ఒడిశా సరిహద్దు నుంచి ఢిల్లీకి కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అర్ధరాత్రి దాటక వాహన తనిఖీలు చేపట్టారు.
60 కిలోల గంజాయి పట్టివేత
Jan 9 2016 11:13 AM | Updated on Sep 3 2017 3:23 PM
అనంతగిరి: ఒడిశా సరిహద్దు నుంచి ఢిల్లీకి కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అర్ధరాత్రి దాటక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గంజాయితో పాటు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా చిలకలగెడ్డ ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక చోటు చేసుకుంది. ఒడిశా నుంచి స్కోడా కారులో 60 కిలోల గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement