గంజాయి డాన్‌.. టీడీపీ మహిళ | TDP leader behind Penchalaiah assassination | Sakshi
Sakshi News home page

గంజాయి డాన్‌.. టీడీపీ మహిళ

Nov 30 2025 4:19 AM | Updated on Nov 30 2025 10:42 AM

TDP leader behind Penchalaiah assassination

నెల్లూరు రూరల్‌ అడ్డాగా నెలకు రూ.కోట్లలో అక్రమ వ్యాపారం.. స్థానిక ప్రజాప్రతినిధికి రూ.50 లక్షల చొప్పున ముడుపులు? 

టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అండతో ఎదిగిన అరవ కామాక్షి.. గతంలో జీవిత ఖైదీ శ్రీకాంత్‌ పెరోల్‌లోనూ ఎమ్మెల్యే పాత్ర 

సీపీఎం నేత పెంచలయ్య హత్యలో నిందితులు టీడీపీ కార్యకర్తలే.. ఎమ్మెల్యే అండ చూసుకునే.. వెంటాడి మరీ దారుణ హత్య

సాక్షి, టాస్క్ ఫోర్స్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సష్టిస్తు్తన్న సీపీఎం నేత, నెల్లూరు­లో గంజాయి వ్యతిరేక ఉద్యమకారు­డు పెంచలయ్య దారుణ హత్య వెనుక టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ము­ఖ్య అనుచరుల పాత్ర బయటపడింది. గంజాయి బ్యాచ్‌ ఘాతుకంతో.. ఎమ్మె­­ల్యే అ­రాచక శక్తులను పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణ­లకు బలం చేకూరుతోంది. 

కల్లూరుపల్లి హౌసింగ్‌ బోర్డు ప్రాంత వాసి పెంచలయ్య హత్య కేసులో టీడీపీకి చెందిన అరవ కామాక్షి, ఆమె తమ్ము­డు జేమ్స్, వారి అనుచ­రులను పోలీసులు నిందితు­లుగా గుర్తించా­రు. ప్రధాన నిందితులకు అత్యంత సన్ని­హితంగా ఉండే టీడీపీ చోటా నేత పాత్రపైనా అనుమానం ఉండటంతో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. గతంలోనూ ఇతడిపై అనేక ఆరోపణలున్నట్లు తెలుస్తోంది. కామా­క్షి, జేమ్స్‌తో పాటు పెంచలయ్య హత్య కేసు­లోని మరో ఇద్దరిపైనా సస్పెక్ట్‌ షీట్లు ఉన్నట్లు సమా­చారం. 

బోడిగాడితోట నుంచి గంజాయి రాణిగా.. 
అరవ కామాక్షి, జేమ్స్‌ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అండదండలతో నేర సామ్రాజ్యా­న్ని విస్తరించారనే ఆరోపణలు వెల్లువెత్తు­తున్నాయి. నెల్లూరులోని బోడిగాడి­తోట­M­­­ý ు చెందిన కామాక్షి అధికార పార్టీ ర్యాలీ­లు, సభ­లకు ప్రజలను తీసుకెళ్తూ ఆ పార్టీ నే­త­లకు దగ్గరయ్యారు. శ్రీధర్‌రెడ్డి దన్ను­తో  గంజాయి విక్రేత స్థాయినుంచి డాన్‌గా ఎదిగిందని చెబుతు­న్నారు. దీంతో ఆమె అరాచకాల­కు అడ్డు లేకుండాపోయింది. 

నెలకు రూ.50 లక్షల మా­మూళ్లు ముట్టజెబుతూ అక్రమ వ్యాపార సామ్రాజ్యా­న్ని విస్తరించి­నట్లు ప్రచారం జరుగుతోంది. నెల్లూ­రు రూరల్‌ కల్లూరుపల్లిలో పాత వస్తువుల కొనుగోలు దుకా­ణం నిర్వహిస్తున్న ఆమె తన వద్దకు వచ్చేవారి ద్వారా గంజాయి అమ్మిస్తోందన్న ఆరోపణలున్నా­యి. నేర చరి­తులకు ఆశ్రయమిస్తూ, చోరీలకు పాల్పడేవారితో అసా­ంఘిక కార్యకలాపాలు చేయిస్తున్నట్లు తెలిసింది. ఎవరైనా ప్రశి్నస్తే బెదిరింపులకు దిగుతోంది. 

బ్యాచ్‌లను నడుపుతున్నా పోలీసులు చర్యలు తీసు­­కోకపోవ­డం విమర్శలకు తావిస్తోంది. ఇప్పుడు పెంచ­లయ్య దారుణ హత్యతో కామాక్షి నేర ప్రవత్తి వెల్లడైంది. కోట­ంరెడ్డి వైఎస్సార్‌సీపీలో ఉండగా ఆరోపణ­లు రావ­డంతో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆయ­న్ను పక్కనపెట్టారు. కానీ, అలాంటి వ్యక్తిని చేరదీసి చంద్రబాబు టికెట్టిచ్చారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జీవిత ఖైదీ శ్రీకాంత్‌ పెరోల్‌ విషయంలోనూ కో­ట­ంరెడ్డి ప్రమేయం బయటపడగా, దానిపై ఆయ­న రక­రకాల విన్యాసాలు చేశారు. 

ఇప్పు­డు గంజాయి డాన్‌ అరవ కామాక్షి సైతం ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితమనే విషయం బయటపడింది. దీంతో వీరి గంజా­యి దందా వెనుక కూడా శ్రీధర్‌రెడ్డి పాత్ర ఉందనే ప్ర­చారం సాగుతోంది. కామాక్షి తన అనుచరులతో కలిసి.. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని గజమాలతో సన్మాని­స్తు­న్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

హత్య కేసులో 14 మంది పాత్ర  
ఈ హత్య కేసులో 14 మంది పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హౌసింగ్‌ బోర్డు కాలనీలో పెంచలయ్యను 9 మంది వె­ంటాడి కత్తులతో పొడిచి చంపారు. వాహన­­ంపై పిల్లలు ఉన్నారని కూడా చూడలేదు. హత్యలో మరో ఐదుగురి పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తూ పోలీసులు విచారణ వేగవంతం చేశా­రు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement