నాగర్‌కర్నూల్: వరుస ప్రమాదాలతో రోడ్లు రక్తమోడుతున్నాయి. తాజాగా శ్రీశైలం రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం హాజీపూర్ సమీపంలో ఓ కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరి తీవ్ర గాయాలవ్వగా, కారు నుజ్జునుజ్జు అయ్యింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంచితే, నిన్న(సోమవారం, నవంబర్ 3వ తేదీ) రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాద చోటుచేసుకుంది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతిచెందారు. మరోకవైపు ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెలు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.
తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. ఇటీవల బంధువుల పెళ్లి ఉండటంతో ముగ్గురు సొంతూరుకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు.
ఇదీ చదవండి:
రోజుకు 15 మందిని చంపేస్తున్న అతివేగం


