పులివెందుల రూరల్ : అప్పుల బాధ తాళలేక ఓ అరటి కాయల వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, నదియా జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన రాజీవ్ విశ్వాస్ మూడేళ్లుగా పులివెందులలోని బాకారాపురం జయమ్మ కాలనీలో ఉంటూ అరటి కాయల వ్యాపారం చేస్తున్నాడు. స్థానిక రైతుల నుంచి కాయలు కొనుగోలు చేసి కడప, అనంతపురం జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవాడు. ఈ క్రమంలో వ్యాపారంలో లక్షల రూపాయల అప్పులు కావడంతో, వాటిని తీర్చలేక మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


