365 వత్తులతో దీపారాధన.. సకల శుభప్రదం! | - | Sakshi
Sakshi News home page

365 వత్తులతో దీపారాధన.. సకల శుభప్రదం!

Nov 24 2026 1:30 AM | Updated on Nov 24 2026 1:30 AM

నేడే మహా కార్తిక పౌర్ణమి.. శివకేశవుల ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ

365 వత్తుల దీపారాధన, జ్వాలాతోరణ దర్శనంతో సర్వపాప హరణం

రాజంపేట టౌన్‌ : హరిహరులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన కార్తిక మాసంలో.. మహా పవిత్రమైన పర్వదినం ’కార్తిక పౌర్ణమి’ వచ్చేసింది. మంగళవారం పౌర్ణమి కావడంతో రాజంపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని శివాలయాలు, శైవక్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో, ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లేందుకు సిద్ధమయ్యాయి.

నేడు కార్తీక పౌర్ణమి పూజలు

కడప సిటీ : కడప నగరంలో మంగళవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వివిధ శైవ, వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆయా శివాలయాలకు మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని కార్తీక దీపోత్సవంలో పాల్గొనున్నారు. అందులో భాగంగా గడ్డిబజారులోని శ్రీ లక్ష్మి సత్యనారాయణస్వామి (బాలాజీగుడి) ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని వివిధ పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు కేహెచ్‌ విజయ్‌భట్టర్‌ తెలిపారు. తెల్లవారుజామునే స్వామి వారికి వివిధ అభిషేకాలు, నిర్వహించడంతోపాటు విశేష కాంకై ర్యాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే సామూహికంగా వ్రతాన్ని ఆచరింపజేయనున్నామని వివరించారు. అదేవిధంగా కడప నగరంలోని మహావీర్‌ సర్కిల్‌లో ఉన్న శ్రీ సుబ్రమణేశ్వరస్వామి ఆలయంలో కూడా పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు అర్చకులు సాందీప్‌ శర్మ తెలిపారు. దోషాలు ఉన్నటువంటి భక్తులకు దోష నివారణకై శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో జరిగే విశేష అలంకార పూజా కార్యక్రమంలో పాల్గొని దోష నివారణ చేసుకోవాలన్నారు.

కార్తిక పౌర్ణమి రోజున వేకువజామునే పవిత్ర స్నానాలు ఆచరించి, బియ్యపు పిండితో ప్రమిదలు చేసి, ఆవు నెయ్యితో 365 వత్తుల దీపారాధన చేస్తే ఏడాది పొడవునా దీపం వెలిగించినంత అనంత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పవిత్ర తిథిన ఏ సత్కార్యం చేపట్టినా దిగ్విజయంగా పూర్తవుతుందని, అందుకే దీనికి ’మహా కార్తికం’ అనే పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో కార్తిక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement