సత్తాచాటిన సునందకుమార్‌ | - | Sakshi
Sakshi News home page

సత్తాచాటిన సునందకుమార్‌

Sep 26 2026 1:26 AM | Updated on Sep 26 2026 1:26 AM

రాజంపేట టౌన్‌ : నీట్‌ పీజీ ఫలితాల్లో రాజంపేట పట్టణం మన్నూరుకు చెందిన నరసాపురం సునందకుమార్‌ సత్తా చాటి తొలి ప్రయత్నంలోనే ఆలిండియా స్థాయిలో 845వ ర్యాంకు సాధించారు. మొత్తం 720 మార్కులకు 570 మార్కులు సాధించి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. సునందకుమార్‌ తండ్రి సురేంద్రబాబు చిరు వ్యాపారి కాగా, తల్లి మల్లీశ్వరి గృహిణి. సునందకుమార్‌ చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తున్నాడు. రాజంపేట పట్టణంలోని సాయి విద్యాలయలో పదవ తరగతి చదివి 9.8 జీపీఏ సాధించాడు. ఇంటర్‌ విజయవాడలోని శ్రీ చైతన్యలో చదివాడు. నీట్‌ యూజీ ఎంట్రెన్స్‌లో 639 మార్కులు సాధించి ఆలిండియాలో 6139 ర్యాంకు, స్టేట్‌లో 250 ర్యాంకు సాఽధించాడు. న్యూరో సర్జన్‌గా వైజాగ్‌లోని ఆంధ్ర యూనివర్శిటీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. న్యూరో సర్జన్‌గా ప్రజలకు ఉత్తమ సేవలు అందించడమే తన లక్ష్యమని సునందకుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement