sara arjun
-
ముద్దుగున్న మృణాల్.. ఐస్‌క్రీమ్‌తో 'ధురంధర్' సారా
దేశీ లుక్‌లో ముద్దేచ్చేలా మృణాల్ ఠాకుర్పలుచని చీరలో 'పెద్ది' కోసం జాన్వీ కపూర్ఐస్ క్రీమ్‌తో పోజులిచ్చిన సారా అర్జున్ఎర్రచీరలో భయపెట్టేస్తున్న శ్రుతి హాసన్బుక్ చదువుతూ అందంగా మీనాక్షి చౌదరిగులాబీ చీరలో అను ఇమ్మాన్యుయేల్ View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Sara Arjun (@saraarjunn) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
తెలుగమ్మాయిలా కాయదు లోహర్.. కృతి కాక్టెయిల్ లుక్
తెలుగమ్మాయిలా లంగా ఓణీలో కాయదుఒంపు సొంపులతో మాయ చేస్తున్న అదితీ'కాక్టెయిల్ 2' మూవీ కోసం కృతి సనన్సింపుల్గా మెరిసిపోతున్న సారా అర్జున్స్టైలిష్ పోజులిచ్చేస్తున్న అనన్య నాగళ్లమహారాణి లుక్‌తో జెనీలియా రాజసం View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Sara Arjun (@saraarjunn) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) -
ఓటీటీలోకి తెలుగు డిస్ట్రబింగ్ సినిమా
పీరియాడిక్ సినిమాలు తీస్తూ వచ్చిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రూటు మార్చి ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు తీసిన సినిమా కొన్నాళ్ల క్రితమే థియేటర్లలోకి వచ్చింది. తర్వాత ఓటీటీలోకి కూడా వచ్చింది. ఇప్పుడు మరో దానిలో స్ట్రీమింగ్కి సిద్దమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఏంటి మూవీ? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)ప్రస్తుతం చాలా ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్న యువత డ్రగ్స్ వాడకం, మైనర్లపై అత్యాచారాలు తదితర అంశాలతో గుణశేఖర్.. 'యుఫోరియా' సినిమా తీశారు. 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్ లీడ్ రోల్ చేయగా భూమిక, గౌతమ్ మేనన్ కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి తొలివారంలో థియేటర్లలోకి రాగా రేపటి(ఏప్రిల్ 22) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'యుఫోరియా' విషయానికొస్తే.. చైత్ర(సారా అర్జున్) పెద్దింటి అమ్మాయి. చదువులో టాపర్. ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతుంటుంది. ఓ రోజు తన స్నేహితురాలితో కలిసి పబ్‌కి వెళ్తుంది. అక్కడ ఈమెకు వికాశ్(విఘ్నేశ్ గవిరెడ్డి), అతడి ఫ్రెండ్స్ పరిచయమవుతారు. పబ్ నుంచి తిరిగి వెళ్తున్న టైంలో వికాశ్ గ్యాంగ్.. చైత్రని తమ కారులో ఎక్కించుకుని డ్రగ్స్ మత్తులో దారుణంగా అత్యాచారం చేస్తారు. పేరు మోసిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల పిల్లలు నిందితులుగా ఉన్న ఈ కేసు చివరకు ఏమైంది? చైత్రకు న్యాయం దక్కిందా లేదా అనేది మిగతా స్టోరీ.ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలని స్పూర్తిగా తీసుకుని ఈ మూవీ తీశారు. ఈ క్రమంలోనే కొడుకు.. వావివరసలు మరిచి తల్లిపైనే దారుణానికి ఒడిగట్టడం, అత్యాచార సీన్ రీ క్రియేషన్ లాంటి కొన్ని సన్నివేశాలు డిస్ట్రబింగ్‌గా అనిపించాయి. అలా ఈ చిత్రం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) View this post on Instagram A post shared by Guna Handmade Films (@gunahandmadefilms) -
విజయ్ దేవరకొండ మూవీలో సారా అర్జున్ తండ్రి.. ఏ సినిమానో తెలుసా?
'నాన్న', 'పొన్నియన్ సెల్వన్' సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన సారా అర్జున్. 'ధురంధర్' సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. తన తొలి సినిమాకే ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇందులో 40 ఏళ్ల హీరో రణ్వీర్ సింగ్‌కు జంటగా నటించింది. కేవలం 20 ఏళ్ల సారా అర్జున్ తన గ్లామర్‌తో అభిమానులను మెప్పించింది. ఆ తర్వాత తెలుగులోనూ యూఫోరియా మూవీతో అలరించింది.ప్రస్తుతం సారా నటించిన దురంధర్-2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో సారా అర్జున్ గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సారా అర్జున్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె తండ్రి రాజ్ అర్జున్ సైతం తెలుగు సినిమాల్లో నటించడం విశేషం.విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన డియర్ కామ్రేడ్ మూవీలో క్రికెట్ సెలక్టర్ రమేశ్ రావు పాత్రలో మెప్పించారు. అంతేకాకుండా గతేడాది రిలీజైన రజాకార్ చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆయన కుమార్తె సారా అర్జున్ సైతం తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. 2002లో కంపెనీ అనే మూవీతో అరంగేట్రం రాజ్ అర్జున్ దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించారు. సీక్రెట్ సూపర్‌స్టార్ అనే చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే ఫేవరేట్ హీరో..గతంలో యూఫోరియా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సారా అర్జున్ తెలుగులో నటించడం చాలా గర్వంగా ఉందని చెప్పింది. టాలీవుడ్లో మీ ఫేవరేట్ హీరో ఎవరని యాంకర్ ప్రశ్నించింది. దీనికి బదులిస్తూ తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారని.. కానీ నాకు మాత్రం విజయ్ దేవరకొండ ఫేవరేట్ అని బాలీవుడ్ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఆమె తండ్రి రాజ్ అర్జున్ డియర్ కామ్రేడ్లో నటించడం వల్లే సారా అర్జున్ తన ఫేవరేట్ హీరో అని చెప్పుకొచ్చింది. -
'ఆ అమ్మాయి నా కూతురితో సమానం'.. దురంధర్ నటుడు
దురంధర్‌లో రణ్వీర్ సింగ్ రోల్ తర్వాత అందరికీ గుర్తుండిపోయే పాత్ర ఆయనదే. అతని వల్లే ఈ సీక్వెల్ రూ.500 కోట్లు ఎక్కువగా సాధిస్తుందని హీరో సైతం అన్నారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతను ఎవరో కాదు.. జమీల్ జమాలీ పాత్రలో అలరిస్తోన్న నటుడు రాకేశ్ బేడీ. తన పాత్రలో రాకేశ్ అద్భుతంగా నటించారు. కరాచీకి చెందిన రాజకీయ నాయకుడు జమాలి పాత్రలో రాకేశ్ బేడీ అదరగొట్టేశారు.అయితే తాజాగా దురంధర్ హీరోయిన్ సారా అర్జున్ను ముద్దు పెట్టుకోవడంతో వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. గతంలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా జరిగింది. ఆ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. తనకంటే వయసులో చాలా చిన్నదైన సారా అర్జున్ను రాకేశ్ బేడీ ముద్దుపెట్టుకోవడంతో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అయితే కొందరు మాత్రం తనను సమర్థించారని కూడా ఆయన పేర్కొన్నారు.తాజాగా ఈ వివాదంపై రాకేష్ బేడీ మరోసారి స్పందించారు. సారాపై తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదన్నారు. తాను కేవలం ఆమెపై ఆప్యాయతతోనే అలా చేశానని తెలిపారుు. కానీ మరో కోణంలో చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురి పాత్ర పోషించిన సారాతో తండ్రిలాగే ప్రవర్తిస్తానని..సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆమెతో అలాగే ప్రవర్తించేవాడినని బేడీ వివరణ ఇచ్చారు. మాది తండ్రీ, కూతుళ్ల బంధమని తెలిపారు. నా ఆప్యాయతను ప్రజలు గుర్తించలేకపోయారని అన్నారు.ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.." తన కూతురి పాత్ర పోషించిన సారాతో తన బంధం ఎప్పుడూ ఆప్యాయంగా.. ఒక తండ్రిలాగే ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ సమయంలో కూడా ఆమెతో అలాగే ప్రవర్తించా. ధురందర్ షూటింగ్ సమయంలో ఆమె వచ్చినప్పుడల్లా ఒక కూతురిలా ఆమెను కౌగిలించుకుని నుదుటిపై ముద్దు పెట్టేవాడిని. ఏం పర్వాలేదు.. చింతించకు.. మనిద్దరం కలిసి ఒక గొప్ప సీన్ చేస్తామని తనతో చెప్పేవాడిని. అదృష్టవశాత్తూ, కొందరు నన్ను సమర్థించారు కూడా. కానీ ఈ సినిమాతో దక్కిన విజయం చాలా మందికి రాదు' అని అన్నారు. -
18 ఏళ్లకే తల్లి పాత్ర.. ‘ధురంధర్’ నటిపై ప్రశంసలు
సాధారణంగా హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేస్తుంటారు. నటనకు స్కోప్ ఉండే పాత్రలు రేర్‌గా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడే కొంతమంది తమ టాలెంట్‌ని నిరూపించుకుంటారు. అయితే అందులోనూ తమ వయసు తగ్గ పాత్రలనే ఎంచుకుంటారు. ముఖ్యంగా తల్లి పాత్రలు చేయాల్సి వస్తే సీనియర్ హీరోయిన్లు సైతం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. 30 ఏళ్లు దాటినా.. తల్లి పాత్ర చేయమని అడిగితే నో చెప్పే హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కానీ సారా అర్జున్ మాత్రం 18 ఏళ్లకే తల్లి పాత్ర చేసింది. అది కూడా 40 ఏళ్ల వయసు ఉన్న హీరో నటించిన పాన్ ఇండియా సినిమాలో. అదే ధురంధర్ 2.ధురంధర్ సినిమా సమయంలో సారాపై పెద్ద ఎత్తున ట్రోల్ నడిచింది. 40 ఏళ్ల వయసు ఉన్న హీరో(రణ్వీర్ సింగ్)తో రొమాన్స్ చేయబోతుందంటూ ఆమెను విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. కానీ ధురంధర్ రిలీజ్ తర్వాత అందరూ ఆమెపై ప్రశంసలు కురిరించారు. చిన్న పిల్ల అయినా బాగా నటించిందని అభినందించారు.అయితే పార్ట్ 1లో కేవలం హీరో ప్రియురాలి పాత్రలో కనిపించిన సారా.. పార్ట్ 2 మాత్రం ఓ బిడ్డకు తల్లిగా నటించి, మెప్పించింది. ప్రస్తుతం సారా వయసు 20 ఏళ్లు. ధురంధర్ షూటింగ్ సమయంలో ఆమె వయసు 18 ఏళ్లు మాత్రమే. అంత చిన్న వయసులో తల్లి పాత్ర ఒప్పుకొని సారా పెద్ద సాహసమే చేసింది.కథపై నమ్మకంతోనే సారా ఆ పాత్ర చేసేందుకు అంగీకరించిందట. తల్లి పాత్ర ఉంటుందని చెప్పగానే ఏమాత్రం సంకోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఈ విషయాన్ని ధురంధర్ సినిమా కాస్టింగ్ డైరెక్టర్ ముకేష్ చబ్రా చెప్పారు.‘పార్ట్ 2లో తల్లి పాత్ర పోషిస్తున్నానా అనే విషయాన్ని కూడా సారా అడగలేదు. కథ విని వెంటనే ఓకే చెప్పింది. దీంతో ఆమెకు లుక్ టెస్ట్ చేశాం. నేను చేసిన లుక్ టెస్ట్‌లోనూ సారానే ది బెస్ట్ అనిపించింది. అందుకే ఆ పాత్రకు ఎంపిక చేశాం’ అని ముకేష్ అన్నారు. కాగా, ధురంధర్ కాస్టింగ్‌పై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలోని ప్రతి పాత్రకు సరైన నటుడిని ఎంచుకున్నారని, తెరపై చూస్తుంటే వారు తప్ప వేరే నటుడు అలా చేయరేమో అన్నట్లుగా పాత్రలను తీర్చిదిద్దారంటూ సినిమా చూసినవాళ్లు చెబుతున్నారు. -
ధురంధర్ 2కి బ్లాక్‌బస్టర్ టాక్.. ట్రెండింగ్‌లో హీరోయిన్ సారా (ఫోటోలు)
-
'ధురంధర్ 2' రెమ్యునరేషన్ డీటైల్స్.. ఎవరికి ఎన్ని కోట్లు?
స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ట్రెండ్ సెట్ చేసిన 'ధురంధర్' నుంచి ఇప్పుడు సీక్వెల్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రింట్స్ టైంకి రాకపోవడంతో తెలుగు వెర్షన్ ప్రీమియర్స్ మాత్రం రద్దయ్యాయి. గురువారం ఉదయం నుంచి తెలుగు షోలు యధావిధిగా స్క్రీనింగ్ కానున్నాయి. ఇప్పటికైతే మూవీపై ఓ రేంజ్ బజ్ ఉంది. దానికి తోడు దర్శకుడు కూడా చివరివరకు కూర్చోండి, ట్విస్టులు బయటపెట్టొద్దని చెప్పడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. మరోవైపు సీక్వెల్ కోసం నటీనటులు తీసుకున్న రెమ్యునరేషన్ వివరాలు కూడా వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)మిగతా పాన్ ఇండియా సినిమాల్లా 'ధురంధర్' రెండు భాగాల షూటింగ్స్ వేర్వేరుగా చేయలేదు. మొత్తం ఒకేసారి కలిపి తీసేశారు. గత నెలలో ప్యాచ్ వర్క్స్ లాంటివి చేశారు. అయితే రెండు భాగాలకు కలిపి నటీనటులకు ఒకేసారి రెమ్యునరేషన్స్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. హమ్జా అలీ, జస్కీరాత్ సింగ్ అనే రెండు పాత్రలు చేసిన రణ్వీర్ సింగ్‌కి అత్యధికంగా రూ.40-50 కోట్ల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది.రణ్వీర్ కంటే ఎక్కువగా మూవీలో హైలైట్ అయింది అక్షయ్ ఖన్నా చేసిన రహమాన్ డకాయిట్ పాత్ర. తొలి భాగంలోనే రహమాన్ రోల్ ముగిసింది. కానీ సీక్వెల్లో కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఈ పాత్ర కనిపించనుందట. మొత్తంగా దీనికోసం అక్షయ్ ఖన్నాకు రూ.5 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం.ఎస్పీ అస్లాం చౌదరిగా అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన సంజయ్ దత్.. మొత్తంగా రూ.10 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడట. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ పాత్ర చేసినందుకుగానూ మాధవన్కి రూ.9 కోట్లు, మేజర్ ఇక్బాల్ అనే విలనీ పాత్రలో నటించిన అర్జున్ రాంపాల్, హీరోయిన్గా చేసిన సారా అర్జున్ తలో రూ.కోటి రెమ్యునరేషన్‌గా అందుకున్నారట. ఇక దర్శకుడు, నిర్మాత అయిన ఆదిత్య ధర్ పారితోషికం గురించి అయితే ఎక్కడా వివరాలు లేవు. కానీ ఈ మూవీ వల్ల ఆదిత్య ధర్ బ్రాండ్ ఇమేజ్ చాలా పెరిగిపోయింది. తర్వాత చేయబోయే చిత్రం ఏంటో తెలియనప్పటికీ.. ఒకవేళ ఏ నిర్మాత అప్రోచ్ అయినా సరే భారీ రెమ్యునరేషన్ అయితే డిమాండ్ చేయడం గ్యారంటీ.'ధురంధర్' విషయానికొస్తే.. మన దేశంపై పాకిస్తాన్ చేస్తున్న వరస దాడులు ఆగాలంటే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించాలని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) భావిస్తాడు. ఆపరేషన్ ధురంధర్కి శ్రీకారం చుడతాడు. ఇందులో భాగంగా జైలుజీవితం గడుపుతున్న ఓ కుర్రాడిని ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్)ని మారుపేరుతో పాకిస్తాన్‌కి పంపిస్తాడు. జ్యూస్ షాపులో పనిచేసే దగ్గర నుంచి రహమాన్ డకాయిట్ అనే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌కి ఆత్మీయుడు అయ్యేంతవరకు ఎలా ఎదిగాడు? ఈ ప్రయాణంలో ఎదురైన సవాళ్లేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. రహమాన్ డకాయిట్‌ని హమ్జా చంపడంతో తొలి భాగం ముగిసింది. రెండో పార్ట్‌లో హమ్జా.. లయారీకి ఎలా డాన్ అయ్యాడు? భారత్‌ని దాడులు చేసిన మిగతా ఉగ్రవాదుల్ని ఎలా మట్టుబెట్టాడనేది చూపించబోతున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' తెలుగు ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్) -
మరో సినిమా ఒప్పుకున్న ధురంధర్ హీరోయిన్?!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా అలరించిన సారా అర్జున్ ఇప్పుడు హీరోయిన్గా అదరగొడుతోంది. తను కథానాయికగా నటించిన తొలి చిత్రం ధురంధర్ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే! అనంతరం యుఫోరియా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ధురంధర్ 2తో ముందుకు రాబోతోంది.రూమర్స్‌పై క్లారిటీఅయితే ఈ 20 ఏళ్ల బ్యూటీ "హీర్ రాంఝా" (పంజాబీ జానపద విషాద కథ) అనే మూవీ చేస్తున్నట్లు బీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో సారా.. హీర్ పాత్రలో నటించనుందని సదరు వార్తల సారాంశం. ఈ రూమర్స్‌పై కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చాబ్రా స్పందించాడు. సారా అర్జున్ ఏ సినిమాకి సంతకం చేయలేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎవరితోనూ చర్చలు జరపలేదు, ఎవర్నీ కలవలేదు. నేనే చెప్తా..ప్రస్తుతం మేమంతా ధురంధర్ 2 కోసం ఎదురుచూస్తున్నాం. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండండి. తను నెక్స్ట్ ఏదైనా సినిమా ఒప్పుకుంటే నేనే స్వయంగా మీకు వెల్లడిస్తాను. అప్పటివరకు వచ్చే ఏ వార్తనూ మీరు నమ్మకండి అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు. అంటే ధురంధర్ 2 తర్వాతే సారా తన నెక్స్ట్ సినిమాపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. సినిమాధురంధర్ విషయానికి వస్తే.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించాడు. గతేడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ధురంధర్ 2 వస్తోంది. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్.మాధవన్, రాకేశ్ బేడీ, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ మార్చి 19న పాన్ ఇండియావైడ్‌గా విడుదల కానుంది. Sara Arjun has not signed any other film. We are just waiting for D 2. She has not signed any film and has not met anyone regarding any project. So please relax, guys. I will personally update you about her next project. Just wait all the other news is only rumours🥰🧿❤️ pic.twitter.com/njCE7MsKIR— Mukesh Chhabra CSA (@CastingChhabra) March 7, 2026 చదవండి: విడాకులు, తాగుడుకు బానిసయ్యా: మలయాళ నటుడు -
మాల్ లో మొదలైన మ్యాజిక్
పసిపాపగా మొదలైన నటి సారా అర్జున్ ప్రయాణం, ఇప్పుడు పాన్ఇండియా స్టార్డమ్ వరకూ చేరింది. ఇంకా ఎన్నో కలలు, ఎన్నో పాత్రలు, ఎన్నో విజయాలు ఆమె కోసం ఎదురుచూస్తున్నాయి. ఆ విషయాలే మీకోసం..రెండేళ్లు కూడా లేవు!‘‘ఇంత చిన్న వయసులోనే ఇన్ని సినిమాలు ఎలా చేశావు?’’ అని చాలామంది అడుగుతుంటారు. కాని, కెమెరా ముందు నిలబడినప్పుడు నాకు రెండేళ్లు కూడా లేవు! ఒకరోజు అమ్మానాన్నలతో కలిసి మాల్‌కు వెళ్లినప్పుడు, ఒక ప్రకటన సంస్థ ప్రతినిధి మీ పాప యాడ్‌లో నటిస్తుందా? మా పేరెంట్స్‌ని అడిగారు. అలా పద్దెనిమిది నెలల పసిపాపగా నా ప్రయాణం మొదలైంది. ఐదేళ్లకే వందకు పైగా ప్రకటనల్లో నటించాను.క్రేజీ మెమరీ!‘నాన్న’ సినిమా షూటింగ్ సమయంలో నా డైలాగులే కాదు, విక్రమ్ అప్పా డైలాగులు కూడా నాకు కంఠస్థం అయ్యేవి. ఆయన ఎక్కడైనా మర్చిపోతే, నేనే గుర్తు చేసేదాన్ని! ఆ సమయంలో అనుష్క శెట్టితో నాకు ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది. ‘జంక్ ఫుడ్ అస్సలు తినకు, మంచి ఆహారం తీసుకోవాలి’ అని ఆమె ఇచ్చిన సలహా ఇప్పటికీ గుర్తుంది.గాసిప్స్ మామూలే!‘ధురంధర్’ సినిమాలో రణవీర్ సింగ్‌తో ఉన్న వయస్సు తేడా గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇక ఇటీవల రాకేష్ బేడీ ఆప్యాయంగా పలకరించడాన్ని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. హీరోయిన్ గా మారిన తర్వాత గాసిప్స్ సహజమే అని చాలా త్వరగా అర్థమైంది. మిగతావన్నీ తర్వాతే!ఎన్ని సినిమాలు చేసినా, ఒక్కరోజు కూడా స్కూల్ మిస్ కాలేదు. చిత్రీకరణలన్నీ సెలవుల్లోనే ఉండేలా నాన్న జాగ్రత్తగా ప్లాన్ చేసేవారు. చదువు, సినిమా రెండింటినీ బ్యాలెన్స్ చేయటం మా కుటుంబం ఇచ్చిన పెద్ద బలం.ప్రశ్నలే నా గురువులు!‘నాకు కొత్త ప్రదేశాలను చూడటం అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్‌లో ఎంతోమంది రకరకాల మనుషులు పరిచయమవుతుంటారు. ఎవరిని కలిసినా వివిధ ప్రశ్నలు అడుగుతుంటాను. వారి అలవాట్లు, మాట్లాడే తీరు గమనిస్తూ ఉంటాను. ఆ పరిశీలనే నేను చేసే పాత్రలకు ప్రాణం పోయడానికి సహాయపడుతుంది.ప్రేమ అంతా సినిమాలపైనే!పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తాను. ‘యుఫోరియా’లో నేను చేసిన పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, భావోద్వేగ భరితమైన, శక్తిమంతమైన పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నాను.రికార్డుల దిశగా దూసుకెళ్తూ! ఇటీవల ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎమ్‌డీబీ) విడుదల చేసిన ‘అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సెలబ్రిటీల’ జాబితాలో తొలి స్థానంలో నిలవడం నాకు ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగించింది. దానిని నేను గౌరవంగా భావిస్తున్నాను. ఇది ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమకు నిదర్శనం.ఇష్టాలు..!» అభిమాన నటుల్లో హీరో విజయ్ దేవరకొండ అంటే పెద్ద క్రష్! ఆయన ఎనర్జీ అంటే నాకు చాలా ఇష్టం. తమిళంలో సూర్య నా ఫేవరెట్. ఇక హీరోయిన్లలో ఐశ్వర్య రాయ్‌ని చూస్తూ పెరిగాను. ఆమె నా ఆదర్శం. »ఆహారంలో హైదరాబాద్ బిర్యానీ అంటే పిచ్చి. కాని, ఇప్పుడు ఆరోగ్యం కోసం డైట్ పాటిస్తున్నాను. అలాగే, నా డాగీతో గడిపే సమయం నాకు అత్యంత ప్రియమైనది. -
మహాశివరాత్రి సెలబ్రేషన్స్.. దురంధర్ బ్యూటీ, శ్రీనిధి శెట్టి డ్యాన్స్ వైరల్
మహాశివరాత్రి వేడుకల్లో పలువురు సినీతారలు సందడి చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో జరిగిన వేడుకల్లో దురంధర్ బ్యూటీ సారా అర్జున్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి, బాలీవుడ్ భామ మౌనీ రాయ్ కూడా పాల్గొన్నారు. వీరు పూజలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.తాజాగా ఈ వేడుకలకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆధ్యాత్మిక సేవలో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరైన తమన్నా, శ్రీనిధి, సారా అర్జున్ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. భక్తి పాటకు మంత్రముగ్ధులైన ముద్దుగుమ్మలు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. హీరోయిన్స్ డ్యాన్స్ చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా.. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా వీరంతా పంచ భూత క్రియ పూజలో పాల్గొన్నారు. Maha Shivaratri night 🕉🔱@ishafoundation#Mahashivratri#MahaShivaratri2026#IshaMahashivratri2026#Adiyogi pic.twitter.com/p1lbdFwh0L— Sara Arjun (@itz_Sara_Arjun) February 16, 2026 View this post on Instagram A post shared by Isha Foundation (@isha.foundation) #WATCH | Actors Tamannaah Bhatia, Sara Arjun attended the Mahashivratri 2026 celebrations at the Isha Yoga Centre in Coimbatore, Tamil Nadu pic.twitter.com/Vw6QE75Drt— ANI (@ANI) February 16, 2026 -
మీ వారణాసి కోసం వెయిటింగ్ సార్
-
చిరు పక్కన సారా అర్జున్.. కృతి శెట్టి కథ కంచికేనా..?
-
తెలుగు తెరపై కొత్తందం
ప్రతి ఏడాది తెలుగు తెరపై కొత్త అమ్మాయిలు మెరుస్తుంటారు. కొత్త కథానాయికలు ఎందరొచ్చినా అందరికీ తెలుగు తెర చోటు కల్పిస్తూనే ఉంటుంది. ఈ ఏడాది వెండితెరను మెరిపించేందుకు, తమలోని నటనా నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కొంతమంది కథానాయికల వివరాలపై ఓ లుక్ వేద్దాం.లక్కీ చాన్స్ ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌తో తొలి సినిమా అంటే ఏ హీరోయిన్‌కు అయినా లక్కీ చాన్స్ అనే చెప్పోచ్చు. ఈ లక్కీ చాన్స్ ఇమాన్వీ ఇస్మాయిల్‌కు దక్కింది. ‘సీతారామం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘ఫౌజి’. ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఇమాన్వీ హీరోయిన్గా చేస్తున్నారు. దేశభక్తి, ప్రేమ, కర్తవ్యం వంటి అంశాల మేళవింపుతో 1940 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.తొలి సినిమాయే ప్రభాస్ వంటి టాప్ హీరోతో నటిస్తుండటం, పైగా జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి సీనియర్ నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఇమాన్వీకి కెరీర్ పరంగా ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘ఫౌజి’ చిత్రం ఈ దసరాకు విడుదల కానుంది. ఈ సినిమాకు సహ– నిర్మాతగా శివ చనన వ్యవహరిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.వెల్కమ్ జోయా రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘యానిమల్’ చిత్రం 2023లో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో గీతాంజలి పాత్రలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించగా, కథలో కీలకమైన జోయా పాత్రధారిగా త్రిప్తీ దిమ్రి నటించారు. జోయా పాత్రలో త్రిప్తి నటనకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ ‘యానిమల్’ సినిమా తెలుగులో కూడా విడుదల కావడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో కూడా పడ్డారు త్రిప్తి. అప్పట్నుంచి ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ ఫలానా హీరోతో ఉంటుందనే ప్రచారం సాగింది.కానీ ఫైనల్‌గా ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘స్పిరిట్’ చిత్రంతో త్రిప్తీ దిమ్రి టాలీవుడ్‌కు వస్తున్నారు. ఈ యంగ్ బ్యూటీ చేస్తున్న తొలి స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ ‘స్పిరిట్’ కావడం విశేషం. అంతేకాదు... ‘యానిమల్’ సినిమాతో త్రిప్తీకి పాపులారిటీ తెచ్చిపెట్టిన సందీప్ రెడ్డివంగాయే ‘స్పిరిట్’ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కానుంది.తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ వంటి భారతీయ భాషలతో పాటు జపాన్ వంటి విదేశీ భాషల్లోనూ ‘స్పిరిట్’ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిపోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. డాక్టర్ పాత్రలో నటిస్తున్నారట త్రిప్తీ దిమ్రి. ప్రభాస్, త్రిప్తి ఈ చిత్రంలో భార్యాభర్తలుగా నటిస్తున్నారని సమాచారం. ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ప్రకాశ్‌రాజ్, కాంచన, వివేక్ ఓబెరాయ్ ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.సీతా పయనం యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్యా అర్జున్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అర్జున్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన బహుభాషా చిత్రం ‘సీతా పయనం’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ చిత్రంలోనే ఐశ్వర్యా అర్జున్ హీరోయిన్గా నటించారు. ఐశ్వర్యకు తొలి తెలుగు స్ట్రయిట్ ఫిల్మ్ ఇదే. ఇలా తన తండ్రి డైరెక్షన్ వహించి, నటించిన సినిమాతో ఐశ్వర్య తెలుగులోకి వస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ ఇతర ప్రధాన పాత్రల్లో నటించగా, ధ్రువ సర్జా గెస్ట్ రోల్ చేశారు.ఆకాశంలో ఒక తార ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో సినీ తారగా తెలుగుకి వస్తున్నారు సాత్విక వీరవల్లి. ఈ సినిమాలో ఓ చాలెంజింగ్ రోల్ చేస్తున్నారు సాత్విక. ఓ మారుమూల పల్లె నుంచి వచ్చి, తన కలలను సాకారం చేసుకోవాలని తాపత్రయపడే అమ్మాయి పాత్రలో సాత్విక నటిస్తున్నారని తెలిసింది. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తుండగా, సాత్విక వీరవల్లి హీరోయిన్గా చేస్తున్నారు. మరో హీరోయిన్ శ్రుతీహాసన్ ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో పవన్ సాధినేని దర్శకత్వంలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ 80 శాతం పూర్తయింది. ఈ వేసవిలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ పీరియాడికల్ ఎమోషనల్ అండ్ ఫీల్ గుడ్ మూవీకి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు.శ్రీను–మంగల లవ్‌స్టోరీ బాలీవుడ్లో వన్నాఫ్ ది టాప్ హీరోయిన్స్ అయిన రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ టాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. ‘ఆర్ఎక్స్ 100, మంగళవారం’ వంటి సినిమాలను తెరకెక్కించిన అజయ్ భూపతి డైరెక్షన్లో రానున్న ఇంటెన్స్ లవ్‌స్టోరీ సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్‌బాబుల నటవారసత్వాన్ని కొనసాగిస్తూ, జయకృష్ణ ఘట్టమనేని ఈ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నారు.ఈ సినిమాలోనే రషా తడానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీ చిత్రంలో శ్రీను పాత్రలో జయకృష్ణ ఘట్టమనేని నటిస్తుండగా, మంగ పాత్రలో రషా తడానీ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి మంగ ఫస్ట్ లుక్‌పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా రెండో షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. సి. అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు పతాకంపై పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందని తెలిసింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరకర్త.లెగసీ ‘లెగసీ’ అనే ΄పొలిటికల్ మూవీతో టాలీవుడ్‌కి వస్తున్నారు కన్నడ హీరోయిన్ ఏక్తా రాథోడ్. విశ్వక్ సేన్ హీరోగా సాయికిరణ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ΄పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘లెగసీ’. ‘పాలిటిక్స్ ఈజ్ పర్సనల్’ అనేది ఉపశీర్షిక. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంతోనే ఏక్తా రాథోడ్ టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. గతంలో ‘సిలికాన్ సిటీ, మాస్టర్ పీస్’ వంటి చిత్రాల్లో నటించారు ఏక్తా రాథోడ్. విశ్వక్ సేన్ రాజకీయ నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తెలుగు అమ్మాయి హరికృష్ణ మనవడు, జానకి రామ్ తనయుడు నందమూరి తారక రామారావు హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ‘సీతయ్య, దేవదాసు, లాహిరి లాహిరి లాహిరిలో, యువరాజు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన వైవీఎస్ చౌదరి కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు అమ్మాయి వీణా రావు హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. వీణ మంచి కూచిపూడి డ్యాన్సర్ కూడా. నటనలో దాదాపు ఏడాదిన్నర కాలం శిక్షణ తీసుకున్న తర్వాత హీరోయిన్గా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లుగా వీణ చెప్పారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ, రిలీజ్ వంటి అంశాలపై అప్డేట్ రావాల్సి ఉంది. ⇒ పదేళ్ల క్రితం రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్లో నటించిన ‘దాగుడు మూత దండాకోర్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు సారా అర్జున్. అయితే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘΄పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో నందిని (నందిని రోల్‌ను ఐశ్వర్యా రాయ్ చేయగా, ఈ రోల్ యంగ్‌గా ఉన్నప్పటి సీన్స్‌లో సారా అర్జున్ నటించారు) పాత్రలో నటించి, యంగ్ యాక్టర్‌గా పాపులర్ అయ్యారు సారా. కాగా ఈ ఫిబ్రవరి 6న థియేటర్స్‌లో విడుదలైన ‘యుఫోరియా’ సినిమాతో ఓ లీడ్ యాక్టర్‌గా తెలుగు చిత్రపరిశ్రమకు సారా అర్జున్ పరిచయం అయ్యారు.గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రంలోని సారా నటన తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది. అలాగే సారా అర్జున్ ఓ లీడ్ రోల్లో నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘మ్యాజిక్’ విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాకు ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఇంకా రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ సినిమా గత ఏడాది డిసెంబరులో విడుదలై, ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్ర యాలినా జమాలిగా సారా నటించారు. హీరోయిన్గా హిందీలో సారా అర్జున్‌కు ఇది తొలి చిత్రం కావడం విశేషం.⇒ ‘ది రాజాసాబ్’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు హీరోయిన్ మాళవికా మోహనన్. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రంలో భైరవి అనే పాత్రలో కనిపించారు మాళవిక. ఈ చిత్రంలో భైరవిగా ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా చేశారు మాళవిక. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సంగతి ఇలా ఉంచితే... ‘ది రాజాసాబ్’ సినిమా కంటే ముందే మాళవికా మోహనన్ ఎంట్రీ తెలుగులో జరగాల్సింది. విజయ్ దేవరకొండ, మాళవికా మోహనన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కాల్సిన ఓ సినిమా క్యాన్సిలైంది. ఆ తర్వాత ప్రభాస్ ‘సలార్’ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం మాళవికా మోహనన్ పేరును ఈ చిత్రదర్శకుడు ప్రశాంత్ నీల్ పరిశీలించారు. కానీ ఈప్రాజెక్ట్‌లో మాళవిక పేరు ఫైనలైజ్ కాలేదు. ఈ చాన్స్ శ్రుతీహాసన్‌కు దక్కింది. ఇలా... మాళవిక టాలీవుడ్ రాక కాస్త ఆలస్యమైంది. ఇలా ఈ ఏడాది తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం కానున్న హీరోయిన్లు మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
అదే.. నా బ్యూటీ వెపన్!
బాల నటిగా మొదలైన ప్రయాణం నుంచి, ఆత్మవిశ్వాసంతో నిండిన వ్యక్తిత్వం వరకు ఆమె ఫ్యాషన్ ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది. సంప్రదాయానికి గర్వంగా నిలుస్తూనే, ఆధునిక ప్రయోగాలు చేసే ఆమె స్టయిల్, బ్యూటీ ఫిలాసఫీ ఇదిగో!చీర.. బ్రాండ్: స్వాతికపూర్ లెహంగా ధర రూ. 47,700బ్లౌజ్ ధర రూ. 14,310ఓణీ ధర రూ. 21,200జ్యూలరీ బ్రాండ్: ఆమ్రపాలి జ్యూవెల్స్ధర: డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.కళ్ల అందాన్ని హైలైట్ చేయడానికి బ్లాక్ కాజల్ కంటే బ్రౌన్ కాజల్ నా సీక్రెట్ బ్యూటీ వెపన్ . దాన్ని స్వల్పంగా స్మడ్జ్ చేస్తే కళ్లకు సాఫ్ట్, మేజికల్ లుక్ వస్తుంది. ఫ్యాషన్ లో మాత్రం నేను సేఫ్ గేమ్ ఆడను. సంప్రదాయ దుస్తులు, చీరలు, అనార్కలీలు లాంటి క్లాసిక్ వేర్‌ను ఫ్యూచరిస్టిక్ ఔట్ఫిట్స్గా మలచుకుంటూ, మైథాలజీకి మోడ్రన్ టచ్ ఇచ్చే స్టయిల్‌ను ఫాలో అవుతాను. – సారా అర్జున్ -
‘యుఫోరియా’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?
ఈ మధ్య కాలంలో అద్భుతమైన సక్సెస్ అందుకున్న సినిమా 'ధురంధర్'. గత డిసెంబరులో రిలీజైనప్పుడు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇందులో నటించిన రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్.. ఇలా అందరికీ మంచి పేరు వచ్చింది. హీరోయిన్గా చేసిన సారా అర్జున్ కూడా ఓవర్ నైట్ స్టార్డమ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈమె.. చిరంజీవి కూతురిగా నటించే బంపరాఫర్ కొట్టేసిందట.(ఇదీ చదవండి: చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు)ఈ సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' సినిమాతో హిట్ కొట్టిన చిరంజీవి.. త్వరలో 'విశ్వంభర'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు బాబీతో మరోసారి కలిసి పనిచేయనున్నాడు. గతేడాదే ఈ ప్రాజెక్టుపై ప్రకటన వచ్చింది. ఇంకొన్ని రోజుల్లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో భాగంగా సినిమాలో ఎవరెవరు నటిస్తారనే వివరాలు బయటకొస్తున్నాయి.ఇందులో చిరుకి జోడీ ప్రియమణిని ఎంపిక చేశారని.. మోహన్ లాల్ కీలక పాత్ర కోసం తీసుకున్నారని.. విలన్‌గా బాలీవుడ్ దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ కనిపించబోతున్నారని అంటున్నారు. అలానే కీలకమైన హీరో కూతురి పాత్ర కోసం 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్‌ని ఫైనల్ చేశారని మాట్లాడుకుంటున్నారు. తొలుత ఈ పాత్ర కోసం కృతి శెట్టి పేరు కూడా వినిపించింది కానీ సారా ఫైనల్ అయినట్లు ఉంది. సారా నటించిన తొలి తెలుగు మూవీ 'యుఫోరియా'.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ధనుష్ నాకు అన్నలాంటోడు.. మృణాల్ ఠాకుర్) -
అమ్మానాన్న ఏడ్చేశారు.. ఎన్నటికీ మర్చిపోలేను: సారా
ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ బాలీవుడ్ మూవీ 'ధురంధర్'తో హీరోయిన్గా మారింది. యలీనా జమైల్ పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు 'యుఫోరియా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదల కానుంది.ఆరోజు మర్చిపోలేనుసినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సారా అలీ ఖాన్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఈ సందర్భంగా తను హీరోయిన్ అయ్యాక పేరెంట్స్ రియాక్షన్ గురించి చెప్పుకొచ్చింది. ధురంధర్ సినిమాలో నన్ను చూసి అమ్మానాన్న సంతోషంతో ఏడ్చేశారు. ఆ రోజు నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ సంఘటన నా జీవితంలోనే ప్రత్యేకమైనది అని చెప్పుకొచ్చింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. పొన్నియన్ సెల్వన్ మూవీ తర్వాత విదేశాల్లో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేరాలనుకున్నాను. ధురంధర్అంతలోనే యుఫోరియా సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ధురంధర్ సినిమాకు సంతకం చేశాను. కానీ అదే మొదటగా రిలీజైంది అని తెలిపింది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ మూవీకి సీక్వెల్‌గా ధురంధర్ 2 తెరకెక్కుతోంది. ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.చదవండి: ఓటీటీలో నారీ నారీ నడుమ మురారి మూవీ.. ఎక్కడంటే? -
జిమ్‌లో అనసూయ.. మాయ చేసేస్తున్న మృణాల్
జిమ్‌లో కష్టపడిపోతున్న యాంకర్ అనసూయసిల్క్ చీరలో అందంగా 'ధురంధర్' సారా అర్జున్సింపుల్ బట్ బ్యూటీపుల్‌గా కాయదు లోహర్సన్నని నడుముతో మాయ చేస్తున్న దిశా పటానీరోజురోజుకీ మెరుపుతీగలా మారిపోతున్న త్రిషనవ్వుతూ కితకితలు పెట్టేస్తున్న మృణాల్ ఠాకుర్ View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Sara Arjun (@saraarjunn) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
40 ఏళ్ల హీరోతో రొమాన్స్.. ట్రోల్స్ లెక్క చేయను
'నాన్న', 'పొన్నియన్ సెల్వన్' సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన సారా అర్జున్ 'ధురంధర్' సినిమాతో హీరోయిన్గా మారింది. తొలి సినిమాకే ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇందులో 40 ఏళ్ల హీరో రణ్వీర్ సింగ్‌కు జంటగా నటించింది 20 ఏళ్ల సారా. దీంతో హీరోహీరోయిన్ల ఏజ్ గ్యాప్ గురించి చాలా విమర్శలు వచ్చాయి. ఈ ట్రోలింగ్‌పై తొలిసారి పెదవి విప్పింది సారా అర్జున్. అదే నమ్ముతా..ఆమె మాట్లాడుతూ.. నేను సామాజిక మాధ్యమాల్లో చురుకుగా లేను. కాబట్టి అక్కడేం జరుగుతుందనేది నాకు పెద్దగా తెలీదు. ఈ ఏజ్ గ్యాప్ గొడవంతా సోషల్ మీడియాలోనే జరుగుతోందనుకుంటా.. అయినా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిప్రాయం ఉంటుందని భావిస్తాను. ఎవరి జీవితం వాళ్లది అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాను. కాబట్టి ఏజ్ గ్యాప్ నచ్చకపోవడమనేది వారి సమస్య. అది నన్ను ఏమాత్రం ప్రభావితం చేయదు. అలాంటివి నేను లెక్క చేయను. సినిమా కథేంటో నాకు తెలుసు. ఆ కథకు అనుగుణంగానే అందరూ నడుచుకున్నారు. అంతే..కో స్టార్‌పై ప్రశంసలుఇకపోతే రణ్వీర్ సింగ్ లాంటి నటులను నేను చూడలేదు. ఎంతో అంకితభావంతో పని చేస్తాడు. సెట్లో ఉన్న అందరి గురించి పట్టించుకుంటాడు. సినిమా తీయడం అనేది దర్శకనిర్మాతల పని మాత్రమే కాదు.. సమిష్టి కృషి అని నమ్ముతాడు. సెట్ డిజైన్ దగ్గరి నుంచి అన్నింట్లోనూ పాలుపంచుకుంటాడు. అందర్నీ ఏకం చేసి ముందుకు నడిపిస్తాడు అంటూ హీరోపై ప్రశంసలు కురిపించింది.సినిమాఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ సినిమా 2025 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్‌బస్టర్ టాక్‌తో ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రణ్వీర్ సింగ్, సారా అర్జున్ జంటగా నటించిన ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్ కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు ఈ చిత్రం రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.చదవండి: రేణూ దేశాయ్ శాపనార్థాలు -
రెడ్ డ్రెస్ లో మెరిసిన ధురంధర్ మూవీ హీరోయిన్ సారా అర్జున్ (ఫొటోలు)
-
నా ఫేవరేట్ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ: యంగ్ హీరోయిన్
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అర్జున్ ఇటీవలే దురంధర్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన యుఫోరియా మూవీతో అలరించేందుకు వస్తోంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సారా అర్జున్ అచ్చ తెలుగులో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగులో నటించడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. టాలీవుడ్ మీ ఫేవరేట్ హీరో అని యాంకర్ ప్రశ్నించింది. దీనికి బాలీవుడ్ బ్యూటీ సారా అర్జున్ ఆసక్తికరమైన పేరు చెప్పింది. తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారని.. కానీ నాకు మాత్రం విజయ్ దేవరకొండ ఫేవరేట్ అని బాలీవుడ్ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.కాగా.. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘యుఫోరియా చిత్రంలో భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్రధాన పాత్రల్లో నటింటారు. ఈ సినిమాకు నీలిమా గుణశేఖర్ నిర్మాతగా వ్యవహరించారు. డ్రగ్స్ వల్ల యువత ఎదుర్కొన సమస్యల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. -
గుణ శేఖర్ ‘యుఫోరియా’ మూవీ ట్రైలర్ రిలీజ్
గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యుఫోరియా’. భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నీలిమా గుణశేఖర్ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. డ్రగ్స్ వల్ల యువత ఎదుర్కొన సమస్యల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.సివిల్ సర్వెంట్ అవ్వాలనుకునే ఓ అమ్మాయిపై అత్యాచారం జరగడం.. మాదకద్రవ్యాల మత్తులో ఓ యువకుడే ఈ అఘాయిత్యానికి పాల్లడినట్లు ట్రైలర్లో చూపించారు. ఇక భూమిక.. ఆ యువకుడిగా తల్లిగా నటించినట్లు తెలుస్తోంది. ఆమె తనపైనే కేసు వేసుకొని హైకోర్టుని ఆశ్రయించినట్లు ట్రైలర్లో చూపించారు. ఆమె చేసిన నేరం ఏంటి? ఫోక్సో చట్టాన్ని ఉపయోగించి ఈ అత్యాచార కేసుని పోలీసు కమిషనర్ జయదేవ్ నాయిర్(గౌతమ్ వాసుదేవ్ మీనన్) ఎలా సాల్వ్ చేశాడనేది తెలియాలంటే ఫిబ్రవరి 6న సినిమా చూడాల్సిందే. -
క్యాండిల్ లైట్ వెలుగులో 'ధురంధర్' బ్యూటీ గ్లామర్ షో (ఫొటోలు)
-
మృణాల్ క్యూట్ ఫేస్.. 'ధురంధర్' బ్యూటీ లావిస్ లుక్
'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ లావిస్ లుక్క్యూట్ ఫేస్ పెట్టి మాయ చేస్తున్న మృణాల్ ఠాకుర్రోమ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మికలంగా ఓణీలో మెరిసిపోతున్న హీరోయిన్ ఈషారెబ్బామంచులో తిరిగేస్తున్న 'ఫౌజీ' బ్యూటీ ఇమాన్విబ్లాక్ డ్రస్‌లో ఎగిరిపోతున్న పూజా హెగ్డే View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Sara Arjun (@saraarjunn) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Parvathy Thiruvothu (@par_vathy) -
నటితో ముద్దు వీడియో.. ట్రోల్స్‌పై స్పందించిన నటుడు
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘ధురంధర్’.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. అయితే, ఈ మూవీలో తండ్రీ కూతుర్లుగా నటించిన నటి సారా అర్జున్, సీనియర్ నటుడు రాకేశ్ బేడీ దురందర్ ఈవెంట్‌కు సంబంధించిన వేడుకలో కలుసుకున్నారు. అయితే, తనకంటే వయసులో చాలా చిన్నదైన సారా అర్జున్ను రాకేశ్ బేడీ ముద్దుపెట్టుకోవడం నెట్టింట పెద్ద దుమారం రేగింది. దీంతో భారీగా ట్రోల్స్ వచ్చాయి. ఈ క్రమంలో రాకేశ్ బేడీ స్పందించారు.‘ధురంధర్’ సినిమాలో రాకేశ్, సారా కలిసి నటించడంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది . ఈ క్రమంలోనే జరిగిన ఆ మూవీ వేడుకలో వారిద్దరూ కలిశారు. సారా వేదిక పైకి రాగానే రాకేశ్ ఆమెకు ఎదురెళ్లి పలకరించే క్రమంలో ఆమె భుజంపై ముద్దు పెట్టారు. ఈ ఘటన గురించి ట్రోల్స్ రావడం చాలా బాధాకరం అంటూ రాకేశ్ బేడీ రియాక్ట్ అయ్యారు. దీనిని తప్పుగా అర్ధం చేసుకోవడం తెలివితక్కువ పని అంటూ ఫైర్ అయ్యారు. సారా తనకంటే వయసులో చాలా చిన్నదని వివరణ ఇచ్చారు. మూవీ సెట్స్‌లో కూడా తామిద్దరం ఒకే కుటుంబంలానే ఉన్నామన్నారు. ఈ కారణంగానే ఆమె వేదికపై కనిపించగానే దగ్గరకు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కానీ, ఎక్కువమంది చెండాలంగా కథనాలు రాశారు. 20ఏళ్ల యువతిపై ముసలోడి ప్రేమ అంటూ రాశారు. కనీసం ఒక్కరు కూడా కుమార్తెపై ఉన్న ప్రేమ అనేలా రాయలేదని ఆవేదన చెందారు. సారా తనకు కూడా కూతురు లాంటిదేనని రాకేశ్ పేర్కొన్నారు. -
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఎవరీ బ్యూటీ!
కోలీవుడ్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన ‘నాన్న’ సినిమా గుర్తుందా? చూసిన వాళ్లు అయితే ఆ సినిమాను అంత ఈజీగా మార్చిపోరులేండి. ఇప్పుడీ సినిమా గురించి ఎందుకంటారా? అదే సినిమాలో విక్రమ్ కూతురుగా నటించిన ఓ చిన్నారు గుర్తుంది కదా? మతి స్థిమితం లేని నాన్నతో సైగలు చేస్తూ మాట్లాడి..మనకు కన్నీళ్లు తెప్పించింది. ఆ సినిమా విజయంలో విక్రమ్‌తో పాటు ఆ చిన్నారి పాత్ర కూడా చాలా ఉంది. ఆ చిన్నారు ఇప్పుడు హీరోయిన్గా కాదు కాదు.. ‘పాన్ ఇండియా హీరోయిన్’ మారిపోయింది. ఆమె పేరు సారా అర్జున్!రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘దురంధర్’లో హీరోయిన్గా నటించింది సారా. ప్రస్తుతం ఆమె వయసు 20 ఏళ్లు మాత్రమే. అప్పుడే పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ మూవీ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. పది రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత అందరూ సారా అర్జున్ గురించి ఆరా తీయడం ప్రారంభించారు.ఏడాదిన్నరకే నటనబాలీవుడ్ నటుడు అర్జున్ కూతురే సారా అర్జున్. 2005లో ముంబైలో పుట్టింది. ఏడాదిన్నర వయసులోనే ఓ యాడ్‌లో నటించి మెప్పించింది. తొలి యాడ్‌కి మంచి స్పందన రావడంతో సారాకు వరుస ఆఫర్లు వచ్చాయి. చిన్నవయసులోనే దాదాపు 100పైగా వాణిజ్య ప్రకటనల కోసం నటంచింది. . మ్యాగీ, క్లినిక్ ప్లస్, మెక్ డొనాల్డ్స్, కల్యాణ్ జ్యువెలర్స్ వంటి బడా సంస్థల యాడ్స్‌లో కనిపించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.ఆరేళ్లకే వెండితెరపైకోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ఓ యాడ్ తీశాడు. అందులో సారా నటించింది. ఆమె అమాయకత్వం చూసి మురిసిపోయిన విజయ్.. తన మూవీ ‘దైవ తిరుమగల్’లో చాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా తెలుగులో ‘నాన్న’ టైటిల్‌తో రిలీజైంది. విక్రమ్ కూతురుగా నటించిన సారా.. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు గాను చైల్డ్ ఆర్టిస్‌గా ఎన్నో అవార్డులను అందుకుంది. ఆ తర్వాత మణిరత్నం'పొన్నియన్ సెల్వన్'లో ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి రోల్లో నటించింది. దీంతో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. తెలుగులో రాజేంద్రప్రసాద్ నటించిన దాగుడుమూతలు దండాకోర్ చిత్రంలో కనిపించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా సారా చరిత్ర సృష్టించింది.అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ..సారాకి మెగా ఫోన్ పట్టాలనే కోరిక ఉంది. ఎప్పటికైనా సినిమాకు దర్శకత్వం వహించాలనుకుంటుంది. ‘డంకీ’ సినిమాకిగాను డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది.డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడే కథక్, హిప్మాప్ నేర్చుకుంది. కరాటేతో పాటు మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘యుఫోరియా’ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న విడుదల కానుంది. -
రంగురంగుల సీతాకోకచిలుకలా సారా అర్జున్ (ఫొటోలు)
-
గుణశేఖర్ 'యుఫోరియా' టీజర్ రిలీజ్
'ఒక్కడు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్.. తర్వాత కాలంలో వరుడు, సైనికుడు, నిప్పు తదితర మూవీస్ తీశారు గానీ హిట్ కొట్టలేకపోయారు. రుద్రమదేవి, శాకుంతలం లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఈయనకు కలిసి రాలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని 'యుఫోరియా' అనే యుత్‌ఫుల్ మూవీ తీశారు. ఈనెలలోనే రిలీజ్ ఉండొచ్చని టాక్ వచ్చింది. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసి, విడుదల తేదీపైన క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)భూమిక, గౌతమ్ మేనన్, నాజర్, సారా అర్జున్ తదితరుల నటిస్తున్న ఈ సినిమా టీజర్ బట్టి చూస్తే.. ప్రస్తుతం యువత చెడు అలవాట్లకు బానిసై ఎలా చెడిపోతున్నారు? వీళ్ల వల్ల సమాజంలో ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అనే కాన్సెప్ట్ ఆధారంగా తీసినట్లు అనిపిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వస్తున్నట్లు ప్రకటించారు. మరి ఈసారైనా గుణశేఖర్‌కి కలిసొస్తుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: నేడు సమంత పెళ్లి? రాజ్ మాజీ భార్య పోస్ట్ వైరల్) -
బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్.. 40 ఏళ్ల హీరోతో..
రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ మూవీ దురంధర్ (Dhurandhar Movie). సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. నేడు (జూలై 6) రణ్వీర్ బర్త్‌డే సందర్భంగా దురంధర్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో మాస్ అవతార్‌లో కనిపించాడు. అలాగే ఓ హీరోయిన్ను ఎత్తుకుని తిప్పుతూ కనిపించాడు.చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్గా..ఆ హీరోయిన్ మరెవరో కాదు.. చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్. ప్రముఖ నటుడు రాజ్ అర్జున్ కూతురే సారా. సౌత్‌లో బాలనటిగా ఎన్నో సినిమాలు చేసిన ఆమె.. దురంధర్తో హీరోయిన్గా వెండితెరపై ఎంట్రీ ఇస్తోంది. ఈమె తెలుగులో దాగుడుమూత దండాకోర్ చిత్రంలో రాజేంద్రప్రసాద్ మనవరాలిగా నటించింది. నాన్న మూవీలో విక్రమ్ కూతురిగా మెప్పించింది. తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. పొన్నియన్ సెల్వన్ మూవీలో ఐశ్వర్యరాయ్ చిన్ననాటి పాత్రలో మెరిసింది. 20 ఏళ్ల ఏజ్ గ్యాప్చైల్డ్ ఆర్టిస్ట్‌గా బోలెడంత పాపులారిటీ సంపాదించిన సారా.. అప్పుడే హీరోయిన్గా మారడంతో సినీప్రియులు ఆశ్చర్యపోతున్నారు. అందులోనూ 40 ఏళ్ల రణ్వీర్తో 20 ఏళ్ల సారా కలిసి నటించడంపై అప్పుడే చర్చ మొదలైంది. వీళ్లిద్దరూ జంటగా నటించారా? లేదంటే ఏదైనా మిషన్ కోసం ఇలా కలిశారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. అదే రోజు ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ రిలీజ్ అవుతుండటం గమనార్హం. చదవండి: కోలీవుడ్ స్టార్ విజయ్ను చూసి మన తెలుగు హీరోలు నేర్చుకోవాలి -
చిన్నప్పుడేమో క్యూట్.. ఇప్పుడేమో హీరోయిన్లని మించిన అందంతో (ఫొటోలు)
-
హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్న చైల్డ్ ఆర్టిస్ట్!
సారా అర్జున్.. ఈ పేరు వినగానే గుర్తుకొచ్చే చిత్రం దైవతిరుమగళ్. విక్రమ్, అనుష్క, అమలాపాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్నే అందుకుంది. ఆ చిత్రంలో కీలక పాత్రను పోషించిన బాలనటి సారా. ఆ తరువాత సైవం చిత్రంలోనూ బాల నటిగా ముఖ్యపాత్ర పోషించి పేరు తెచ్చుకుంది. ఇటీవల మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నందితగా నటి ఐశ్వర్యరాయ్ పోషించిన విషయం తెలిసిందే. అందులో చిన్న నందినిగా సారా నటించింది. ఆ బాలనటి హీరోయిన్గా.. ఆ బాల తార ఇప్పుడు హీరోయిన్గా మారుతోంది. దివంగత ఛాయాగ్రాహకుడు, దర్శకుడు జీవా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. 12 బీ, ఉన్నాలే ఉన్నాలే, ధామ్ ధూమ్ వంటి విజయవంతమైన చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఈయన వారసురాలు సనా మరియం ఇప్పుడు మెగాఫోన్ పట్టబోతున్నారు. ఈమె దర్శకత్వం వహించనున్న చిత్రంలో నటి సారా అర్జున్ కథానాయికగా పరిచయం కానుంది. ఆ బాలనటుడు హీరోగా మరో విశేషం ఏమిటంటే పొన్నియిన్ సెల్వన్‌లో విక్రమ్ చిన్ననాటి పాత్రను పోషించిన బాలనటుడు సంతోష్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నారని సమాచారం. దీన్ని కుష్బూ, సుందర్ సి.. అవ్నీ పిక్చర్స్ పతాకంపై నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని సమాచారం. చదవండి: 'యానిమల్' విజయంలో ఎందుకు కనిపించలేదంటే.. -
17 ఏళ్లకే పాన్ ఇండియా మూవీ.. ఆ స్టార్ కిడ్ ఎవరో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో ఫేమ్ రావాలంటే అంతా ఈజీ కాదు. అది ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఏదైనా అదృష్టం కలిసి రావాల్సిందే. కానీ ఆమెకు చిన్న వయసులోనే ఓ రేంజ్లో దశ తిరిగిపోయింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఈ స్టార్ కిడ్ అరుదైన ఘనతను సాధించింది. ఆమె ఎవరో కాదు.. నటుడు రాజ్ అర్జున్ కుమార్తె సారా అర్జున్. ఈ ఏడాది రిలీజైన మణిరత్నం బ్లాక్‌బస్టర్ మూవీ పొన్నియిన్ సెల్వన్‌లో నటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: షారుఖ్ రిస్కీ ఫైట్స్.. నయన్‌కు ఫస్ట్.. అట్లీ సెకండ్.. ‘జవాన్’విశేషాలివీ!) సారా అర్జున్ ఆరేళ్ల వయసులోనే వాణిజ్య ప్రకటనలతో పాటు హిందీ చిత్రంలోనూ కనిపించింది. 2010లో విజయ్ చిత్రం దైవ తిరుమగల్లో ప్రధాన పాత్రను పోషించింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ జై హో, ఇమ్రాన్ హష్మీ ఏక్ థీ దయాన్, ఐశ్వర్య రాయ్ జజ్బా సూపర్ స్టార్స్ నటించిన భారీ బడ్జెట్ చిత్రాలలో కనిపించింది. తమిళం, హిందీతో పాటు తెలుగు, మలయాళంలో కూడా నటించింది. శైవం చిత్రంలో బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రాజేంద్రప్రసాద్ నటించిన దాగుడుమూతలు దండాకోర్ చిత్రంలో కనిపించింది. సారా అర్జున్ ఇప్పటివరకు అత్యధికంగా అర్జించిన బాలనటిగా రికార్డు సృష్టించింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్-1లో యువ నందిని(ఐశ్వర్యరాయ్ పాత్రకు)గా కనిపించింది. ఈ క్యారెక్టర్ సారాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత పార్ట్-2లోనూ మరింత అందంగా కనిపించింది. సారా అర్జున్ 2023 నాటికి రూ.10 కోట్లతో భారతదేశంలోనే రిచెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నిలిచింది. పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలు కలిపి బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఆ తప్పు చేయడం వల్లే కెరీర్ నాశనం: ధనుశ్) దీంతో సారాకు పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపును తెచ్చిపెట్టింది. తన రాబోయే ప్రాజెక్ట్‌లో దళపతి విజయ్ సినిమాలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సారా అర్జున్ తండ్రి రాజ్ అర్జున్ రెండు దశాబ్దాలుగా తెలుగు, హిందీ చిత్రాల్లో నటించారు. బ్లాక్ ఫ్రైడే చిత్రంతో అరంగేట్రం చేసిన అతను రౌడీ రాథోడ్, రయీస్, సీక్రెట్ సూపర్ స్టార్, డియర్ కామ్రేడ్, తలైవి వంటి చిత్రాల్లో కనిపించారు. View this post on Instagram A post shared by Panniru Rajkumar (@rajkumar_sara_arjun) -
PS 2లో జూనియర్ ఐశ్వర్యగా నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?
మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’రెండో భాగం పీఎస్ 2 ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 చాలా బాగుందని అంటున్నారు. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమే చిన్నప్పటి ఐశ్వర్యరాయ్. ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న నందిని పాత్రలో ఐశ్వర్యరాయ్ నటించిన సంగతి తెలిసిందే. (చదవండి: విజయ్ దేవరకొండ, అఖిల్ కెరీర్‌ని దెబ్బ తీసిన ‘బామ్మర్ది’! ) పార్ట్2 లో ఆ పాత్రకు ప్లాష్‌బ్యాక్ ఉంటుంది. అందులో టీనేజ్ నందినిగా ఐశ్వర్య కంటే అందంగా, చక్కగా నటించిన ఓ చైల్డ్ ఆర్టిస్ట్. ఆమె ఎవరో కాదు.. సారా అర్జున్. ఈమె ఎవరంటారా? అదేనండి.. విక్రమ్, అనుష్క శెట్టి జంటగా నటించిన ‘నాన్న’ సినిమాలో విక్రమ్‌కు కూతురిగా నటించిన క్యూటీయే ఈ సారా అర్జున్. మతి స్థిమితం లేని నాన్న ప్రేమను అర్థం చేసుకునే కూతురిగా సారా నటన అద్భుతమని చెప్పాలి. 2011లో విడుదలైన ఈ చిత్ర మంచి విజయం సాధించింది. అప్పుడు సారా వయసు కేలవలం ఐదేళ్లు మాత్రమే. (చదవండి: సోషల్ మీడియాలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక) ఆ తర్వాత చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది సారా. ఇక పొన్నియన్ సెల్వన్‌లో చిన్నప్పటి విక్రమ్‌కు ప్రేయసిగా నటించి మెప్పించింది. సినిమాలో ఐశ్వర్యరాయ్, త్రిష,ఐశ్వర్య లక్ష్మీ, శోభిత లాంటి అందగత్తెలు ఉన్నా.. సారా అర్జున్ వారికి ఎక్కడా తగ్గకుండా తెరపై అందంగా కనిపిస్తూ.. తనదైన నటనతో మెప్పించింది. ఈ సినిమా చూసినవారికి చాలా రోజుల పాటు ఆ పాత్ర గుర్తుండిపోతుంది. అంతేకాదు ఆమె అందం, అభినయం చూస్తే.. త్వరలోనే స్టార్ హీరోయిన్ అవుతుందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Sara Arjun (@saraarjun.offical) -
‘దాగుడుమూత దండాకోర్’ మూవీ స్టిల్స్


