ప్రకాశంలో లారీ బీభత్సం: ఆరుగురు మృతి | 6 People died in lorry accident in naguluppalapadu prakasam district | Sakshi
Sakshi News home page

ప్రకాశంలో లారీ బీభత్సం: ఆరుగురు మృతి

Aug 18 2013 3:27 PM | Updated on Sep 1 2017 9:54 PM

ఓ లారీ డ్రైవర్ పీకల వరకు మద్యం సేవించి వాహనం నడిపి ఆరుగురు మృతికి కారణమైన ఘటన ఆదివారం ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

ఓ లారీ డ్రైవర్ పీకల వరకు మద్యం సేవించి వాహనం నడిపి ఆరుగురు మృతికి కారణమైన ఘటన ఆదివారం ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. నాగులప్పులపాడు మండలం చదలవాడ, మద్దిరాలపాడు వద్ద అతడు నడుపుతున్న వాహనం  ఎదురుగా వస్తున్న ఆటో, బైక్లను ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

 

మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

మృతదేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement