సీసీ పుటేజీ, వీడియో కవరేజితో స్క్రూటినీ నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

సీసీ పుటేజీ, వీడియో కవరేజితో స్క్రూటినీ నిర్వహించాలి

Nov 24 2026 1:30 AM | Updated on Nov 24 2026 1:30 AM

● సర్పంచ్‌ ఎన్నికల పరిశీలన నిష్పక్షపాతంగా జరగాలి

● మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి

చాపాడు : గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మంగళవారం జరగనున్న నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని సీసీ పుటేజి, వీడియో కవరేజ్‌ మధ్య నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని, పరిశీలన కార్యక్రమాన్ని ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. నామినేషన్ల ప్రక్రియలో ఎన్నో అవాంతరాలు దాటుకొని తమ పార్టీ నేతలు నామినేషన్లు దాఖలు చేశారన్నారు. మైదుకూరు నియోజకవర్గంలో 90 పంచాయతీలకు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు 115 నామినేషన్లు దాఖలు చేశారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మంగళవారం జరగనున్న పరిశీలన కార్యక్రమాన్ని హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రిటర్నింగ్‌ అధికారులు సీసీ పుటేజీ, వీడియో కవరేజ్‌ మధ్య నిర్వహించాలన్నారు. అధికార పార్టీ నేతల ఓత్తిళ్లకు తలొగ్గి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల నామినేషన్ల పత్రాలు పరిశీలనలో ఎలాంటి అవకతవకలు జరిగినా కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. ప్రతి క్లస్టర్‌ నామినేషన్‌ కేంద్రంలో తప్పనిసరిగా తమ సానుభూతి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగాలని, తమ వర్గీయులపై ఎలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చిన చట్టపరమైన చర్యలకు వెళతామన్నారు. తమ అభ్యర్థుల నామినేషన్ల పత్రాలు అనర్హతకు గురైతే వాటికి ఎన్నికల అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పోలీసులు సైతం నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తమ పార్టీ సానుభూతిపరులకు ఎలాంటి ఇబ్బందులు తలపెట్టినా కోర్టును ఆశ్రయిస్తామని, ప్రైవేట్‌ కేసులను సైతం వేస్తామని హెచ్చరించారు.మూడు రోజులపాటు జరిగిన నామినేషన్ల కేంద్రాల వద్ద అధికార పార్టీ నేతలు విచ్చల విడిగా తిరగడం, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను నామినేషన్‌ వేయకుండా అడ్డుకోవడం, ఈ సంఘటనలు తెలిసిన పోలీసులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement