పవిత్రోత్సవాలకు నేడు అంకురార్పణ | - | Sakshi
Sakshi News home page

పవిత్రోత్సవాలకు నేడు అంకురార్పణ

Sep 23 2026 1:43 AM | Updated on Sep 23 2026 1:43 AM

నులి పురుగులను నిర్మూలిద్దాం

కడప సిటీ : దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 26 వరకు ఈ పవిత్రోత్సవాలు జరగనున్నాయి.

నేడు స్వామి, అమ్మవార్ల కల్యాణం

శ్రవణా నక్షత్రం సందర్భంగా బుధవారం స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ఈ కల్యాణ కార్యక్రమం ఉంటుందని వివరించారు.

30న జిల్లా స్థాయి

యువజనోత్సవాలు

కడప సెవెన్‌రోడ్స్‌ : యువజన సర్వీసులశాఖ రాష్ట్ర కమిషనర్‌, కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈనెల 30న ‘జిల్లా స్థాయి యువజనోత్సవాలు’ నిర్వహించనున్నట్లు స్టెప్‌ సీఈఓ వీరప్రసాద్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగర శివార్లలోని యోగి వేమన యూనివర్శిటీలోని తాళ్లపాక అన్నమాచార్య సెనెట్‌హాలులో ఉద యం 10 గంటల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు జానపద నృత్యం, జానపద గేయం, కవిత్వం, పెయింటింగ్‌ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. వివరాలకు 9849497011, 9866852915 నంబర్లకు ఆఫీసు పనివేళల్లో సంప్రదించాలని సూచించారు.

జిల్లా స్కూల్‌ గేమ్స్‌

కార్యదర్శుల నియామకం

– బీఎన్‌ విజయలక్ష్మి, నాగరాజురెడ్డి ఎంపిక

కడప ఎడ్యుకేషన్‌: జిల్లా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శులుగా కడప జయనగర్‌కాలనీ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌గా పనిచేస్తున్న బీఎన్‌ విజయలక్ష్మి, బద్వేల్‌ బాలుర జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పీఈటీ నాగరాజరెడ్డిలను ఎంపిక చేస్తూ ఏపీ పాఠశాల విద్య కమిషనర్‌ తమీమ్‌ అన్సరియా ఉత్తర్వులను జారీ చేశారు. వీరు 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాకు కేటాయించిన రాష్ట్రస్థాయి క్రీడలు సాఫ్ట్‌బాల్‌ అండర్‌ –17 బాలికలు, ఫుట్‌బాల్‌ అండర్‌ 17 బాలబాలికలు, షటిల్‌ బ్యాడ్మింటన్‌ అండర్‌ 14 బాలబాలికలు, జాతీయస్థాయి అండర్‌ 17 బాలబాలికల సాఫ్ట్‌బాల్‌ క్రీడల పర్యవేక్షణ కార్యదర్శులుగా విధులు నిర్వర్తించనున్నారు.

లక్ష్యసాధనకు కృషి చేస్తున్నాం

– ఏపీఎంఐపీ పీడీ బీవీ రమణ

కడప అగ్రికల్చర్‌: జిల్లాకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు జిల్లా కంపెనీ ప్రతినిధులతో, క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రతి రోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ఏపీ ఎంఐపీ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ బీవీ రమణ ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షిలో ప్రచురితమైన ‘కరువు డప్పు– కానరాని డ్రిప్పు’ వార్తకు ఆయన స్పందించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి బిందు, తుంపర సేద్య పరికరాల కోసం 10,600 హెక్టార్లు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. చీని, నిమ్మ, మామిడి, మిరప పంటల్లో బిందు సేద్యం కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయి సిబ్బందితో పరిశీలించి.. త్వరితగతిన పరికరాలు అందేలా చర్యలు తీసుకుంటామని పీడీ వివరించారు.

కడప సెవెన్‌రోడ్స్‌ : జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ నులి పురుగుల నివారణ మాత్రలు అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కార్యాచరణ బృందం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నులి పురుగుల నివారణ మందు అందించనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 1 నుంచి 2 ఏళ్లలోపు పిల్లలకు 200 మిల్లీగ్రాముల ఆల్బెండజోల్‌, 3 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు 400 మిల్లీగ్రాముల ఆల్బెండజోల్‌ మాత్రలను మధ్యాహ్న భోజనం అనంతరం మింగించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్‌ 25న, అలాగే మాత్రలు తీసుకోలేకపోయిన పిల్లలకు అక్టోబర్‌ 5న నులి పురుగుల నివారణ మందు అందించే కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. నులి పురుగుల నివారణతో పాటు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులతోపాటు కార్యక్రమ నిర్వాహకుడు ఆర్‌బీఎస్‌కే ఎం. రామమూర్తి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement