పిడుగుపల్లె వీఆర్‌ఓ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

పిడుగుపల్లె వీఆర్‌ఓ సస్పెన్షన్‌

Sep 28 2026 1:17 AM | Updated on Sep 28 2026 1:17 AM

కలసపాడు : మండలంలోని పిడుగుపల్లె వీఆర్‌ఓ వేణుగోపాల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. గతంలో కాశినాయన మండలంలో వీఆర్‌ఓగా పనిచేస్తున్న సమయంలో ఓ వివాదాస్పద భూ సమస్యపై అతనిపై ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేశారు. ఆరోపణలు రుజువు కావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు వీఆర్‌ఓ సస్పెండ్‌ ఉత్తర్వులు బద్వేలు ఆర్డీఓకు అందినట్లు సమాచారం.

నేడు పీజీఆర్‌ఎస్‌

కడప సెవెన్‌రోడ్స్‌ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌ సభాభవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) నిర్వహించనున్నట్లు డీఆర్వో మల్లికార్జునుడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు డివిజన్‌, మండల, మున్సిపల్‌ స్థాయిల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. గతంలో సమర్పించిన అర్జీల వివరాలు తెలుసుకోవడానికి 1100 కాల్‌ సెంటర్‌ సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు.

1న కబడ్డీ జిల్లా జట్ల ఎంపికలు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కమలాపురంలోని జెడ్పీహెచ్‌ బాయ్స్‌ హైస్కూల్‌ క్రీడా మైదానంలో అక్టోబర్‌ 1న జిల్లా జూనియర్‌ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు గురిశేఖర్‌ , కార్యదర్శి ఆర్ట్స్‌ సుబ్బయ్య, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జె. వెంకటసుబ్బన్న, తెలిపారు. ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచి ఎంపికై న క్రీడాకారులు అక్టోబర్‌ 16 నుంచి 18వ తేదీ వరకు మార్కాపురంలో నిర్వహించనున్న అంతర్‌జిల్లాల కబడ్డీ పోటీలలో జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు 9989861038, 9390810187 మొబైల్‌ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

29న కడపలో మహాధర్నా

కడప ఎడ్యుకేషన్‌ : ఆల్‌ ఇండియా స్టేట్‌ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ ఫెడరేషన్‌, స్టేట్‌ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు మంగళవారం ఉదయం 10 గంటలకు కడప కలెక్టరేట్‌ ఎదుట మహా ధర్నా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు రామమూర్తి నాయుడు, ప్రధాన కార్యదర్శి నాగముని రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని మండల యూనిట్ల సభ్యులు, కార్యవర్గ సభ్యులు జేఏసీ, జాక్టో, ఫ్యాప్టో, కేంద్ర ప్రభుత్వ సంస్థల విశ్రాంత, వర్కింగ్‌ ఉద్యోగులు పాల్గొని ఈ మహా ధర్నాను విజయవంతం చేయాలన్నారు. పెన్షన్‌ రూల్స్‌ (వాలిడేషన్‌) చట్టం 2025 ను తక్షణమే రద్దు చేయాలని, 8వ వేతన సంఘం పరిధిలో పెన్షన్‌ సవరణ చేపట్టాలని, మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాల డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లతో కూడిన కరపత్రాన్ని వారు విడుదల చేశారు.

విద్యుత్‌ సమస్యలా.. కాల్‌ చేయండి!

కడప కార్పొరేషన్‌ : విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ‘డయల్‌ యువర్‌ సీఎండీ’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్‌ నిర్వహించనుంది. వినియోగదారులు 8977716661కు కాల్‌ చేసి తమ విద్యుత్‌ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు. కాల్‌చేసే ముందు విద్యుత్‌ సర్వీసు నంబరు అందుబాటులో ఉండేలా చూసుకోవడం తప్పనిసరి.

సర్కిల్‌ స్థాయిలోనూ ..

డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కిల్‌ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ‘డయల్‌ యువర్‌ ఎస్‌ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వైఎస్సార్‌ జిల్లా వినియోగదారులు 08562242457 నంబర్‌కు, అన్నమయ్య జిల్లా వినియోగదారులు 9440817449 నంబర్‌క్లు కాల్‌ చేయాలని సూచించారు.

సీపీఐ వైఖరి చెప్పాలి

కడప సెవెన్‌రోడ్స్‌ : శ్రీశైలం నీటిని రాయలసీమ అవసరాలు తీరకుండానే విద్యుత్‌ ఉత్పాదన పేరిట నాగార్జునసాగర్‌కు తరలించడం పట్ల సీపీఐ తన వైఖరి వెల్లడించాలని కేసీ కెనాల్‌ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్‌ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాభావం కారణంగా కేవలం తాగునీటి అవసరాలకే నీరు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అయితే, రాయలసీమకు సుమారు 40–45 టీఎంసీలు మాత్రమే శ్రీశైలం ఇచ్చి నాగార్జునసాగర్‌కు 170 టీఎంసీలు తరలించుకు వెళ్లిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement