విజయ్ దేవరకొండ మూవీలో సారా అర్జున్ తండ్రి.. ఏ సినిమానో తెలుసా? | Dhurandhar actress Sara arjun father Raj arjun also In Tollywood | Sakshi
Sakshi News home page

Sara Arjun: తెలుగు ఇండస్ట్రీలో సారా అర్జున్ తండ్రి.. ఎన్ని సినిమాలు చేశారంటే?

Mar 30 2026 11:31 AM | Updated on Mar 30 2026 11:42 AM

Dhurandhar actress Sara arjun father Raj arjun also In Tollywood

'నాన్న', 'పొన్నియన్‌ సెల్వన్‌' సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించిన సారా అర్జున్‌. 'ధురంధర్‌' సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. తన తొలి సినిమాకే ఇండస్ట్రీ హిట్‌ కొట్టింది. ఇందులో 40 ఏళ్ల హీరో రణ్‌వీర్‌ సింగ్‌కు జంటగా నటించింది. కేవలం 20 ఏళ్ల సారా అర్జున్‌ తన గ్లామర్‌తో అభిమానులను మెప్పించింది. ఆ తర్వాత తెలుగులోనూ యూఫోరియా మూవీతో అలరించింది.

ప్రస్తుతం సారా నటించిన దురంధర్‌-2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో సారా అర్జున్‌ గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సారా అర్జున్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె తండ్రి రాజ్ అర్జున్‌ సైతం తెలుగు సినిమాల్లో నటించడం విశేషం.

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన డియర్‌ కామ్రేడ్‌ మూవీలో క్రికెట్ సెలక్టర్‌ రమేశ్‌ రావు పాత్రలో మెప్పించారు. అంతేకాకుండా గతేడాది రిలీజైన రజాకార్‌  చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆయన కుమార్తె సారా అర్జున్‌ సైతం తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. 2002లో కంపెనీ అనే మూవీతో అరంగేట్రం రాజ్ అర్జున్‌ దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించారు. సీక్రెట్ సూపర్‌స్టార్ అనే చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఆయనే ఫేవరేట్ హీరో..

గతంలో యూఫోరియా ట్రైలర్ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన సారా అర్జున్‌ తెలుగులో నటించడం చాలా గర్వంగా ఉందని చెప్పింది. టాలీవుడ్‌లో మీ ఫేవరేట్ హీరో ఎవరని యాంకర్ ప్రశ్నించింది. దీనికి బదులిస్తూ తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారని.. కానీ నాకు మాత్రం విజయ్ దేవరకొండ ఫేవరేట్ అని బాలీవుడ్ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఆమె తండ్రి రాజ్ అర్జున్‌ డియర్ కామ్రేడ్‌లో నటించడం వల్లే సారా అర్జున్‌ తన ఫేవరేట్‌ హీరో అని చెప్పుకొచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement