శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

కడప అర్బన్‌ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన, స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, ఎన్నికల భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నియమావళి అమలు తదితర అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలు, సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) కె.ప్రకాష్‌ బాబు, అడిషనల్‌ ఎస్పీ(ఏఆర్‌) బి.రమణయ్య, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ ఎన్‌.సుధాకర్‌ , ఏఆర్‌ డీఎస్పీ నాగేశ్వరరావు, కడప డీఎస్పీ టి.భవాని, జిల్లా లోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement