పర్యాటకంలో జిల్లాకు రెండు అవార్డులు | - | Sakshi
Sakshi News home page

పర్యాటకంలో జిల్లాకు రెండు అవార్డులు

Sep 28 2026 1:17 AM | Updated on Sep 28 2026 1:17 AM

కడప సిటీ : వైఎస్సార్‌ కడప జిల్లాకు రెండు ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి పర్యాటక అవార్డులు దక్కాయి. ఆదివారం రాజమహేంద్రవరంలోని మంజీరా కన్వెన్షన్‌ హాలులో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర పర్యాటక శాఖ, ఏపీటీడీసీ ఈ పురస్కారాలను అందజేశాయి. గండికోటలో చేపట్టిన సమగ్ర పర్యాటక అభివృద్ధికి, చారిత్రక వారసత్వ పరిరక్షణకు కలెక్టర్‌, జిల్లా పర్యాటక మండలి చైర్‌పర్సన్‌ శ్రీధర్‌ చెరుకూరి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పర్యాటకులకు, ప్రయాణికులకు అత్యాధునిక మౌలిక వసతులు కల్పించినందుకు పులివెందుల డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ బస్‌ టెర్మినల్‌ ఉత్తమ పర్యాటక అనుకూల బస్‌ స్టాండ్‌ అవార్డు దక్కించుకుంది. పులివెందుల ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఏ. ప్రేమ్‌ కుమార్‌, సిబ్బంది దీనిని స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement