విశాఖ జిల్లాలోని అనంతగిరిలో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
అనంతగిరిలో పోలీసుల తనిఖీలు
Jan 22 2016 10:45 AM | Updated on Aug 21 2018 6:22 PM
విశాఖ: విశాఖ జిల్లాలోని అనంతగిరిలో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా బీహార్ కు చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Advertisement