​​​​​​​ఉద్యమ బాట పట్టనున్న అగ్రి బాధితులు | Agrigold Victims Making Groundwork To Protest For Justice | Sakshi
Sakshi News home page

​​​​​​​ఉద్యమ బాట పట్టనున్న అగ్రి బాధితులు

Apr 11 2018 9:09 PM | Updated on May 28 2018 3:04 PM

Agrigold Victims Making Groundwork To Protest For Justice - Sakshi

సాక్షి, విజయవాడ : న్యాయం కోసం అగ్రిగోల్డ్‌ బాధితులు ఉద్యమ బాట పట్టనున్నారు. గురువారం విజయవాడలో అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు అసోసియేషన్‌ కార్యదర్శి తిరుపతి రావు బుధవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యవర్గ సమావేశం అనంతరం, ఈ నెల 13న దాసరి భవన్‌లో అసోసియేషన్‌ రాష్ట్ర జనరల్‌ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అందులో ప్రభుత్వ వైఖరిపై, తాజా పరిణామాల నేపథ్యంలో బాధితులకు న్యాయం జరిగే విధంగా ఉద్యమ కార్యాచరణ ఖరారు చేస్తామని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement