హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న చైల్డ్‌ ఆర్టిస్ట్‌! | Sakshi
Sakshi News home page

హీరోహీరోయిన్లుగా మారనున్న పొన్నియన్‌ సెల్వన్‌ చైల్డ్‌ ఆర్టిస్టులు!

Published Mon, Feb 26 2024 10:29 AM

Ponniyin Selvan Child Artist Sara Arjun, Santhosh Play Lead Roles - Sakshi

సారా అర్జున్‌.. ఈ పేరు వినగానే గుర్తుకొచ్చే చిత్రం దైవతిరుమగళ్‌. విక్రమ్‌, అనుష్క, అమలాపాల్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్నే అందుకుంది. ఆ చిత్రంలో కీలక పాత్రను పోషించిన బాలనటి సారా. ఆ తరువాత సైవం చిత్రంలోనూ బాల నటిగా ముఖ్యపాత్ర పోషించి పేరు తెచ్చుకుంది. ఇటీవల మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో నందితగా నటి ఐశ్వర్యరాయ్‌ పోషించిన విషయం తెలిసిందే. అందులో చిన్న నందినిగా సారా నటించింది.

ఆ బాలనటి హీరోయిన్‌గా..
ఆ బాల తార ఇప్పుడు హీరోయిన్‌గా మారుతోంది. దివంగత ఛాయాగ్రాహకుడు, దర్శకుడు జీవా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. 12 బీ, ఉన్నాలే ఉన్నాలే, ధామ్‌ ధూమ్‌ వంటి విజయవంతమైన చిత్రాలను డైరెక్ట్‌ చేశారు. ఈయన వారసురాలు సనా మరియం ఇప్పుడు మెగాఫోన్‌ పట్టబోతున్నారు. ఈమె దర్శకత్వం వహించనున్న చిత్రంలో నటి సారా అర్జున్‌ కథానాయికగా పరిచయం కానుంది.

ఆ బాలనటుడు హీరోగా
మరో విశేషం ఏమిటంటే పొన్నియిన్‌ సెల్వన్‌లో విక్రమ్‌ చిన్ననాటి పాత్రను పోషించిన బాలనటుడు సంతోష్‌ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నారని సమాచారం. దీన్ని కుష్బూ, సుందర్‌ సి.. అవ్నీ పిక్చర్స్‌ పతాకంపై నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని సమాచారం.

చదవండి: 'యానిమల్‌' విజయంలో ఎందుకు కనిపించలేదంటే..

Advertisement
 

తప్పక చదవండి

Advertisement