రేడియాలజీ, జనరల్‌ మెడిసిన్‌ చదవడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రేడియాలజీ, జనరల్‌ మెడిసిన్‌ చదవడమే లక్ష్యం

Sep 26 2026 1:26 AM | Updated on Sep 26 2026 1:26 AM

చాపాడు : రేడియాలజీ లేదా జనరల్‌ మెడిసిన్‌లో సీటు సాధించడమే లక్ష్యంగా చవివానని నీట్‌ పీజీలో 2560వ ర్యాంక్‌ సాధించిన చియ్యపాడుకు చెందిన శ్రీయపురెడ్డి గోపినాథ్‌ రెడ్డి తెలిపారు. చియ్యపాడుకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత, మాజీ జెట్పీటీసీ శ్రీయపురెడ్డి బాల నరసింహారెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు గోపినాథ్‌రెడ్డి చిత్తూరులోని అపోలో మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశాడు. దేశ వ్యాప్తంగా గురువారం విడుదలైన జాతీయ స్థాయి నీట్‌ పీజీ పరీక్షా ఫలితాల్లో 560 మార్కులు సాధించి 2560వ ర్యాంక్‌ సాధించాడు. భవిష్యత్తులో ఎంఎస్‌ కార్డియాలజీ చదివి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement