బాబు, కిరణ్‌, జగన్‌లు ఒకే తాటిపైకి రావాలి: టీజీ | All party leaders to be come one stand, says TG Venkatesh | Sakshi
Sakshi News home page

బాబు, కిరణ్‌, జగన్‌లు ఒకే తాటిపైకి రావాలి: టీజీ

Dec 28 2013 6:53 PM | Updated on Mar 18 2019 7:55 PM

బాబు, కిరణ్‌, జగన్‌లు ఒకే తాటిపైకి రావాలి: టీజీ - Sakshi

బాబు, కిరణ్‌, జగన్‌లు ఒకే తాటిపైకి రావాలి: టీజీ

విభజన బిల్లును కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి పంపిన నేపథ్యంలో సీమాంధ్ర నుంచి తీవ్ర వ్యతిరేకతా నెలకొంది. కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా సీమాంధ్రలో ఆందోళనలు కార్యక్రమాలు పెద్దఎత్తునా సాగాయి.

కర్నూలు: విభజన బిల్లును కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి పంపిన నేపథ్యంలో సీమాంధ్ర నుంచి తీవ్ర వ్యతిరేకతా నెలకొంది. కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా సీమాంధ్రలో ఆందోళన కార్యక్రమాలు పెద్దఎత్తునా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తెలంగాణ సంక్షోభాన్ని అడ్డుకోవాలంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, సీఎం కిరణ్ కుమార్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ఒకేతాటిపైకి వచ్చి పోరాడాలని మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు.

అయితే  సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఇద్దరు రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కోరుకుంటున్నారని చెప్పారు. కాగా,  విభజన జరిగితే పార్టీ వీడే అవకాశం ఉంటుందని టీజీ వెంకటేష్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement