పోలింగ్‌ రోజు సెలవు | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ రోజు సెలవు

Nov 24 2026 1:30 AM | Updated on Nov 24 2026 1:30 AM

– జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్‌

కడప సెవెన్‌రోడ్స్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ జరిగే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు స్థానిక సెలవు ప్రకటించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్‌ తెలిపారు. గ్రామ పంచాయతీల సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులకు మూడు విడతల్లో నవంబర్‌ 26, నవంబర్‌ 29, డిసెంబర్‌ 2 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు ఆయా పోలింగ్‌ తేదీల్లో స్థానిక సెలవు ప్రకటించేలా కలెక్టర్లకు ప్రభుత్వం అధికారాలు కల్పించిందని తెలిపారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

వేంపల్లె : వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌–2027 రాష్ట్రస్థాయి పోటీలకు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ఎంపికై నట్టు డైరెక్టర్‌ విజయప్రకాష్‌ పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌–2047 లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడంతోపాటు వారిలో నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పోటీలకు ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థి షేక్‌ నాసిర్‌ అహ్మద్‌, తృతీయ సంవత్సరం విద్యార్థులు హరిశంకర్‌, బండి గీత, మక్కల వర్షిత, నాయుని కావ్య, పీయూసీ ప్రథమ సంవత్సరం విద్యార్థి పి.భాను ప్రసాద్‌ ఎంపికయ్యారన్నారు.

టీడీపీ నుంచి

వైఎస్సార్‌సీపీలోకి చేరిక

– కండువాలు వేసి పార్టీలోకి

ఆహ్వానించిన మాజీ జెడ్పీటీసీ

వేంపల్లె: వేంపల్లె మండలం బక్కన్నగారిపల్లెలోని ఎస్సీ కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్తలు సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలోకి చేరిన వారందరిని మాజీ జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. చేరిన వారిలో చాపాటి బాలకృష్ణ, చాపాటి గంగయ్య, రామాంజనేయలు, బా బు, ఓబులేసు, శేఖర్‌, భవాని, భాను ప్రకాష్‌లతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరచిన సర్పంచ్‌ అభ్యర్థి రమేష్‌ నాయక్‌ను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రామ నాయకులు మల్లయ్య, రమేష్‌ నాయక్‌, శ్రీను నాయక్‌, నాగ సుబ్బయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement