నీట్‌గా రాణించారు | - | Sakshi
Sakshi News home page

నీట్‌గా రాణించారు

Sep 26 2026 1:26 AM | Updated on Sep 26 2026 1:26 AM

నీట్‌ పీజీ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో మన విద్యార్థులు ర్యాంకులు సాధించి, తమ పట్టును నిరూపించుకున్నారు. మన్ననలు అందుకున్నారు.

అశ్విత..అక్షర సరస్వతి

బద్వేలు అర్బన్‌ :నీట్‌ పీజీ పరీక్షా ఫలితాల్లో బద్వేలుకు చెందిన గొడిసిపాటి అశ్వితరాయల్‌ 567 మార్కులతో జాతీయ స్థాయిలో 1100వ ర్యాంకు సాధించింది. పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయనగర్‌కు చెందిన జి.అంకయ్య పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తుండగా భార్య రుక్మిణి ఇంట్లో టైలర్‌గా రాణిస్తోంది. వీరి కుమార్తె అయిన డాక్టర్‌ అశ్వితరాయల్‌ 1 నుంచి 10వ తరగతి వరకు పట్టణంలోని రాయలసీమ ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో చదివింది. అనంతరం ఇంటర్మీడియట్‌ నెల్లూరు నారాయణ జూనియర్‌ కళాశాలలో పూర్తిచేసి నీట్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించి నంద్యాల శాంతారామ్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. ఈ సందర్భంగా అశ్వితరాయల్‌ మాట్లాడుతూ పీజీలో రేడియాలజీ లేదా జనరల్‌ మెడిసిన్‌ కావాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement