breaking news
ananthgiri
-
పర్యాటకులను దోచుకున్న యువకుల అరెస్ట్
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అడవిలో ప్రయాణికులు, పర్యాటకులను బెదిరించి దోచుకున్న ఐదుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతగిరి అడవులను చూసేందుకు వచ్చిన పర్యాటకులను యువకులు కత్తులతో భయపెట్టి బంగారం, డబ్బులు, సెల్ఫోన్లు దోచుకెళ్లారు. పర్యాటకుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురు యువకులు అరెస్టు చేశారు. పట్టుబడిన యువకుల వికారాబాద్‌కు చెందిన వారు. వారిపై రౌడీషీట్ తెరుస్తామని వికారాబాద్ డీఎస్పీ శిరీష తెలిపారు. అనంతగిరిలో సీసీ కెమెరాలను, గస్తీని మరింత పెంచుతామని చెప్పారు. -
అనంతగిరిలో పోలీసుల తనిఖీలు
విశాఖ: విశాఖ జిల్లాలోని అనంతగిరిలో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా బీహార్ కు చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
60 కిలోల గంజాయి పట్టివేత
అనంతగిరి: ఒడిశా సరిహద్దు నుంచి ఢిల్లీకి కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అర్ధరాత్రి దాటక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గంజాయితో పాటు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా చిలకలగెడ్డ ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక చోటు చేసుకుంది. ఒడిశా నుంచి స్కోడా కారులో 60 కిలోల గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
అనంతగిరి: విశాఖపట్టణం జిల్లా అనంతగిరి మండలం ఎస్.కోట ఘాట్ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున కారు-సఫారి ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అరకు అందాలు తిలకించేందుకు వెళ్లిన పర్యాటకులతో వెళ్తున్న సఫారీ వాహనాన్ని కారు ఢీకొంది. క్షతగాత్రులందరూ పెందుర్తి గ్రామానికి చెందినవారు. గాయపడినవారిలో రామేష్, లోవరాజు, సాయికుమార్, నాగేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.