రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు | 6 injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు

Oct 19 2015 10:51 AM | Updated on Aug 30 2018 3:56 PM

విశాఖపట్టణం జిల్లా అనంతగిరి మండలం ఎస్.కోట ఘాట్ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున కారు-సఫారి ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

అనంతగిరి: విశాఖపట్టణం జిల్లా అనంతగిరి మండలం ఎస్.కోట ఘాట్ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున కారు-సఫారి ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అరకు అందాలు తిలకించేందుకు వెళ్లిన పర్యాటకులతో వెళ్తున్న సఫారీ వాహనాన్ని కారు ఢీకొంది. క్షతగాత్రులందరూ పెందుర్తి గ్రామానికి చెందినవారు. గాయపడినవారిలో రామేష్, లోవరాజు, సాయికుమార్, నాగేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement