పర్యాటకులను దోచుకున్న యువకుల అరెస్ట్‌ | five accused arrested in vikarabad | Sakshi
Sakshi News home page

పర్యాటకులను దోచుకున్న యువకుల అరెస్ట్‌

Nov 23 2017 1:18 PM | Updated on Nov 23 2017 1:38 PM

వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి అడవిలో ప్రయాణికులు, పర్యాటకులను బెదిరించి దోచుకున్న ఐదుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.

సాక్షి, వికారాబాద్: వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి అడవిలో ప్రయాణికులు, పర్యాటకులను బెదిరించి దోచుకున్న ఐదుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతగిరి అడవులను చూసేందుకు వచ్చిన పర్యాటకులను యువకులు కత్తులతో భయపెట్టి బంగారం, డబ్బులు, సెల్‌ఫోన్లు దోచుకెళ్లారు.

పర్యాటకుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురు యువకులు అరెస్టు చేశారు. పట్టుబడిన యువకుల వికారాబాద్‌కు చెందిన వారు. వారిపై   రౌడీషీట్‌ తెరుస్తామని వికారాబాద్‌ డీఎస్పీ శిరీష తెలిపారు. అనంతగిరిలో సీసీ కెమెరాలను, గస్తీని మరింత పెంచుతామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement