చైల్డ్‌ ఆర్టిస్టులను ఇక అలా చూపించడానికి వీల్లేదు: కొత్త మార్గదర్శకాలు రెడీ!

Child Rights Body New Guidelines For Entertainment Industry - Sakshi

న్యూఢిల్లీ: సీరియళ్లు, రియాలిటీ షోలంటూ బుల్లితెర మీదే కాదు.. సిల్వర్‌స్క్రీన్‌పై ఈ మధ్య డిజిటల్‌ స్క్రీన్‌ మీద కూడా పిల్లలను అభ్యంతరకరంగా, ఇబ్బందికరంగా చూపిస్తున్నారు. ఈ వ్యవహారంపై వీక్షకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా. ఈ తరుణంలో.. వినోద రంగానికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(NCPCR) డ్రాఫ్ట్‌ గైడ్‌లెన్స్‌ జారీ చేసింది.

సినిమాలు, టీవీ, రియాలిటీ షో, షార్ట్‌ ఫిల్మ్స్‌, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌, వార్తలు, సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌ కంటెంట్‌ విషయంలోనూ కొత్త గైడ్‌లైన్స్‌ వర్తిస్తాయని ఎన్‌సీపీసీఆర్‌ స్పష్టం చేసింది. సైబర్‌ చట్టాలు, పిల్లల హక్కులకు సంబంధించిన ఇతర చట్టాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ రూల్స్‌ను సిద్ధం చేసింది కమిషన్‌.  తాజా డ్రాఫ్ట్‌ రూల్స్‌ ప్రకారం..

మూడు నెలల కంటే తక్కువ వయసున్న పసికందులను తెరపై చూపించకూడదు. అయితే.. చనుబాలు..రోగ నిరోధక శక్తి లాంటి అవగాహన కార్యక్రమాల కోసం మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనను పాటించకుంటే.. మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. సినిమా, సీరియళ్లు, ఓటీటీ .. ఇలా అన్ని కేటగిరీలకు ఈ రూల్స్‌ వర్తిస్తాయి.

అంతేకాదు.. చిల్ట్రన్‌ ఇన్‌ న్యూస్‌ మీడియా అనే కేటగిరీని ప్రత్యేకంగా చేర్చింది ఎన్‌సీపీసీఆర్‌. దీని ప్రకారం.. పిల్లలు న్యూస్‌ ఛానెల్స్‌ లేదంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ పర్పస్‌లో ఇంటర్వ్యూలకు హాజరైనప్పుడు.. వాళ్లకు ఇబ్బందికలిగించేలా వ్యవహారించకూడదు. ముఖ్యంగా బాధితుల విషయంలోనూ విజువల్స్‌ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకుంటే.. సంబంధిత చానెల్స్‌పై శిక్షలు కఠినంగా ఉంటాయి. ఈ గైడ్‌ లైన్స్‌ ప్రకారం..  నిర్భంధంతో పని చేయించుకోవడం తదితర అంశాలతో పాటు లేబర్‌ చట్టం ప్రకారం ఇక్కడ వర్తిస్తుంది.

అలాగే.. సోషల్‌ మీడియా కూడా పిల్లలపై హింస విషయంలో బాధ్యతయుతంగా వ్యవహరించాలని కోరింది. ధూమపానం, మద్యపానంతో పాటు అత్యాచార బాధితులుగా, లైంగిక వేధింపుల బాధితులుగా, ఇబ్బందికర పరిస్థితులలో చూపించకూడదు. భారీ భారీ డైలాగులతో.. సమాజంపై చెడు ప్రభావం చూపించేలా పాత్రలను డిజైన్‌ చేయడం మేకర్లు మానుకోవాలని మార్గదర్శకాల్లో సూచించింది ఎన్‌సీపీసీఆర్‌.

చివరిసారిగా.. 2011లో మార్గదర్శకాలను జారీ చేసింది ఎన్‌సీపీసీఆర్‌. ఈ నేపథ్యంలోనే చాలా ఏళ్ల తర్వాత..  కొత్త చట్టాలు, పాత నిబంధనల సవరణల ఆధారంగా భారీ మార్పులతో డ్రాఫ్ట్‌ గైడ్‌లెన్స్‌ను.. అదీ ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే సిద్ధం చేసింది ఎన్‌సీపీసీఆర్‌.  వినోద రంగం నుంచి ఓ ప్రత్యేక కమిటీ ఈ మార్గదర్శకాల ప్రతిపాదనలను పరిశీలించి.. అభ్యంతరాలను, మార్పులు చేర్పులను తెలపనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top