breaking news
interim relief fund
-
ఐఆర్ ప్రకటన వాయిదా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటన వాయిదా పడింది. తొలుత భావించిన విధంగా రాష్ట్రావతరణ దినం రోజున దీనిపై ప్రకటన చేయడం లేదని.. ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. వేతన సవరణ సంఘం నివేదిక రాకముందే ఐఆర్ ప్రకటిస్తే.. పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మధ్యంతర భృతి ప్రకటన అంశంపై శుక్రవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సమావేశం జరిగింది. ఇందులో పీఆర్సీ చైర్మన్ సీఆర్ బిస్వాల్, సభ్యుడు మహమ్మద్ అలీ రఫత్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి శివశంకర్, సీఎంవో అధికారులు నర్సింగ్‌రావు, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో ఐఆర్ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘‘వేతన సవరణ కమిషన్ వేసి కొద్దిరోజులే అయింది. నివేదిక రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ నివేదిక రాకుండా ఐఆర్ ప్రకటిస్తే కమిషన్‌ను అగౌరవపర్చినట్టే అవుతుంది. పీఆర్సీ వేసిన తర్వాత నివేదిక రాకుండా ఐఆర్ ప్రకటిస్తే కాగ్ సైతం అభ్యంతర పెట్టవచ్చు. అందువల్ల నివేదిక వచ్చేదాకా ఆగితే మంచిది..’’అని ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కనీసం పీఆర్సీ మధ్యంతర నివేదిక అందేవరకైనా వేచిచూడడం మంచిదని సూచించారు. దీంతో ముఖ్యమంత్రి కూడా ఐఆర్ ప్రకటన వాయిదాకే మొగ్గుచూపారు. భారంపైనా సమీక్ష.. ఐఆర్ ప్రకటన, చెల్లింపు అంశాలు, పడే భారం తదిత ర అంశాలను అధికారులు సీఎంకి వివరించారు. గతంలో ఉద్యోగుల వేతనాలు భారీగా పెంచిన కారణంగా ఇప్పుడు ఐఆర్ భారం కూడా భారీగానే ఉంటుందని పేర్కొన్నారు. ఒక శాతం ఐఆర్ ప్రకటిస్తే.. ఏడాదికి రూ.300 కోట్లు, పది శాతం ఇస్తే రూ.3 వేల కోట్లు, 20 శాతం ఇస్తే రూ.6 వేల కోట్లు అదనపు భారం పడుతుందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ‘‘ప్రభుత్వం ఇప్పటిదాకా చక్కటి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ వస్తోంది. తద్వారా మంచి పేరు సంపాదించుకుంది. ఇలాంటి సమయంలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయకుండా ఐఆర్ ప్రకటిస్తే.. ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది..’’ అని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేసినట్టు తెలిసింది. అధికారుల సూచనతో ఏకీభవించిన సీఎం.. ఐఆర్ ప్రకటనను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. అయితే వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని పీఆర్సీ చైర్మన్ బిస్వాల్, సభ్యుడు మహమ్మద్ అలీ రఫత్లకు చెప్పారు. అయితే పీఆర్సీ మరో సభ్యుడు ఉమామహేశ్వరరావు ఇంకా బాధ్యతలు చేపట్టలేదని, ఆయన చేరాక ప్రక్రియ మొదలవుతుందని బిస్వాల్ వివరించారు. -
ఆర్టీసీ కార్మికులను దగా చేసిన ఈయూ-టీఎంయూ
ఎన్ఎంయూ సహా ఇతర సంఘాల మండిపాటు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర భృతి (ఐఆర్) సాధించుకునే విషయంలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఈయూ-టీఎంయూల కూటమి చీకటి ఒప్పందం చేసుకుందని ఎన్ఎంయూ సహా పలు సంఘాలు ఆరోపించాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐఆర్, వేతన సవరణ సాధిస్తామని గుర్తింపు సంఘం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని పేర్కొన్నాయి. తక్కువ ఐఆర్‌కు ఒప్పుకోవటం ద్వారా కార్మికులకు అన్యాయం చేసిందని.. ఎన్ఎంయూ, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, కార్మిక సంఘ్, కార్మిక పరిషత్, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, కాంట్రాక్టు డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ యూనియన్లు విమర్శించాయి. 10 మాసాల వేతన సవరణ బకాయిలను కార్మికులు నష్టపోవాల్సి వచ్చిందని ఎన్ఎంయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు, మహమూద్ ఆరోపిం చారు. 24,577 కాంట్రాక్టు కార్మికులందరినీ ఒకే దఫాగా రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించడంలోనూ గుర్తింపు సంఘం విఫలమైందన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా (27 శాతం) ఐఆర్ సాధించటం తమ విజయమేనని, ఇదే ఊపుతో వేతన సవరణ కూడా చేయిస్తామని గుర్తింపు సంఘం ఈయూ- టీఎంయూ కూటమి ప్రకటించింది. -
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి
-
రాష్ట్ర ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి
హైదరాబాద్: రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త సంవత్సర కానుక ప్రకటించింది. 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చేందుకు అంగీకరించింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో, ఉద్యోగ సంఘాలు గురువారం జరిపిన చర్చలు ఫలించాయి. జనవరి 1 నుంచి ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వంపై మూడు నెలల్లో రూ.1,920 కోట్ల భారం పడనుంది. మధ్యంతర భృతి పెంపుపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కిరణ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రశంసించింది. ఉద్యోగులపై ఉన్న ప్రేమతోనే ఎన్నడులేని విధంగా 27 శాతం ఐఆర్ ఇచ్చారని పేర్కొంది. జూలై నుంచి ఐఆర్ ఇవ్వకపోవడం అసంతృప్తిని కలిగించిందని సచివాలయం తెలంగాణ ఉద్యోగుల సంఘం తెలిపింది.