కడప వైఎస్‌ఆర్ సర్కిల్: కడప నగరంలోని డీఎస్‌ఏ క్రీడా మైదానంలో ఉత్సాహంగా స్కూల్ గేమ్ ఫెడరేషన్ (ఎస్‌జీఎప్) జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. శుక్రవారం ఉషూ, బాక్సింగ్, జూడో పోటీలను నిర్వహించారు. అలాగే చెన్నూరు మండలం రామనపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గట్కా అండర్–17 ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలు ఎస్‌జీఎస్ జిల్లా కార్యదర్శులు విజయలక్ష్మీ, నాగరాజారెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. అనంతరం వ్యాయా మ ఉపాధ్యాయులు విద్యార్థులకు పోటీలను నిర్వహించి జిల్లా స్థాయికి ఎంపిక చేశారు.
అండర్–17 గట్కా బాలికల జట్టు :
ప్రణవి, స్వాతి,నీతు, ధర్మిత, సింధూర, మోక్ష్ఞశ్రీ, జాహ్నరెడ్డి, సుమశ్రీ,
స్టాండ్‌బై: చరిత, రెడ్డి బీ, రోహిత రాయల్.
అండర్–17 బాలుర జట్టు :
మహ్మద్ అల్తాఫ్, నాగ చైతన్య, సయ్యద్ పౌజాన్, నాగ చైతన్య, వెంకట నాగ గౌతమ్ కృష్ణ, కమాల్ భాష, అబ్దుల్ రసూల్.
స్టాండ్‌బై: మౌలాలి, సుజన్ కుమార్.
ఉషూ జట్టుకు ఎంపికై న క్రీడాకారులు :
బాలుర జట్టు:
కుమార్, వీర సురేంద్ర కుమార్, రాధకృష్ణ, హేమంత్, సందీప్‌కుమార్, నాగబస్వేశ్వర రెడ్డి, జయప్రకాశ్.
బాలికల జట్టు:
మోక్షిత, కృష్ణవేణి, వెంకట సాయి భవ్య, అఖిల, ఎల్లమ్మ, హరిప్రియ.
చికిత్స పొందుతూ
గాయపడిన వ్యక్తి మృతి
చక్రాయపేట: మండలంలోని సురభి గ్రామం మహబూబ్ నగర్ సమీపంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న పెద్దిరెడ్డి భార్గవ్ రెడ్డి(32 మృతి చెందినట్లు ఎస్‌ఐ ఎస్‌కెఎం హుస్సేన్ తెలిపారు. మృతుడు అన్నమయ్య జిల్లా కాటమాయకుంట గ్రామం నల్లగుండ్ల పల్లెకు చెందిన వాడని తెలిపారు. మృతుడి తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు వివరాలిలా.. భార్గవ్‌రెడ్డికి చక్రాయపేట మండలంలోని మూలపల్లెకు చెందిన బేబితో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. మూలపల్లెలోని అత్తగారి ఇంటికి వచ్చి తెల్లవారు జామునే ద్విచక్ర వాహనంలో వెళుతుండగా మహబూబ్‌నగర్ సమీపంలో లారీ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు 108లో రాయచోటికి తీసుకెళ్లి అక్కడ నుంచి తిరుపతిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని ..
దువ్వూరు : మండలంలోని టంగుటూరు మెట్ట వద్దనున్న జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృదాడు. పోలీసుల కథనం మేరకు.. రాజుపాళెం మండలం టంగుటూరు గ్రామానికి చెందిన కాసా సుంకిరెడ్డి (61) శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో జిల్లెల్ల వద్దనున్న పొలం వద్దకు స్కూటర్ వెళుతుండగా ఆళ్లగడ్డ వైపు నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం స్కూట్‌ను ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయాడు. బంధువులు అతడిని ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గంమధ్యలో సుంకిరెడ్డి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ధనుంజయుడు తెలిపారు.


