'యానిమల్‌' సక్సెస్‌ను ఎందుకు సెలబ్రేట్‌ చేసుకోలేదంటే.: రష్మిక | Rashmika Mandanna Reveals Why She Did Not Celebrate The Success Of Animal Movie, Post Goes Viral - Sakshi
Sakshi News home page

Rashmika On Animal Success Celebrations: 'యానిమల్‌' విజయంలో ఎందుకు కనిపించలేదంటే..

Published Mon, Feb 26 2024 8:04 AM

Rashmika Mandanna Did Not Celebrate Animal Success - Sakshi

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న నటించిన గత చిత్రం 'యానిమల్' సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా విజయంలో ఆమె పాత్ర చాలా కీలకం అని చెప్పవచ్చు. గీతాంజలిగా ఆమె అందరికి మెచ్చేలా నటించింది. యానిమల్ సినిమా విడుదలైన తర్వాత, తన తదుపరి చిత్రాలపై ఫోకస్‌ చేయడం ప్రారంభించిన ఈ బ్యూటీ.. యానిమల్‌ సక్సెస్‌ మీట్‌లో రష్మిక పెద్దగా కనిపించలేదు. యానిమల్‌కు మంచి పాపులారిటీ వచ్చినప్పటికీ, రష్మిక ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడకపోవడంపై అభిమానుల్లో పలు సందేహాలు ఏర్పడ్డాయి. ఈ విషయంపై ఆమె తాజాగా ఇలా మట్లాడారు.

'యానిమల్ విడుదల తర్వాత నా తదుపరి సినిమాల కోసం సెట్స్ పైకి వెళ్లాల్సి వచ్చింది. షూటింగ్ షెడ్యూల్స్‌ వెనువెంటనే ఉండటం వల్ల ఎలాంటి ఇంటర్వ్యూలలో పాల్గొనలేకపోయాను..   అందువల్ల పెద్దగా బహిరంగంగా కనిపించలేదు. నా పట్ల ఉన్న ప్రేమతోనే ఈ ఆందోళన అని నాకు తెలుసు. అందరూ అనుకుంటున్నట్టుగా నేనూ యానిమల్‌ విజయాన్ని ఆస్వాదించాలనుకున్నాను. అందుకు కొంత సమయం కేటాయించాలనుకుంటే ఆ అవకాశం లేకుండాపోయింది. ప్రస్తుతం నా కెరీర్‌లో అతి పెద్ద, కీలకమైన సినిమాల్లో నటిస్తున్నా. దీంతో రాత్రిళ్లూ ప్రయాణాలు చేయాల్సి వస్తోంది.

ఈ కారణం వల్ల చాలా వేడుకల్లో పాల్గొనలేకపోయాను. మీరందరూ నన్ను మిస్‌ అవుతారని నాకు తెలుసు. త్వరలో నా నుంచి వచ్చే సినిమాలు ఆ లోటుని భర్తీ చేస్తాయని నమ్ముతున్నాను. ఆ క్షణాల కోసం ఎదురుచూస్తున్నా.' అంటూ ఆమె చెప్పింది. రష్మిక పుష్ప పార్ట్‌2, ది గర్ల్‌ప్రెండ్‌, రెయిన్‌బో వంటి చిత్రాల్లో ఆమె బిజీగా ఉంది. తాజాగా తన ఇన్‌స్టాలో బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోలు షేర్‌ చేసిన రష్మిక లుక్‌ రివీల్‌ చేయలేదు. అది ఒక సినిమాకు సంబంధించినది కావడంతో రివీల్‌ చేయలేకపోయానని ఆమె చెప్పింది.

Advertisement
 
Advertisement