated on Jun 2 2018 2:36 PM

రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త సంవత్సర కానుక ప్రకటించింది. 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చేందుకు అంగీకరించింది.

హైదరాబాద్: రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త సంవత్సర కానుక ప్రకటించింది. 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చేందుకు అంగీకరించింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో, ఉద్యోగ సంఘాలు గురువారం జరిపిన చర్చలు ఫలించాయి. జనవరి 1 నుంచి ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వంపై మూడు నెలల్లో రూ.1,920 కోట్ల భారం పడనుంది.

మధ్యంతర భృతి పెంపుపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కిరణ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రశంసించింది. ఉద్యోగులపై ఉన్న ప్రేమతోనే ఎన్నడులేని విధంగా 27 శాతం ఐఆర్ ఇచ్చారని పేర్కొంది. జూలై నుంచి ఐఆర్ ఇవ్వకపోవడం అసంతృప్తిని కలిగించిందని సచివాలయం తెలంగాణ ఉద్యోగుల సంఘం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement