breaking news
Child artists
-
చిల్డ్రన్స్ డే: బాలతారల ఇంటర్వ్యూలు
నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన కొందరు బాలతారల ఇంటర్వ్యూలు, సిక్స్ ఇయర్స్ ఏజ్‌లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, సిక్స్టీన్లోకి అడుగు పెట్టి, యువ హీరో కావడానికి రెడీగా ఉన్న ర్యాన్ జాయ్‌తో మాటామంతీ!చిన్నప్పటి మహేశ్‌ని!ఆరేళ్ల వయసులోనే బాల నటుడిగా కెరీర్ స్టార్ చేసి, ఇప్పుడు స్వీట్ సిక్స్‌టీన్‌లో ఉన్నాడు ర్యాన్. కొంచెం మహేశ్‌బాబు పోలికలతో కనిపించే ర్యాన్ చిన్నప్పటి మహేశ్‌గా రెండు సినిమాల్లో నటించాడు. ఆ విశేషాలతో పాటు మరిన్ని విశేషాలు ఈ విధంగా పంచుకున్నాడు ర్యాన్ జాయ్.→ మా నాన్నగారి వృత్తిరీత్యా మేం చిన్నప్పుడు ముంబైలో ఉండేవాళ్లం. నేను అక్కడే పుట్టాను. నాకు సిక్స్ ఇయర్స్ అప్పుడు మా అమ్మ నన్ను ఆడిషన్స్‌కి తీసుకెళ్లేవారు. ఆ క్యారెక్టర్లకు కావల్సిన ఏజ్ లేదని సెలక్ట్ చేసేవాళ్లు కాదు. ఫైనల్లీ ‘హైదరాబాద్ లవ్‌స్టోరీ’లో చాన్స్ వచ్చింది. తెలుగులో నా కెరీర్ ఆ సినిమాతో మొదలై, ఈ మధ్య చేసిన ‘జయమ్మ పంచాయతీ’ వరకూ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది.→ నా ఫీచర్స్ మహేశ్ సార్‌కి దగ్గరగా ఉండటంవల్లే ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ చిత్రాల్లో చిన్నప్పటి మహేశ్బాబుగా యాక్ట్ చేసే చాన్స్ వచ్చింది. అయితే మహేశ్ సార్‌తో నా కాంబినేషన్ సీన్స్ ఉండవు కాబట్టి, ఆయన్ను కలవలేదు. ఒకే ఒక్కసారి ‘మహర్షి’ సెట్స్‌లో ఆయన ఉన్నప్పుడు ఆ దగ్గర్లోనే నేను ఉన్నాను. ఫొటో కావాలని అడిగితే, అప్పుడు ఎమోషనల్ సీన్స్ చేస్తున్నారు. ఆయన కళ్లనిండా నీళ్లు ఉన్నాయి. కొంచెం ఆగమన్నారు. చాలా టైమ్ పట్టింది. ఇక వెళ్లిపోతుంటే, ఆయనే పిలిచి ఫొటో దిగే చాన్స్ ఇచ్చారు.→ ఇప్పటివరకూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా 20కి పైగా సినిమాలు చేశాను. వాటిలో ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘నేల టికెట్టు’ వంటి సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘అల్లరి’ నరేశ్‌గారు హీరోగా చేస్తున్న ఒక సినిమాలో లెంగ్తీ రోల్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఏజ్ 16 కాబట్టి... అటు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేయలేను... ఇటు నా వయసున్న క్యారెక్టర్లు తక్కువ ఉంటాయి. సో... కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. → నేను హీరో అవాలనుకుంటున్నాను కాబట్టి... బాడీ బిల్డింగ్, డ్యాన్స్, ఫైట్స్ వంటి వాటి మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. చిన్నప్పుడు కరాటే నేర్చుకున్నాను. అలాగే థియేటర్ క్లాసెస్ తీసుకుందామనుకుంటున్నాను. హీరో అనిపించుకోవడానికి ఏమేం కావాలో అన్నీ నేర్చుకుంటాను. నాకు ఏదైనా బిజినెస్ చేయాలని కూడా ఉంది. మెయిన్ టార్గెట్ హీరో అయినప్పటికీ ఫ్యూచర్లో బిజినెస్ మీద కూడా ఫోకస్ పెడతాను. → ఒక కంప్లీట్ యాక్టర్‌గా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. ఆమిర్ ఖాన్‌లా అన్నమాట. ఆయన చేసే సినిమాలు ఒకదానికి ఒకటి పోలిక ఉండవు. వెరైటీగా ఉంటూ ట్రూగా ఉంటాయి. అలా నిజాయతీకి దగ్గరగా ఉండే సినిమాలు చేయాలనుకుంటున్నాను. సినిమా...నాటిక‘ఒక్క క్షణం, కేజీఎఫ్ 2, తండేల్, కింగ్డమ్, కిష్కింధపురి, లవ్‌స్టోరీ, సరిలేరు నీకెవ్వరు’.. వంటి మూవీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న భానుప్రకాశ్ చెప్పిన విశేషాలు.→ అన్నమయ్య జిల్లా సోమల మండలం నెల్లిమంద గ్రామం ఎగువపల్లి మా ఊరు. మా నాన్న సురేశ్ అమసగారు. చిన్నప్పుడే మా తాతయ్య హైదరాబాద్‌కి వచ్చేశారు. మా నాన్న ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ కాంట్రాక్టర్‌గా చేస్తున్నారు. మా నాన్నకి డైరెక్టర్ కావాలని లక్ష్యం. అయితే ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో నిర్మాతగా సుమారు 30కి పైగా షార్ట్ ఫిల్మ్స్ నిర్మించారు నాన్న. అలా మా నాన్న నిర్మిస్తున్న ‘నీ కొరకు నేను వేచి ఉంటాను’ షార్ట్ ఫిల్మ్‌లో ఒక పాత్రకి ఓ అబ్బాయి కావాల్సి వచ్చింది. ఎవరూ సెట్ కాలేదు.. ‘నువ్వు చేస్తావా? అని నాన్న అడగడంతో చేశాను. అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అల్లు శిరీష్ సార్ హీరోగా నటించిన ‘ఒక్క క్షణం’ (2017) బాల నటుడిగా నా ఫస్ట్ మూవీ. → నేను హైదరాబాద్‌లో పుట్టి, పెరిగాను. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాను. షూటింగ్స్ ఉన్నప్పుడు నేను సెట్స్‌కి బుక్స్ తీసుకెళతాను. ఆ రోజు జరిగిన క్లాస్ నోట్స్‌ని నా ఫ్రెండ్స్‌ని అడిగి, షూటింగ్ గ్యాప్‌లో రాసుకుంటాను. చాలా సందర్భాల్లో ఒకే సమయంలో ఇటు ఎగ్జామ్స్, అటు షూటింగ్స్ వచ్చాయి. అయితే షూటింగ్స్ షెడ్యూల్ సడెన్ గా ఫిక్స్ అవుతుంటాయి కాబట్టి వెళ్లక తప్పదు. ఆ సమయంలో ఎఫ్ఏ 1, ఎఫ్ఏ 2 వంటి పరీక్షలుంటే టీచర్స్ నా కోసం మళ్లీ కండక్ట్ చేస్తారు. → నేను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంత తోపు, తురుం అయినా కానీ ఫ్రెండ్స్ వద్ద నేను జస్ట్ భానుప్రకాశ్ అంతే... నేను నటించిన ఏదైనా సినిమా చూసినప్పుడు నా నటన గురించి టీచర్లు, ఫ్రెండ్స్ మాట్లాడతారు. వాళ్లందరికీ నేను నటించిన ఓ మంచి సినిమా చూపించాలని కోరిక. మా బంధువులు నేను నటించిన సినిమా చూస్తున్నప్పుడు ‘హే.. భాను వచ్చాడు...’ అంటూ బాగా ఎగ్జయిట్ అవుతారు. → ప్రస్తుత పరిస్థితుల్లో నాటకాలు అంతరించిపోతున్నాయి. వాటికి ఆదరణ దక్కడం లేదు. నేను ‘అమ్మ చెక్కిన బొమ్మ’ అనే నాటికలో నటించాను. ఈ ఏడాది మార్చి 28న తొలి ప్రదర్శన ఇచ్చాను. ఇప్పటివరకూ పద్దెనిమది ప్రదర్శనలు ఇచ్చాను. ఆ నాటిక ఎక్కడ వేసినా శశి అనే నా పాత్రకు నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తోంది. సినిమా పుట్టకముందు నుంచి నాటకరంగం ఉంది. ఈ రంగంలో ఇప్పటి వరకూ ఉన్న నాలాంటి చైల్ట్ ఆర్టిస్ట్స్‌కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చారు కానీ, బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వలేదు. కానీ ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటకం ఎక్కడ ప్రదర్శించినా ఉత్తమ నటుడిగా నాకు అవార్డు వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. హిందీలో, గుజరాతీలోనూ ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక వేశాం. పేరెంట్స్‌కి గిఫ్ట్స్‘‘భవిష్యత్‌లో నేను ఒక మంచి ఆర్టిస్టును అవ్వాలనుకుంటున్నాను. ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే రోల్స్ చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్‌లో యాక్ట్ చేస్తున్నాను. యాడ్స్ కూడా చేస్తున్నాను. వేటికవే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్’’ అని చెప్పాడు ఉజ్వల్ తేజ్. ‘భైరవం, ఆయ్’ వంటి సక్సెస్ఫుల్ సినిమాలతో పాటు ‘గాలివాన, పరంపర’ వంటి వెబ్ సిరీస్‌లోనూ మెరిశాడు ఉజ్వల్ తేజ్. ‘నిండు నూరేళ్ళ సావాసం’, ‘పాపే మా జీవనజ్యోతి’ వంటి సీరియల్స్‌తో బిజీగా ఉంటున్న ఉజ్వల్ పంచుకున్న కొన్ని విషయాలు...→ మా స్వస్థలం కర్నూలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాం. 8వ క్లాస్ చదువుతున్నాను. నాకు చిన్నప్పట్నుంచి యాక్టింగ్, డ్యాన్స్ ఇష్టం. వాటిలో నాకున్న స్కిల్‌ని మా పేరెంట్స్ గమనించి, డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేయించారు. అక్కడ మా పేరెంట్స్ ఫ్రెండ్ ఒకరి సలహాతో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ కాంటెస్ట్‌లో పోటీ చేశాను. తమిళనాడులో తెలంగాణ స్టేట్‌ను, దుబాయ్‌లో ఇండియానూ రిప్రజెంట్ చేసి, విజేతగా నిలిచాను.→ నా తొలి సినిమా పేరు ‘నా సినిమా ఆగిపోయింది’. ఈ చిత్రంలో యాక్ట్ చేసేప్పుడు నాకు సరిగ్గా యాక్టింగ్ రాదు. కానీ ఆ సినిమా డైరెక్టర్ ప్రోత్సాహంతో బాగా నటించగలిగాను. ఈ సినిమా త్వరలోనే విడుదలవుతుంది. దీనికన్నా ముందు నేను యానీ మాస్టర్‌తో ఓ యాడ్ చేశాను.ఏ ఒక వైపు యాక్టింగ్... మరోవైపు స్టడీస్... ఈ రెంటినీ ఎలా బ్యాలన్స్ చేస్తున్నానంటే.. షూటింగ్ స్పాట్‌కి బుక్స్ తీసుకు వెళ్తాను. షూటింగ్లో నాకు ఖాళీ దొరికినప్పుడల్లా మా అమ్మగారు నా చేత చదివిస్తుంటారు. నేను ఏవైనా క్లాసులు మిస్ అయితే నా టీచర్స్ నాకు రీ క్యాప్ చేస్తారు. నా ఫ్రెండ్స్ నోట్స్‌లు ఇస్తారు. → మా స్కూల్లో చిల్డ్రన్స్ డేని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక చిల్డ్రన్స్ డేకి మా స్కూల్లో ఓ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. కానీ అదే రోజు నేను షూటింగ్లో పాల్గొనాలి... అయితే అనుకోకుండా నేను ఆ షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. ఇది తెలిసి మా ప్రిన్సిపాల్ మేడమ్ నన్ను పిలిపించి, అప్పటికప్పుడు నాతో డ్యాన్స్ చేయించారు. అది నాకో హ్యాపీ మూమెంట్. కొన్నిసార్లు నాకు షూటింగ్ ఉన్న రోజే ఎగ్జామ్స్ కూడా ఉండేవి. ఇలాంటి పరిస్థితుల్లో నేను సినిమా యూనిట్ దగ్గర అనుమతి తీసుకుని, ఎగ్జామ్స్ రాసేవాడిని. ఇలా కుదరకపోతే మా ప్రిన్సిపాల్ నాకు సపోర్ట్ చేస్తారు.ఏ నా తొలి సంపాదనతో మా అమ్మానాన్నలకు బహుమతులు ఇవ్వడం నాకెంతో సంతృప్తినిచ్చింది. నా మూవీస్ ‘బ్రిలియంట్ బాబు’, ‘స్మాల్ టౌన్ బాయ్స్’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. సుద్దపూసని కాదు‘‘హ్యాష్‌టాగ్ 90స్’ వెబ్ సిరీస్లోలాగా నేను చదువులో సుద్దపూసని కాదు. నాకెప్పుడూ 90కి పైగా మార్కులు వస్తుంటాయి. నాకు పరీక్షలు ఉన్నప్పుడు ఏవైనా షూటింగ్స్ ఉంటే అమ్మ ఒప్పుకోదు. ఎందుకంటే ఫస్ట్ చదువుకే ప్రియారిటీ.. ఆ తర్వాతే ఏదైనా. అందుకే ఏ పరీక్షనూ ఇప్పటివరకు మిస్ అవలేదు’’ అని రోహన్ రాయ్ తెలిపాడు. ‘వినయ విధేయరామ, రాజుగారి గది 2, రంగుల రాట్నం, మిస్టర్ మజ్ను, చెక్, సూపర్ మచ్చి, గుడ్‌లక్ సఖి..’ వంటి పలు సినిమాలతో పాటు సీరియల్స్‌లో, ‘హ్యాష్‌టాగ్ 90స్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించిన రోహన్ రాయ్ చెప్పిన విశేషాలు.మా నాన్న సుబ్బారాయుడుగారు (చీరాల) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ప్రస్తుతం బెంగళూరులో పని చేస్తున్నారు. అమ్మ రాధామాధవి బేసికల్‌గా నా మేనేజర్ కూడా. నా కోసం తన పని వదులుకుంది. నా డేట్స్ చూసుకోవడంతో పాటు షూటింగ్స్‌కి నా వెంట వస్తుంటుంది. → చిన్నప్పుడు ఇంట్లో టీవీ బాగా చూసేవాణ్ణి. నా వయస్సు ఐదేళ్లున్నప్పుడే ఎవరైనా మా ఇంటికి వచ్చి వెళ్లాక వాళ్లని ఇమిటేట్ చేసేవాణ్ణి. వాళ్లు కూర్చునే, నడిచే విధానాన్ని కూడా. అప్పుడు నాకు, మా కుటుంబ సభ్యులకు అర్థమైంది నాకు నటన అంటే ఇష్టం అని. టీవీలో స్క్రోలింగ్ చూసి ‘డ్రామా జూనియర్స్’ ఆడిషన్స్‌కి నన్ను తీసుకెళ్లింది అమ్మ. అందులో నేనే ఫస్ట్ కంటెస్టెంట్. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 4 చేశాను. ‘డ్రామా జూనియర్స్’లో నా నటన చూసి డైరెక్టర్ బోయపాటి శ్రీనుగారు ఆడిషన్ చేసి, ‘వినయ విధేయ రామ’ సినిమాకి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఓంకార్‌గారు ‘రాజుగారి గది 2’లో చాన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి నా ప్రయాణం కొనసాగుతోంది. → హీరోలు నానీగారిని, నవీన్ పొలిశెట్టిగారిని చూసినప్పుడు నేను కూడా వారిలా కావాలనిపించేది. తెరపై వాళ్లు నటిస్తున్నట్లు ఉండదు... వారిద్దరూ నేచురల్ యాక్టర్స్. కథ, పాత్రల్ని ఎంపిక చేసుకునే విధానంలో వాళ్లిద్దర్నీ స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటాను. నానీగారు హీరో కాదు.. ఆర్టిస్ట్. కథ నచ్చితే ఆయన ఏదైనా చేయగలరు.→ నా జీవితంలో మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం ‘హ్యాష్‌టాగ్ 90స్’ వెబ్ సిరీస్. దాని తర్వాత వెంట వెంటనే సినిమాలు రావడం, మంచి పాత్రలు ఎంచుకుని చేయడం చాలా సంతోషంగా ఉంది. తిరువీర్గారు హీరోగా రాహుల్ శ్రీనివాస్‌గారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఈ నెల 7న విడుదలైంది. ఈ చిత్రంలో నేను చేసిన రాము పాత్రకి చాలా మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం శివాజీగారితో ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే సినిమా చేశాను. త్వరలో విడుదల కానుంది. → షూటింగ్ ఉన్నప్పుడు క్లాసులు మిస్ అవుతాను. నైట్ లేదా షూటింగ్ గ్యాప్‌లో చదువుకోవడం, రాసుకోవడం చేస్తుంటాను. యూట్యూబ్, గూగుల్ తల్లి కూడా ఉంది. వాటి నుంచి కూడా నేర్చుకుంటూ ఉంటాను. రాత్రిళ్లు మేలుకుని నోట్స్ రాసుకుంటాను. ఈ విషయంలో మా ఫ్రెండ్స్, టీచర్స్ నాకు బాగా సపోర్ట్ చేస్తారు. అప్పులు తీర్చాను‘కిష్కింధపురి, పరాక్రమం’ చిత్రాల్లో బాలనటుడిగా ప్రేక్షకులను మెప్పించాడు అర్షిత్. చిరంజీవి, నాగార్జునలను స్ఫూర్తిగా తీసుకుని, భవిష్యత్‌లో పెద్ద నటుడు కావాలనుకుంటున్న అర్షిత్ పంచుకున్న కొన్ని విషయాలు....→ స్వస్థలం గోదావరి ఖని. హైదరాబాద్‌లో ఉంటున్నాం. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాను. నాకు నటన అంటే ఆసక్తి కలగడానికి మా అక్క కారణం. అలాగే ‘పిల్లలు పిడుగులు’ టీవీ షో నుండి ‘డ్రామా జూనియర్స్’ వరకు... నేను ఇండస్ట్రీలోకి రావడానికి చాలామంది స్ఫూర్తిగా నిలిచారు. షూటింగ్ సమయంలో ఎగ్జామ్స్ ఉంటే ముందుగా షూటింగ్స్‌కే ప్రిఫరెన్స్ ఇస్తాను. నేను పరీక్షలకు హాజరు కాకపోయినా వాళ్ళు నాకు విడిగా ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. నా క్లాస్‌లో నేనే టాపర్‌ని. షూటింగ్ గ్యాప్‌లో చదువుకుంటాను. నా ట్విన్ సిస్టర్ స్టడీ సిలబస్‌లో నాకు సహాయం చేస్తుంది. ఇంట్లో కూడా అమ్మానాన్నలు నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటారు.→ సినిమాల్లో నటిస్తూ, సిల్వర్ స్క్రీన్ పై కనిపించినంత మాత్రాన నన్ను క్లాస్‌లో ప్రత్యేకంగా ఏం చూడరు. క్లాస్‌లో అందరిలానే నేనూ ఓ సాధారణ అబ్బాయిని. అయితే మా బంధువులు నన్ను చూసి గర్వపడుతుంటారు. పెద్ద హీరోలతో పని చేయడం నాకు స్ఫూర్తినిస్తుంది. సెట్స్‌లో వారి కష్టాన్ని గమనిస్తుంటాను. వాళ్ల కష్టాన్ని చూసి, నేను చాలా నేర్చుకుంటుంటాను. హీరోలతో కలిసి పని చేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను.→ చైల్డ్ ఆర్టిస్టుగా నా మొదటి సినిమా ‘సర్కిల్’. ఈ చిత్రంలో నటించినందుకు రూ. 1000 పారితోషికం ఇచ్చారు. నా తొలి సంపాదనను మా తల్లిదండ్రులకు ఇచ్చేశాను. అలాగే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు ఓ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించగా, నేను యాక్ట్ చేసిన ‘పచ్చిపులుసు’ షార్ట్ ఫిల్మ్‌కి, రూ. 15 లక్షల ప్రైజ్ మనీ బహుమతిగా లభించింది. ఆ తర్వాత మా అప్పులు కొన్ని తీర్చేశాను. ‘కిష్కింధపురి’ సినిమా తర్వాత నాకు మంచి గుర్తింపు లభిస్తోంది. నాతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఒక మంచి యాక్టర్‌గా ప్రేక్షకుల చేత గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం.యాక్టింగ్... చారిటీ బాల నటుడిగా 25కి పైగా సినిమాల్లో నటించాడు నాగచైతన్య వర్మ. ‘అమీర్‌పేటలో, నారప్ప, నా సామిరంగా, జటాధర, పేకమేడలు, లగ్గం’ వంటి పలు సినిమాలతో పాటు ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్‌తో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న నాగచైతన్య వర్మ తన ఫ్యూచర్ ప్లాన్స్‌ని ఇలా పంచుకున్నాడు... → మాది అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చమర్తివాండ్ల పల్లి. నటుడు కావాలనే నా ఆకాంక్షను మా అమ్మానాన్న వరలక్ష్మి దేవి, నాగార్జున రాజు ప్రోత్సహించారు. ‘అమీర్‌పేటలో’ సినిమాతో నటుడిగా నా జర్నీ మొదలైంది. ప్రస్తుతం ఎయిత్ క్లాస్ చదువుతున్నాను. షూటింగ్స్ ఉన్నప్పుడు స్కూల్‌కి సెలవు పెడతాను కదా... అప్పుడు ఫ్రెండ్స్‌ని అడిగి నోట్స్ రాసుకుంటాను. స్కూల్ వాళ్లు కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు. నా ఫస్ట్ ప్రియారిటీ ఎగ్జామ్స్‌కే. ఎగ్జామ్స్‌లో నాకు 80 శాతంపైన మార్కులు వస్తుంటాయి. టాప్ 5 ర్యాంక్స్లో కచ్చితంగా నేను ఉంటాను.→ నా సినిమాలు చూసినప్పుడు ‘బాగా నటించావ్.. ఇలాగే ముందుకెళ్లు’ అని టీచర్లు, నా స్నేహితులు చెబుతుంటారు.. ఈ ఆగస్టులో విడుదలైన ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్‌లో అవసరాల శ్రీనివాస్‌గారి చిన్నప్పటి పాత్రలో నెగటివ్ రోల్ చేశాను. నా నటన బాగుందని చాలా మంది అభినందించారు. ఈ నెల 7న విడుదలైన ‘జటాధర’ సినిమాలో హీరో సుధీర్ బాబు చిన్నప్పటి పాత్ర చేశాను. మంచి మూవీ చేశానని పొగిడారు.→ నేను నటించడం మా బంధువులకు, ఇరుగు పొరుగు వాళ్లకి చాలా ఇష్టం. ‘నువ్వు ఇంకా బాగా నటించి, మంచి స్థాయికి వెళ్లాలి’ అని అంటుంటారు. నా సినిమా చూసి బాగా చేశావని చెబుతున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. తెలుగు సినిమా వేదిక మా తెలుగు తల్లి, కళావారధి సౌజన్యంతో 2023లో నిర్వహించిన ఉగాది పురస్కారాల్లో ఉత్తమ బాలనటుడిగా ఆర్. నారాయణమూర్తి సార్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. → జూలై 28న నా పుట్టినరోజు సందర్భంగా కడపలోని బాలల అనాథాశ్రమానికి నా పారితోషికంలో నుంచి ప్రతి ఏడాదీ నగదు సాయం చేయడం నాకెంతో సంతృప్తినిస్తుంది.ఏ ప్రస్తుతం ప్రభాస్‌గారి ‘ఫౌజి’తోపాటు ‘హే భగవాన్, యుఫోరియా, సహకుటుంబానాం, సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, బ్యాచ్ మేట్స్, అర్జునుడి గీతోపదేశం’ సినిమాలు చేస్తున్నాను. ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోవాలనుకుంటున్నా. ఏడేళ్లు...మూడు గంటలు...ఏడు రికార్డులు∙నృత్య ప్రతిభకళ పట్ల ప్రేమ ఉంటే ఏ వయసు అయినా వండర్స్ సృష్టించవచ్చు అనడానికి నిదర్శనం శర్నీథా దత్త రచ్చ. హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఉంటున్న ఈ చిన్నారి వయసు ఏడేళ్లు. ఇటీవల రంగప్రవేశం (సోలో అరంగేట్రం)తో ఏకధాటిగా మూడు గంటల పాటు కూచిపూడి నృత్యం చేసిన అరుదైన గుర్తింపుతో పాటు ఏడు రికార్డులను సొంతం చేసుకుంది. అతి పిన్న వయస్కురాలైన కళాకారిణి గా శర్నీథ వార్తల్లో నిలిచింది.శర్నీథా దత్త రచ్చ రెండవ తరగతి చదువుతోంది. రెండేళ్లక్రితం శాస్త్రీయ నృత్యంలో ఓనమాలు దిద్దిన శర్నీథ ఇటీవల సంక్లిష్టమైన నాట్య భంగిమలను, తిల్లానాలను అత్యద్భుతంగా ప్రదర్శించి ఎంతోమంది ప్రశంసలను అందుకుంది.సాధనమున రికార్డులు... శర్నీథా నృత్యాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్, డైమండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వం బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్.. చూసి శర్నీథ ప్రతిభను గుర్తించాయి. అసాధారణమైన ఈ ప్రతిభకు శారద కళాక్షేత్రం నుంచి ’నాట్యమయూరి’ అవార్డును గురువు భావన పెద్రపోలు నుంచి అందుకున్నది. అలసట ఎరగని తపన... శర్నీథా తల్లిదండ్రులు రచ్చ హరి వినోద్, నరీనా దేవి కూతురి మూడేళ్ల వయసు నుంచి శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు. ‘నృత్యం అంటే శర్నీథకు ప్రాణం. ప్రాక్టీస్ అంటే చాలు సాధన చేస్తూనే ఉంటుంది. నృత్యాంగేట్రం చేయడానికి ఎనిమిది నెలలు ప్రాక్టీస్ చేసింది. వారణాసి లో అసి ఘాట్, అయోధ్య రామమందిరం లోపల, చిదంబరం గర్భగుడి దగ్గర, బాసరలో... నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఈ ఏడాది జూలైలో జరిగిన ఆల్ ఇండియా డ్యాన్స్ ఫెస్టివల్ సబ్ జూనియర్లో పాల్గొని, ఐదవ స్థానంలో నిలిచింది. శర్నీథ నృత్యసాధనలో చూపే భక్తి, శ్రద్ధ ప్రముఖ నృత్యకారులను కూడా మెప్పిస్తుంది. అభినయంలో చిన్న వయస్సులోనే చూపే ఆత్మవిశ్వాసం ప్రేక్షకులను సమ్మోహ పరుస్తుంది. – నిర్మలారెడ్డి -
Sakshi Little Stars: ఆశీస్సులే ఆయువు
ఆశ తొణుకుతున్నప్పుడుఆశీస్సు దానిని నిలబెట్టవచ్చు. ఔషధం ఓడుతున్నప్పుడు ప్రార్థన దానిని గెలిపించవచ్చు. అశ్రువు ఉబుకు తున్నప్పుడు ఆర్ద్రత దానిని మందస్మితం చేయవచ్చు. డబ్బు ఖర్చు లేని అనంత దయ, సేవ, ఆర్ద్రత, సాంత్వన మన వద్ద ఉంటాయి. నిజ హృదయంతో వెచ్చిస్తే పని చేస్తాయి. ఈ పిల్లలకు అవన్నీ కావాలి. ఈ పిల్లలు చిరంజీవులై వెలగాలి. ‘సాక్షి’ మీడియా చైల్డ్ సెలబ్రిటీలతో తనదైన ప్రయత్నం చేసింది. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలలు ఒక పూట కువకువలాడారు. పకపక నవ్వారు.నవంబర్ 14 ‘బాలల దినోత్సవం’ నేపథ్యంలో ఎం.ఎన్.జె. కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 150 మంది చిన్నారులను పలకరించే ప్రయత్నం చేసింది సాక్షి మీడియా. ‘పొట్టేల్’. ‘సరిపోదా శనివారం’, ‘మన్మథుడు–2’ వంటి సినిమాల్లో నటించిన బాలతారలు ఖ్యాతి, సాన్విక, స్నితిక్, జాతీయ క్రీడాకారిణి కార్తీకలను తీసుకొచ్చి వారితో ముచ్చటించేలా చేసింది. చైల్డ్ సెలబ్రిటీలు వారి కోసం ఆటలు, పాటలు, డ్యాన్సులతో అలరించారు. అలాగే తమ ఆరోగ్యస్థితిని చైల్డ్ సెలబ్రిటీలతో పంచుకున్నారు.నాకు ప్రస్తుతం బాగానే ఉంది. డాక్టర్లు బాగా చూసుకుంటున్నారు. నాకు అల్లు అర్జున్ సినిమాలంటే ఇష్టం. నన్ను కలవడానికి వచ్చిన సెలబ్రిటీల కోసం పుష్ప సినిమా పాట పాడాను. నా కోసం సాన్విక కూడా పాట పాడింది. వారితో కలిసి మాట్లాడటం హ్యాపీగా ఉంది.– జశ్వంత్మేం సిద్దిపేట నుంచి వచ్చాం. హాస్పిటల్ అంటే నాకు భయం.. కానీ ఇక్కడ బాగానే ఉంది. సినిమాల్లో నటించే వారు మా కోసం రావడం సంతోషంగా ఉంది. నాకు కూడా సినిమాలంటే ఇష్టం. చివరగా శ్యాం సింగరాయ్ సినిమా చూశాను. త్వరగా నయమైతే స్కూల్‌కు వెళ్లాలనుంది. – రిషి ప్రియ, సిద్దిపేటచాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. నాకు చదువంటే చాలా ఇష్టం, ముఖ్యంగా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. స్పైడర్‌మ్యాన్ నా ఫేవరెట్. సాన్విక అక్కతో ఆడుకున్నాను, లెక్కలు చెప్పాను. – ఓ చిన్నారి, జహీరాబాద్ బద్దీపూర్నాకు ఫుట్‌బాల్, దాగుడుమూతలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అవన్నీ ఆడుకోలేకపోతున్నాను. ఇలా బాధ పడుతున్న సమయంలో వీరంతా వచ్చి నాతో ఆడుకున్నారు. చాలా ముచ్చట్లు చె΄్పారు. నన్ను షూటింగ్‌కు తీసుకెళతానని కూడా చె΄్పారు. – చేతన్విభిన్న పేర్లతో పలు రకాల కేన్సర్లు ఉన్నప్పటికీ అవన్నీ హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సెస్, సాలిడ్ ట్యూమర్స్ అనే రెండు విభాగాల కిందకు వస్తాయి. చిన్నారుల్లో దీర్ఘకాలం పాటు హై ఫీవర్, చలి జ్వరం, బ్లీడింగ్, చిగుర్లలో రక్తస్రావం.. శరీరంలో, చాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వయసుకు తగ్గట్టు బరువు పెరగక పోవడం లేదా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి. సాలిడ్ ట్యూమర్స్‌లో పిల్లలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, ఫిట్స్ రావడం జరుగుతుంది. చికిత్స పొందుతున్న చిన్నారులకు క్యాన్సర్‌కు సంబంధించిన అవగాహన అంతగా ఉండకపోవడం వల్ల ఎక్కువగా భయం ఉండదు. కానీ నిత్యం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం వల్ల మానసిక ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో వారికోసం ప్రత్యేకంగా ప్లే స్టేషన్ ఏర్పాటు చేశాం. ఇలాంటి వ్యాధితోనే ఇబ్బంది పడుతున్న ఇతర చిన్నారులతో మమేకం చేస్తాం. – అనుదీప్, మెడికల్ ఆంకాలజిస్ట్అవగాహన వచ్చిందికేన్సర్ గురించి కొంచెం అవగాహన ఉంది. అందుకే గతంలోనే ఇలాంటి చిన్నారుల కోసం నేను రెండుసార్లు నా హెయిర్ డొనేషన్ చేశాను. కానీ ఇలాంటి ప్లేస్‌కు రావడం ఇదే మొదటి సారి. వీరి విల్ పవర్ చూశాక సమస్య ల నుంచి ఎలా రాణించాలో ఒక అవగాహన వచ్చింది. మళ్లీ మళ్లీ ఇక్కడికి వచ్చి ఈ చిన్నారులతో ఆడుకోవాలనుంది.– కార్తీక, నేషనల్ ప్లేయర్హెయిర్ డొనేట్ చేస్తానుఈ హాస్పిటల్లో చిన్నారులను చూశాకే కేన్సర్ ఎంత ప్రమాదకరమైనదో తెలిసింది. వారిని చూస్తుంటే ఏడుపొచ్చేసింది. నేను కూడా గతంలో ఇలాంటి వారి కోసం హెయిర్ డొనేట్ చేశాను. మళ్లీ కూడా చేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాను. –ఖ్యాతి, సరిపోదా శనివారం ఫేమ్వీరిని చూశాక లోపల ఎంతో బాధ కలిగినప్పటికీ దానిని దాచి వీరందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నం చేశాను. పాటలు పాడాను, నాటు నాటు డ్యాన్స్ చేశాను. – సాన్విక, సరిపోదా శనివారంవీరందరినీ ఇలా చూస్తుంటే భయమేసింది. అందరికీ నయం అయి త్వరగా ఇంటికి పోవాలని కోరుకుంటున్నాను. అందరితో ఆడుకున్నాను, డ్యాన్సులు చేశాను. – స్నితిక్, పొట్టేల్ ఫేమ్భయం లేదు చికిత్సలు ఉన్నాయిఅనారోగ్యం అని తెలిశాక పరీక్షల నిర్థారణతో పాటు చికిత్సలో భాగంగా అన్ని సేవలు ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్లో ఉచితంగానే అందుతాయి. వ్యాధి దశను బట్టి చికిత్స కొనసాగుతుంది. ఈ చిన్నారులకు న్యూట్రిషన్ చాలా అవసరం. దీనికోసం కడల్స్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో మంచి న్యూట్రిషన్ అందిస్తున్నారు. చిన్నారుల వయస్సు, బరువును బట్టి ్రపొటీన్ ΄్యాకెట్స్, డ్రై ఫూట్స్ తదితరాలను అందిస్తున్నారు. కీమో, రేడియేషన్ వంటి చికిత్సల కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తున్న వారికి చుట్టుపక్కల విడిదికి కూడా సహాయం చేస్తున్నారు. కేన్సర్ వ్యాధి జన్యుపరంగా కూడా వస్తున్నప్పటికి అది 15 నుంచి 20 శాతం మాత్రమే. కేన్సర్లకు పలు రకాల కారణాలున్నాయి. కేన్సర్‌కు ఇతర దేశాల్లో అందిస్తున్న అధునాతన చికిత్సకు మనకు వ్యత్యాసం పెద్దగా ఏమీ లేదు. మన దగ్గర కూడా లేటెస్ట్ ట్రయల్స్ మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ వారమంతా లిటిల్ స్టార్స్ సందడిని సాక్షి యూట్యూబ్‌లో చూడటానికి QR కోడ్‌ను స్కాన్ చెయ్యండి – డి.జి. భవాని– హనుమాద్రి శ్రీకాంత్ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల -
Sakshi Little Stars: ఇదీ రక్త బంధమే!
మన సంస్కృతి, సంప్రదాయలు, కుటుంబ విలువల్లో ‘రక్త సంబంధం’ అనే మాట పవిత్రమైనది. సానుకూల శక్తికి నిలువెత్తు అద్దంలాంటిది. సానుకూల శక్తి అనుకున్నది ప్రతికూల శక్తిగా మారితే? వరం అనుకున్నది శాపం అయితే? అది అనుభవిస్తే కాని తెలియని బాధ.చిన్నారుల ఆనందప్రపంచాన్ని జన్యు సంబంధిత వ్యాధి తలసేమియా దూరం చేస్తుంది. ఎప్పుడూ ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేస్తుంది. ‘అందరిలా నేనెందుకు ఉండకలేకపోతున్నాను’ అనే ఆవేదనను వారిలో కలిగిస్తుంది. ‘లేదు... మీరు అందరిలాగే ఉండాలి. నవ్వాలి. ఆడాలి. ఇంద్రధనుస్సుల పల్లకీలో ఊరేగాలి’ అంటూ నడుం కట్టారు చైల్ట్ ఆర్టిస్ట్‌లు.నవంబర్ 14 బాలల దినోత్సవం నేపథ్యంలో... తలసేమియా బారిన పడిన చిన్నారులకు ప్రతి నెల ఉచితంగా రక్తం ఎక్కిస్తూ (బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్), మందులు అందిస్తూ విశేష సేవలు అందిస్తున్న హైదరాబాద్‌లోని ‘తలసేమియా సికిల్ సెల్ సొసైటీ’కి బాలతారలను తీçసుకువెళ్లింది సాక్షి. సలార్, పుష్ప–2లో నటించిన మోక్షజ్ఞ, పొట్టేల్ సినిమాలో నటించిన తనస్వీ, సరిపోదా శనివారంలో నటించిన అనన్యలు తలసేమియా బారిన పడిన చిన్నారులను ఆత్మీయంగా పలకరించడమే కాదు వారిని నవ్వించారు. తమ డ్యాన్స్‌లతో హుషారెత్తించారు. వారిలో ఆత్మస్థైర్యం నింపారు...వారసత్వంగా సంక్రమించే రక్త సంబంధ వ్యాధి (జెనెటికల్ బ్లడ్ డిజార్డర్) తలసేమియా. నివారణ మార్గాలున్నా అవగాహన లేమితో ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులు వేల సంఖ్యలో ఉన్నారు. వారు ప్రతీ రెండు, మూడు వారాలకు ఒకసారి తప్పనిసరిగా వారు రక్తం ఎక్కించుకోవాలి. ఇది అత్యంత ఖరీదైనది. ఇలాంటి పరిస్థితులలో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ‘తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ’ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది. ఇక్కడకి వచ్చిన చైల్డ్ ఆర్టిస్టులు తమలాంటి పసిహృదయాలకు ఎందుకు ఇంతటి కష్టం వచ్చిందని విలవిలలాడిపోయారు. లోపలి నుంచి తన్నుకొస్తున్న బాధను దిగమింగుకొని వారికి సంతోషాలను పంచే ప్రయత్నం చేశారు. వారి ఇష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఇబ్బందుల గురించి ఆరా తీశారు. ‘మీకు మేమున్నాం. మీ సమస్యలపై మా సినిమాల ద్వారా అవగాహన కల్పిస్తాం’ అన్నారు. తల్లడిల్లిపోయే తల్లులు ఎందరో...తన బిడ్డ కోసం ప్రతి నెలా ఖమ్మం నుంచి నుంచి హైదరాబాద్‌కు వస్తుంది ఒక తల్లి. ఆమె ఇద్దరు బిడ్డలకూ తలసేమియా సంక్రమించింది. పెద్దపాప బోన్ మ్యారో చికిత్స విఫలమై చనిపోయింది. చిన్నపాపను కాపాడుకోవాలనే ధృఢసంకల్పం ఆ తల్లిలో కనిపిస్తోంది. ‘ఈ వేదిక నాకు దేవాలయంతో సమానం’ అంటుంది. తన చెల్లి కోసం ప్రతీ నెల కడప జిల్లా నుంచి ఇక్కడికి వస్తుంది అర్ఫాన్. ఇలాంటి తల్లులు ఎంతో మంది తలసేమియా సికిల్ సెల్ సొసైటీలో కనిపిస్తారు. వారి కన్నీళ్లతో మన మనసు తడిసిపోతుంది.డాక్టర్ కావాలని ఉంది...‘‘నేను ఏడో క్లాస్ చదువుతున్నాను. మూడు నెలల నుంచి రక్తం అందిస్తున్నారు. ఈ అవస్థలు చూస్తుంటే..భవిష్యత్‌లో నేను డాక్టర్ అయిపోయి, నాలాంటి పిల్లలకు మంచి వైద్యం అందించాలని ఉంది. గేమ్స్ కూడా బాగా ఆడతాను’ అంటుంది ఖమ్మంకు చెందిన దీపిక.మా గురించి ఆలోచించండి...‘‘నేను ఆరేళ్ల నుంచి ఈ సేవలు పొందుతున్నాను. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాను. మా భోజనం అందరిలానే ఉంటుంది, కానీ పండ్లు తక్కువగా తినాలి. శరీరంలో రక్తం తగ్గినప్పుడు నీరసంగా ఉంటుంది. జ్వరం వస్తుంది. ఒక్కోసారి లేవలేనంతగా కాళ్ల నొప్పులు వస్తాయి. రక్తం తీసుకున్న తరువాత బాగానే ఉంటాం. దయచేసి మా గురించి ఆలోచించండి. మాకు రక్తం అందుబాటులో ఉండాలి. రక్తదాతలు సహకరిస్తేనే మాకు సరిపడా రక్త నిల్వలు ఉంటాయి. ఈ విషయంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమం సాక్షి నిర్వహిస్తున్నందుకు మనసారా కృతఙ్ఞతలు’’ అంటుంది గౌసియా.భయపడితే బతకలేము...నాకు 6 నెలల వయసులోనే తలసేమియా ఉందని గుర్తించారు. గత 21 ఏళ్లుగా ప్రతీ 15, 20 రోజులకు ఒకసారి ఇక్కడ రక్తం ఎక్కించుకుంటున్నాను. మాకు ఐరెన్ లెవల్స్ పెరగకుండా ట్యాబ్లెట్లు ఇస్తారు. దీని గురించి ఆలోచిస్తూ బాధ పడితే జీవితాన్ని ముందుకు సాగించలేను. అందుకే ధైర్యంగా ఉంటాను. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నాను. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. కొన్ని డ్యాన్స్ పోటీల్లో కూడా పాల్గొన్నాను. మాకు ఈ సెంటర్ అండగా ఉంటోంది. – మెహవీన్ ఫాతిమానేను యూకేజీ చదువుతున్నాను. వారం వారం నాన్న రక్తం కోసం ఇక్కడికి తీసుకువస్తాడు. మొదట్లో చాలా భయమేసేది. ఇప్పుడు భయం లేదు. – నిహారికప్రతి 3 వారాలకు రక్తం ఎక్కించుకోవడం అలవాటైంది. భయం లేదు. 7వ తరగతి చదువుతున్నాను. డ్యాన్సింగ్, సింగింగ్ అంటే చాలా ఇష్టం. నా వ్యాధి గురించి స్కూల్లో టీచర్లకు కూడా తెలుసు. చాలా విషయాల్లో సహాయం చేస్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ ఇక్కడి వచ్చినప్పుడల్లా ఎందుకొచ్చానని బాధగా అనిపిస్తూనే ఉంటుంది. – సంకీర్తన, కరీంనగర్రక్తదాతలు ముందుకు రావాలి...తలసేమియాతో నాకు బాబు పుట్టాడు. ఆ సమయంలో దక్షిణాదిలో డాక్టర్లకు కూడా ఈ వ్యాధిపైన అంతగా అవగాహన లేదు. దేశంలోని ఎన్నో హాస్పిటల్లు, మెడికల్ కాలేజీలు తిరిగి దీని గురించి తెలుసుకుని మళ్లీ నగరంలోని డాక్టర్లకు అవగాహాన కల్పించి బాబుకు చికిత్ప అందించాను. నాలాంటి మరో 20 కుటుంబాల వారు కలిసి 1998లో డా. ఏఎన్ కృష్ణకుమారి సహాయంతో ఈ సెంటర్‌ను స్థాపించాం. మా ప్రయత్నంలో ఎందరో సామాజికవేత్తలు, డాక్టర్లు సహకారం అందించారు. విరాళంగా అందించిన స్థలంలో దాతల సహాయంతోనే ఈ సెంటర్‌ను నిర్మించాం. ఇప్పటికి 4199 మంది చికిత్న పొందుతున్నారు. ఇప్పటి వరకు 3 లక్షల యూనిట్ల రక్తం అందించాం. ఇంతమందికి సేవలందిస్తున్న ప్రపంచంలో అతి పెద్ద సంస్థ మాదే అని చెప్పడానికి గర్వంగా ఉంది. ప్రస్తుతం నా బాబు లేడు. కానీ నాకు 4199 మంది పిల్లలున్నారు. వీరికి మా సేవలు ఇలానే అందాలంటే రక్తదాతల అవసరం ఎంతో ఉంది. స్వచ్ఛందంగా రక్తదాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. – రత్నావళి, ఫౌండర్, తలసేమియా సికిల్ సెల్ సొసైటీఏడుపొచ్చింది...ఇక్కడి రాగానే ఏడుపొచ్చేసింది. నాలాంటి చిన్నారులే సెలైన్లు పెట్టుకుని రక్తం ఎక్కించు కుంటుంటే బాధగా అనిపించింది. వారికి సంతోషాలను పంచాలని, వారితో ఆడుకున్నాను. నా పొట్టేల్ సినిమాలోని ‘చీమ కాటుకే ఓర్చుకోలేవు ఈ నొప్పి ఎలా భరిస్తావ్’ అనే డైలాగ్ చెప్పాను. వర్షిత నాతో చాలా బాగా ఆడుకుంది, జానీ జానీ రైమ్స్ చెప్పింది. వీరందరినీ దేవుడు మంచిగా చూసుకోవాలి. – తనస్వీ, చైల్డ్ ఆర్టిస్ట్పెద్దయ్యాక సహాయం చేస్తాను...తలసేమియా పిల్లలతో సరదాగా ఆడుకుని ధైర్యం నింపాలని వచ్చాను. ఛత్రపతి డైలాగ్ చెబితే అందరూ చప్పట్లు కొట్టారు. ఇక్కడి అబ్దుల్ నన్ను టీవీలో చూశానని చెప్పాడు. ముఖేష్ నాకు ఫ్రెండ్ అయ్యాడు. తను డాక్టర్ అవుతాడంట. వీరి కోసం నేను డ్యాన్సులు కూడా చేశాను. నేను పెద్దయ్యాక ఇలాంటి వారికి సహాయం చేస్తాను. – మోక్షఙ్ఞ, చైల్డ్ ఆర్టిస్ట్ప్రభుత్వం ఆదుకోవాలి...ఇది జెనెటిక్ డిసీజ్ అయినప్పటికీ నివారించగలిగేదే. ఈ వ్యాధుల్లో నివారించగలిగే అవకాశముండటం చాలా అరుదు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఎంతో ఖరీదైన ప్రక్రియ. ఈ విషయంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సహాయసహకారాలు అందించాలి. – సుమాంజలి, సెక్రటరీ– సీఈఓఈ టెస్ట్ తప్పనిసరి చేయాలి...మేము ఆశ వర్కర్లు, పీహెచ్‌సీలతో కలిసి గర్భిణీ స్త్రీలకు హెచ్‌బీఏ2 టెస్ట్ చేయిస్తున్నాం. ఇప్పటి వరకు 30 వేల మందికి ఈ టెస్టులు చేయించాం. ప్రభుత్వం తరపున ఈ టెస్ట్‌లు అందరికీ తప్పనిసరి చేయాలి. – చంద్రకాంత్ అగర్వాల్, ప్రెసిడెంట్సినిమా ద్వారా అవగాహన కలిగిస్తాను...ఈ పిల్లలను చూడగానే కన్నీళ్లు ఆగలేదు. వీరికి ఏదైనా సహాయం చేయాలని «గట్టిగా అనుకుంటున్నాను. అందరు పిల్లలతో మాట్లాడాను. సరిపోదా శనివారం.. డైలాగ్ చెప్పాను. నా షూటింగ్స్ గురించి వారు అడిగారు. నాకు రక్తం అంటేనే భయం..అలాంటిది వీరు ప్రతీ నెలా ఎక్కించుకుంటుంటే ఊహించడానికే కష్టంగా ఉంది. నా సినిమాల్లో ఈ వ్యాధి గురించే అవగాహన కల్పించే క్యారెక్టర్ చేసే ప్రయత్నం చేస్తాను.– అనన్య, చైల్డ్ ఆర్టిస్ట్ తలసేమియా నివారణకు... హెచ్‌బీఏ–2 అనే పరీక్షను మహిళకు పెళ్లి తర్వాత, గర్భధారణకు ముందు చేయిస్తే తలసేమియాను తేలిగ్గా నివారించవచ్చు.గమనిక: ఈ రోజు రావలసిన ‘సన్నిధి’ పేజీకి బదులుగా బాలల దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ నిర్వహిస్తున్న ‘లిటిల్ స్టార్స్’ పేజీ ఇస్తున్నాం.– డి.జి. భవాని– హనుమాద్రి శ్రీకాంత్ఫొటోలు: అనీల్ మోర్ల -
హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్న చైల్డ్ ఆర్టిస్ట్!
సారా అర్జున్.. ఈ పేరు వినగానే గుర్తుకొచ్చే చిత్రం దైవతిరుమగళ్. విక్రమ్, అనుష్క, అమలాపాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్నే అందుకుంది. ఆ చిత్రంలో కీలక పాత్రను పోషించిన బాలనటి సారా. ఆ తరువాత సైవం చిత్రంలోనూ బాల నటిగా ముఖ్యపాత్ర పోషించి పేరు తెచ్చుకుంది. ఇటీవల మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నందితగా నటి ఐశ్వర్యరాయ్ పోషించిన విషయం తెలిసిందే. అందులో చిన్న నందినిగా సారా నటించింది. ఆ బాలనటి హీరోయిన్గా.. ఆ బాల తార ఇప్పుడు హీరోయిన్గా మారుతోంది. దివంగత ఛాయాగ్రాహకుడు, దర్శకుడు జీవా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. 12 బీ, ఉన్నాలే ఉన్నాలే, ధామ్ ధూమ్ వంటి విజయవంతమైన చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఈయన వారసురాలు సనా మరియం ఇప్పుడు మెగాఫోన్ పట్టబోతున్నారు. ఈమె దర్శకత్వం వహించనున్న చిత్రంలో నటి సారా అర్జున్ కథానాయికగా పరిచయం కానుంది. ఆ బాలనటుడు హీరోగా మరో విశేషం ఏమిటంటే పొన్నియిన్ సెల్వన్‌లో విక్రమ్ చిన్ననాటి పాత్రను పోషించిన బాలనటుడు సంతోష్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నారని సమాచారం. దీన్ని కుష్బూ, సుందర్ సి.. అవ్నీ పిక్చర్స్ పతాకంపై నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని సమాచారం. చదవండి: 'యానిమల్' విజయంలో ఎందుకు కనిపించలేదంటే.. -
చిరంజీవితో ఉన్న పిల్లల్లో ఓ హీరోహీరోయిన్ ఉన్నారు.. కనిపెట్టారా?
మెగాస్టార్ చిరంజీవి దాదాపు రెండు మూడు జనరేషన్లని కవర్ చేసిన హీరో. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. హిట్లు ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా క్రేజ్ సంపాదించారు. అయితే కొన్నేళ్ల ముందు ఆయనతో నటించిన పలువురు చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోహీరోయిన్లు కూడా అయిపోయారు. పైన ఫొటోలో ఉన్నది అలాంటి పిల్లలే. మరి వాళ్లు ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: హీరోయిన్ కంగనకు పెళ్లి? టైమ్ కూడా ఫిక్స్!) అవును మీలో కొందరు ఊహించింది కరెక్టే. పైన ఫొటో చిరంజీవి 'ఠాగూర్' సినిమాలోనిది. 2003 సెప్టెంబరు 24న రిలీజైన ఈ చిత్రం.. రీసెంట్‌గానే 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిరు కెరీర్ లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమాలో చిరు పక్కనే కొందరు పిల్లలు కూడా యాక్ట్ చేశారు. వాళ్లలో పైన ఫొటోలో ఉన్న తేజ సజ్జా, కావ్య కల్యాణ్ రామ్ ఇప్పుడు హీరోహీరోయిన్ అయిపోయారు. 'ఠాగూర్' సినిమా 20 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఈ పిక్ వైరల్ అయింది. అలా ఈ పిల్లల గురించి మరోసారి మాట్లాడుకునేలా చేసింది. బలగం, మసూద తదితర చిత్రాలతో లక్కీ బ్యూటీ అనిపించుకున్న కావ్య.. డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. పలు సినిమాల్లో హీరోగా చేసిన తేజ.. ప్రస్తుతం 'హనుమాన్' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. (ఇదీ చదవండి: టాలీవుడ్లో గందరగోళం.. ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్!) -
అప్పటి చైల్డ్ఆర్టిస్టులే ఇప్పుడు స్టార్సెలబ్రిటీలు
-
చైల్డ్ ఆర్టిస్టులను ఇక అలా చూపించొద్దు: కొత్త మార్గదర్శకాలు రెడీ!
న్యూఢిల్లీ: సీరియళ్లు, రియాలిటీ షోలంటూ బుల్లితెర మీదే కాదు.. సిల్వర్‌స్క్రీన్‌పై ఈ మధ్య డిజిటల్ స్క్రీన్ మీద కూడా పిల్లలను అభ్యంతరకరంగా, ఇబ్బందికరంగా చూపిస్తున్నారు. ఈ వ్యవహారంపై వీక్షకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా. ఈ తరుణంలో.. వినోద రంగానికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) డ్రాఫ్ట్ గైడ్లెన్స్ జారీ చేసింది. సినిమాలు, టీవీ, రియాలిటీ షో, షార్ట్ ఫిల్మ్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, వార్తలు, సోషల్ మీడియా వెబ్సైట్ కంటెంట్ విషయంలోనూ కొత్త గైడ్‌లైన్స్ వర్తిస్తాయని ఎన్సీపీసీఆర్ స్పష్టం చేసింది. సైబర్ చట్టాలు, పిల్లల హక్కులకు సంబంధించిన ఇతర చట్టాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ రూల్స్‌ను సిద్ధం చేసింది కమిషన్. తాజా డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం.. మూడు నెలల కంటే తక్కువ వయసున్న పసికందులను తెరపై చూపించకూడదు. అయితే.. చనుబాలు..రోగ నిరోధక శక్తి లాంటి అవగాహన కార్యక్రమాల కోసం మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనను పాటించకుంటే.. మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. సినిమా, సీరియళ్లు, ఓటీటీ .. ఇలా అన్ని కేటగిరీలకు ఈ రూల్స్ వర్తిస్తాయి. అంతేకాదు.. చిల్ట్రన్ ఇన్ న్యూస్ మీడియా అనే కేటగిరీని ప్రత్యేకంగా చేర్చింది ఎన్సీపీసీఆర్. దీని ప్రకారం.. పిల్లలు న్యూస్ ఛానెల్స్ లేదంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్‌లో ఇంటర్వ్యూలకు హాజరైనప్పుడు.. వాళ్లకు ఇబ్బందికలిగించేలా వ్యవహారించకూడదు. ముఖ్యంగా బాధితుల విషయంలోనూ విజువల్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకుంటే.. సంబంధిత చానెల్స్‌పై శిక్షలు కఠినంగా ఉంటాయి. ఈ గైడ్ లైన్స్ ప్రకారం.. నిర్భంధంతో పని చేయించుకోవడం తదితర అంశాలతో పాటు లేబర్ చట్టం ప్రకారం ఇక్కడ వర్తిస్తుంది. అలాగే.. సోషల్ మీడియా కూడా పిల్లలపై హింస విషయంలో బాధ్యతయుతంగా వ్యవహరించాలని కోరింది. ధూమపానం, మద్యపానంతో పాటు అత్యాచార బాధితులుగా, లైంగిక వేధింపుల బాధితులుగా, ఇబ్బందికర పరిస్థితులలో చూపించకూడదు. భారీ భారీ డైలాగులతో.. సమాజంపై చెడు ప్రభావం చూపించేలా పాత్రలను డిజైన్ చేయడం మేకర్లు మానుకోవాలని మార్గదర్శకాల్లో సూచించింది ఎన్సీపీసీఆర్. చివరిసారిగా.. 2011లో మార్గదర్శకాలను జారీ చేసింది ఎన్సీపీసీఆర్. ఈ నేపథ్యంలోనే చాలా ఏళ్ల తర్వాత.. కొత్త చట్టాలు, పాత నిబంధనల సవరణల ఆధారంగా భారీ మార్పులతో డ్రాఫ్ట్ గైడ్‌లెన్స్‌ను.. అదీ ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే సిద్ధం చేసింది ఎన్సీపీసీఆర్. వినోద రంగం నుంచి ఓ ప్రత్యేక కమిటీ ఈ మార్గదర్శకాల ప్రతిపాదనలను పరిశీలించి.. అభ్యంతరాలను, మార్పులు చేర్పులను తెలపనుంది. -
వీళ్లు పుడుతూనే సెలెబ్రిటీలు!
కొందరికి సాధన ద్వారా కళలు అలవడితే... మరికొందరు పుట్టుకతోనే కళాకారులుగా పుడతారు. లేదంటే చిన్న చిన్న పిల్లలు... అంత అద్భుతంగా ఎలా నటించగలుగుతారు! ప్రస్తుతం సీరియళ్లలో చైల్డ్ ఆర్టిస్టులకు డిమాండ్ ఎక్కువే ఉంది. సీరియళ్లన్నీ కుటుంబాల కథల చుట్టూ తిరుగుతాయి. కుటుంబమన్నాక పిల్లలు ఉంటారు కదా! హీరో హీరోయిన్ల చిన్ననాటి పాత్రలు ఎలానూ ఉంటాయి. వాటన్నిటి కీ చైల్డ్ ఆర్టిస్టులు అవసరం. ఈ అవసరం పిల్లల్లోని టాలెంట్‌ను వెలికి తీస్తోంది. ‘ముద్దుబిడ్డ’ చిన్నపిల్లల కథతోనే ప్రారంభమయ్యింది. ఆ తర్వాత తరాలు మారినప్పుడల్లా చిన్నపిల్లలు రంగ ప్రవేశం చేశారు. ‘రాధాకళ్యాణం’లో కళ్లతోనే సెంటిమెంటును కుమ్మరించిన బెంగళూరు అమ్మాయి శ్రేయను ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఇక మాస్టర్ సాయి హరీష్ గురించి చెప్పనక్కర్లేదు. హైస్కూల్, శుభాకాంక్షలు, గోరంత దీపం లాంటి చాలా సీరియళ్లలో మంచి మంచి పాత్రలు చేసి సినిమాల్లోకి కూడా వెళ్లిపోయాడు. ఇంత చిన్న వయసులో అంత గొప్పగా ఎలా నటించగలడా అనిపిస్తుంది తనని చూస్తే. ఇంకా ఇలాంటి చిన్నారులు చాలామంది ఉన్నారు. అయితే పిల్లల చుట్టూనే తిరిగే సీరియళ్లు తక్కువే. అప్పుడెప్పుడో వచ్చిన ‘కిట్టిగాడు’ లాంటివి ఇప్పుడు రావడమే లేదు. హిందీవాళ్లు మాత్రం పిల్లలనే ప్రధాన పాత్రధారులుగా పెట్టి కొన్ని సీరియల్స్ తీస్తున్నారు. పిల్లలూ అదరగొడ్తున్నారు. ఝాన్సీ రాణిగా ఉల్కాగుప్తా, మహరాణా ప్రతాప్‌గా ఫైసల్‌ఖాన్, ‘జై శ్రీకృష్ణ’గా ధృతీ భాటియాల నటనకు జనం జేజేలు పలికారు. ‘బడే అచ్చే లగ్తే హై’లో ‘పీహూకపూర్’గా అమృతా ముఖర్జీ, ‘యే హై మొహొబ్బతే’లో ‘రూహీ భల్లా’గా రుహానికా ధావన్, ‘ఉతరన్’లో ‘ఇచ్ఛా’గా స్పర్శ్ ఖాన్‌చందానీ, ‘వీరా’లో అన్నాచెల్లెళ్లుగా భవేష్ బాల్చందానీ, హృశితా ఓఝాల నటనకు హ్యాట్సాఫ్ చెప్పి తీరాలి. దేవత పాత్రలు పోషించడంలో సిద్ధహస్తురాలైన అన్షూర్ కౌర్ అయితే ఇప్పటికే ఎన్నో అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇక సాధిల్ కపూర్, శివాంశ్ కోటియా లాంటి చిచ్చర పిడుగుల గురించి చెప్పనక్కర్లేదు. సీరియళ్ల షూటింగ్ అంటే... ఒక్కరోజులో బోలెడన్ని సీన్లు తీసేస్తుంటారు. తమ షాట్ వచ్చే వరకూ ఓపిగ్గా ఉండాలి. పెద్ద పెద్ద డైలాగులు బట్టీ పట్టాలి. కానీ ఇవేవీ బుజ్జిగాళ్లని భయపెట్టడం లేదు. పెద్దవాళ్లతో సమానంగా పని చేసేస్తున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఇంకా ప్రపంచం గురించి సరిగ్గా తెలియకముందే యావత్ ప్రపంచాన్నీ కట్టి పడేస్తున్నారు ఈ బుల్లి స్టార్స్. వాళ్ల ముద్దొచ్చే మోములను, చిలిపి అల్లర్లను, సమ్మోహితపరిచే వారి అద్భుత నటనను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. పది కాలాలు పచ్చగా ఉండమంటూ దీవిస్తున్నారు!


