● డిప్యూటీ మేయర్‌గా ప్రమాణం చేసిన మన్సూర్ అలీఖాన్
● ‘నా దైవం జగన్ సాక్షి’గా అంటూ ప్రమాణం చేసిన వైఎస్సార్‌సీపీ
కార్పొరేటర్ మద్దిక సంధ్యారాణి
కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థలో నూతనంగా ఎన్నికైన మేయర్, కార్పొరేటర్ల ప్రమా ణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. సోమ వారం కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్‌హాలులో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కలెక్టర్ శ్రీధర్ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. మేయర్‌గా మట్లి సువర్ణ, టీడీపీ తరఫున 58 మంది, బీజేపీ తరఫున నలుగురు, వైఎస్సార్‌సీపీ తరఫున ఇద్దరు, జనసేన తరఫున ఇద్దరు ప్రమాణ స్వీకారం చేశారు. 16వ డివిజన్ కార్పొరేటర్ మన్సూర్ అలీఖాన్ డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి హాజరయ్యారు. కమిషనర్ భవానీ ప్రసాద్, అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ప్రమాణం
మొత్తం 66 మంది కార్పొరేటర్లుగా ప్రమాణస్వీకా రం చేయగా వారందరిలో వైఎస్సార్‌సీపీ తరుపున ఎన్నికై న 46వ డివిజన్ కార్పొరేటర్ షేక్ జమీల్, 33వ డివిజన్ తరఫున ఎన్నికై న మద్దిక సంధ్యారాణిల ప్రమాణస్వీకారం ఆకట్టుకుంది. షేక్ జమీల్ ఇంగ్లీషులో అనర్గళంగా ప్రమాణం చేయగా, సంధ్యారాణి ప్రమాణ పత్రాన్ని చూడకుండానే అచ్చ తెలుగులో హుందాగా ప్రమాణం చేశారు. ‘నా దైవం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాక్షి’గా ప్రమాణం చేస్తున్నానని చెబుతూ.. చివర్లో జై జగన్, జోహార్ వైఎస్‌ఆర్ అని నినదించారు. ప్రమాణస్వీకారానికి వచ్చేముందు వారు కార్పొరేషన్ కార్యాలయ భవనంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
33, 46వ డివిజన్ల వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లుగా ప్రమాణస్వీకారం చేస్తున్న సంధ్యారాణి, జమీల్


